నెల్లూరు రూరల్ లోని వన మహోత్సవం కార్యక్రమం లో రాష్ట్రమంత్రి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్
నెల్లూరు రూరల్ (మేజర్ న్యూస్ )
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ కొత్తూరు లోని నగరవనం నందు వన మహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ మరియు శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్,ఎ.స్పీ, డీ.ఎఫ్.ఓ మరియ ఇతర జిల్లా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగింది.
వి ఎస్ యు లో తెలుగు భాషా వైభవం ముగింపు రోజు ...
వెంకటాచలం మేజర్ న్యూస్....
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, తిక్కనసాహితీ పీఠం తెలుగు శాఖ వారు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 161 వ జన్మదిన సందర్భంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో "తెలుగు భాష వైభవం" అనే రెండు రోజుల జాతీయ సదస్సులో ముగింపు కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్ర పటానికి పూలమాల అలంకరించిన పిదప మాట్లాడుతూ తెలుగు వారి సంస్క్రతి, ప్రాచీన సాహిత్య విశిష్టత, పుస్తక పఠనం ఆవశ్యకత గురించి తెలిపారు.తెలుగు భాష. కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత గిడుగు వారు వ్యావహారిక భాషా సేవ ను కొనియాడుతూ, మాతృ భాషలో మన భావ ప్రకటన స్వేచ్ఛగా చేయగలిగినపుడే ఇతర భాషలు సులభంగా నేర్చుకో గలం అన్నారు.
ఈ కార్యక్రమంలో గిడుగు రామ మూర్తి గారి జీవిత విశేషాలు,రచనలు అనే అంశంపై డాక్టర్ కరి మద్దెల నరసింహారెడ్డి ప్రసంగిస్తూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. డాక్టర్ గంగిసెట్టి శివకుమార్ గిడుగు వారి వ్యావహారిక భాషా సేవ గురించి వివరించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ తెలుగు శాఖ అధిపతి డాక్టర్ ఎం. త్యాగరాజు విశ్వవిద్యాలయ ఆచార్యులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
వి ఎస్ యూ లో జాతీయ క్రీడా దినోత్సవం...
వెంకటాచలం మేజర్ న్యూస్...
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో క్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సంద ర్భంగా ఆయన చిత్రపటానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్.విజయభాస్కర రావు మరియు రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి మాట్లాడుతూ1905 ఆగస్టు 29న ధ్యాన్‌చంద్ జన్మించారని హకీ ఆటలు మెరుపువేగంతో గోల్స్ చేయగల మాంత్రికుడిగా ఆయన క్రీడా చరిత్రలో సుస్థిర స్థానం సాధించారు. మైదానంలో పాదరసంలా కదిలిపోతూ బంతిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరారని తెలిపారు.
1928 ఆమ్‌స్టర్‌డామ్,1932 లాస్ ఏంజిలెస్,1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌కే దక్కింది. ధ్యాన్‌చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పతకాలు గెలిచారు.
స్పోర్ట్స్ డే సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు విశ్వవిద్యాలయ ఉపకులపతి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ, స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఎం.హనుమారెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు వ్యవహారిక భాషకు గిడుగు సేవలు మరువలేనివి
- నివాళులర్పించిన కలెక్టర్ ఆనంద్
- ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
నెల్లూరు, ఆగస్టు 28 : తెలుగును వాడుక భాషగా తీసుకురావడానికి గిడుగు వెంకటరామమూర్తి ఎంతో కృషి చేశారని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ అన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లో గిడుగు వెంకటరామమూర్తి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగుభాషకు గిడుగు వెంకటరామమూర్తి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. గ్రాంధిక భాషలో వున్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకుని భాషను అందరికి సులభతరం చేసిన గొప్ప చరిత్రకారుడు, బహుభాషా శాస్త్రవేత్త గిడుగు వెంకటరామమూర్తి అని కొనియాడారు. గిడుగు భాషోద్యమం వలన ఏ కొందరికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన గిడుగు రామమ్మూర్తి స్ఫూర్తితో ప్రతిఒక్కరూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.
తొలుత గిడుగు చిత్రపటానికి కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డిఆర్‌వో లవన్న తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో
గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవ వేడుకలను జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావు, అధికారులు, సిబ్బంది గిడుగు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని కార్యాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. సదారావు, జిల్లా రవాణా డిప్యూటీ కమిషనర్ చందర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయ్‌కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు వారిచే జారీ
ఇంద్ర వోల్వా బస్సును ఢీ కొట్టిన టిప్పర్
* పలువురికి గాయాలు
నెల్లూరు క్రైమ్ (మేజర్ న్యూస్)
నెల్లూరు నగరంలోని కెవిఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ వోల్వా బస్సును అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నెల్లూరు నగరంలో అర్ధరాత్రి దాటాక ఇసుక, గ్రావెల్ టిప్పర్లు, లారీలలో అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుంది. ఈ క్రమంలో పట్టించుకునే అధికారులు లేకపోవడంతో గ్రావెల్ మాఫియా వారి వాహనాలను అతివేగంతో ఢీకొంటున్నాయి. ఆర్టీసీ బస్సును కూడా అతివేగంతో ఢీకొనడంతో డ్రైవర్ తో పాటు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రామచంద్ర రెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సౌత్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.