కావలి దుత్తలూరు జాతీయ రహదారి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేసిన బిజెపి పట్టణ శాఖ.
భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో జరిగిన పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం మరియు నూతన జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు కావలి పట్టణం బ్రిడ్జి సెంటర్లు నందు డిజిటల్ స్క్రీన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కావలి పట్టణ అధ్యక్షులు కుట్టు బోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కావలి దుత్తలూరు జాతీయ రహదారికి 424 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఈరోజు పలు జాతీయ రహదారులుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా మన కావలి దుత్తలూరు జాతీయ రహదారులుకు కూడా శంకుస్థాపన చేశారు. మన కావలి నుండి వీక్షించేందుకు బ్రిడ్జి సెంటర్ నందు డిజిటల్ స్క్రీన్ ను బిజెపి పట్టణ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది.కావలి పట్టణం లో కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు కందుకూరు సత్యనారాయణ గారు మాట్లాడుతూ మెట్ట ప్రాంత అభివృద్ధికి జాతీయ రహదారి విస్తరణ ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 21 559 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని తెలిపారు. అందులో భాగంగా 424 కోట్ల రూపాయలను కావలి దుత్తలూరు జాతీయ రహదారికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కావలి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత పథకం నిధులు కేటాయిస్తే వాటిని దారి మళ్ళించి అభివృద్ధి నిరోధకంగా ఈ రాష్ట్రప్రభుత్వం మారిందని తెలిపారు .కావలి నియోజకవర్గం లో అవినీతి రాజ్యమేలుతోందని ,ఇసుక మాఫియా,గ్రావెల్ మాఫియా,భూ దందా ఇలా అనేక విధాలుగా అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్మోర్చా కార్యదర్శి కంచర్ల మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రెండూ కూడా అవినీతి పార్టీలు అని తెలిపారు. విజయవాడలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. కావలి దుత్తలూరు జాతీయ రహదారి విస్తరణ కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కావలి పట్టణంలో అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూనూరు మాధవిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమా రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు, లక్కరాజు భాస్కర్, బాలు యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, కార్యదర్శి సుందర సెట్టి సుజీ, పట్టణ ట్రెజరర్ కృష్ణ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు పరుసు వెంకటేశ్వర్లు ,ఎస్ సి మోర్చా జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాసులు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు శివప్రసాద్, మాజీ అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం, బోగోలు మండల అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వర్లు, జలదంకి మండల అధ్యక్షులు బ్రహ్మారెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు బెల్లంకొండ మాల్యాద్రి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దారా శ్రీనివాసులు, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి కూరాకుల సవీంద్ర, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి, కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మంగమూరు వెంకటరెడ్డి, ఎస్ సి మోర్చా పట్టణ అధ్యక్షులు జలదంకి విజయ్ కుమార్ ,పట్టణ సీనియర్ నాయకులు పాతపాటి రమణారెడ్డి , పంది రవీంద్ర, దామోదర్ నాయుడు, పొన్నగంటి మురళి స్వరూప్, ప్రదీప్ , సుబ్బారావు ప్రసాద్ రెడ్డి , పార్థసారథి ,జై రామ్ రెడ్డి, కావలి రూరల్ మండల బీజేపీ నేతలు జలదంకి మండలం నాయకులు బోగోలు మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.