స్వచ్ఛ్ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు అడుగుల
విజినరీ ఉన్న నాయకుడు చంద్రబాబు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
జలదంకి, మేజర్ న్యూస్ :-
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజినరీ ఉన్న నాయకుడని, రాష్ట్రాన్ని స్వచ్ఛ్ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చి దిద్దే ఎందుకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమం భాగంగా గ్రామాల్లో పరిశుభ్రతే లక్ష్యంగా అడుగులు వేస్తూసు పరిపాలన కొనసాగిస్తున్నాట్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బ్రాహ్మణక్రాక అగ్రహారంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని లక్ష్యంతో పాటు ఆ కుటుంబాల పరిశుభ్రతే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ భారత్ కు శ్రీకారం చుట్టారన్నారు. పరిసరాల, పరిశుభ్రం ఉన్నప్పుడే గ్రామాలంత పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఉంటాయని అలాగే ఆరోగ్యం సక్రమంగా ఉంటుందని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతే లక్ష్యంగా చర్యలు చేపడతారని ఆయన తెలిపారు. . ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ కు తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పంచాయతీ పాలకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆ దిశగా చర్యలుతీసుకొని గ్రామాల స్వచ్ఛతకు అభివృద్ధి చేయాలని సూచించారు. . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పంచాయతీల్లో నెలకొల్పిన చెత్త నుండి సంపద కేంద్రాలను అన్ని మండలాల్లో వినియోగం లోకి తీసుకొని రావడం జరిగింది అన్నారు. గ్రామంలోని తడి పొడి చెత్తలను సంపద కేంద్రాలకు తరలించి ఎరువులు తయారు చేసి. ఆయా పంచాయతీలకు సంపదను సృష్టించడం జరుగుతుందన్నారు. ప్రతినెల మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అన్నారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల ప్రజలు గ్రామాల పరిశుభ్రం ఉంచుకొని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జలదంకి మండలంలో గ్రౌండ్ వాటర్ ను పెంపొందించేందుకు 100 ఇంకుడు గుంటలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకొని నీటిని సంరక్షించుకోవాలని తెలిపారు. ముందుగా బి కే అగ్రహారం గ్రామంలో టిడిపి నాయకులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి,
ఎంపీపీ గోచిపాతల వెంకట రమణయ్య, తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి, టిడిపి నాయకులు దగ్గు మాటి మాల్యాద్రి రెడ్డి,చిత్తా బత్తినమస్తాన్ రెడ్డి, లింగం గుంట దశరథ రామానాయుడు, స్వర్ణ కొండపు నాయుడు, బిజెపి నాయకులు చల్ల హనుమారెడ్డి, బండారు తిరపతి రెడ్డి, బ్రాహ్మణ క్రాక సర్పంచ్ ఇండ్ల సుధాకర్, టిడిపి నాయకులు గంట అశోక్, గంగపట్ల మాలకొండయ్య, దగ్గు మాటి శ్రీనివాసులురెడ్డి, మేదరమెట్ల శేషారెడ్డి, పాండురంగారెడ్డి, గంట సుబ్బానాయుడు, ఎంపీటీసీ కుట్టు బో యిన మాధవరావు, జనసేన నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య, ఎంపీడీవో బ్రహ్మయ్య, తాసిల్దార్ ప్రమీల, ఆర్డబ్ల్యూసీ మసూద్ అహ్మద్, ఏపీవో శ్యామల, పంచాయతీ సెక్రటరీ నీరజ, సచివాలయసిబ్బంది, గ్రామస్తులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.