ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వీడాలి.
ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వీడాలి.
విడవలూరు మేజర్ న్యూస్.
నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికైనా నిద్రలేచి, నిర్లక్ష్యం వదలి రైతుల కోసం పనిచేయాలని మండలంలోని చౌక చర్ల గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు మండలంలోని చౌకచర్ల గ్రామ చెరువు వద్ద గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 ఎకరాల విస్తీర్ణం కలిగిన చౌక చర్ల చెరువుకు 7 తూములు ఉన్నాయని, ఈ తూముల ద్వారా దాదాపు 4 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి చెరువుకు ఉన్న రెండు తూములలో నీటిని నియంత్రించే చెక్కలు దెబ్బతిన్నాయని వీటిని మరమ్మత్తులు చేయాలని సంబంధిత అధికారులు కోరినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆ రెండు తుమ్మల కింద ఉన్న వరి సాగు పొలాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నీటిని నియంత్రించే చెక్కలు దెబ్బ తినటంతో చెరువులోకి వచ్చిన కొద్దిపాటి నీరు కూడా ఈ తిరుమల నీటిని నియంత్రించే చెక్కలు దెబ్బ తినటంతో చెరువులోకి వచ్చిన కొద్దిపాటి నీరు కూడా ఈ తూముల ద్వారా పంట పొలంలోకి చేరి పొలాలు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చెరువుకు వచ్చే కాలువను కూడా పూడిక తీయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే చెరువు కలుజు విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. దీనివల్ల చెరువు ఆయకట్టు పరిధిలోని రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని త్వరలోనే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి రైతుల కొరకు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు చిన రాగయ్య, సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, విజయ, గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు