మేజర్ బాలిక మిస్సింగ్ కేసును ఎఫ్ ఐ ఆర్ కట్టి త్వరితగతిన చేదించండి బుచ్చి సి ఐ గారి కి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఫోన్ కాల్.
బుచ్చి కొత్త బస్టాండ్ వద్ద గల శివాలయ ఎదురుగా చిన్నపాటి వ్యాపారం నడుపుకుంటున్న మహిళ నాగ నిర్మల తన కూతుర్ని మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి నుంచి లాకెళ్ళారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ జనసేన పార్టీని ఆశ్రయించడంతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఈరోజు సందర్శించి పోలీస్ స్టేషన్లో సిఐ గారికి తో మాట్లాడి కేసును ఎఫైర్ కట్టించి త్వరితగతిన మిస్సయిన బాలికను ప్రతిఘటన పట్టించాలని కోరారు...
బాలిక తల్లిదండ్రులు విచారించి విచారించగా ఫిర్యాదు మాత్రమే ఇచ్చారని కేసు కట్టమని తెలపలేదని వెంటనే కేసు కట్టి విచారణ చేపట్టి బాలికను పట్టుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా జనసేన జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ.....
మగదిక్కు లేని ఇద్దరు మహిళలు తమ బిడ్డను తెల్లవారుజామున ఇంటికి ఇంటి నుంచి అపహరించకపోయారని పోలీసులకు తెలిపే రెండు రోజులైనా ఆచూకీ లేదని జనసేన పార్టీ ని ఆశ్రయించారు.
బాలిక మిస్సింగ్ కేసు ఆషామాషీగా చూడడం తప్పు... మేజర్ పాలికే కదా మరో రెండు రోజుల్లో తిరిగి వస్తుందని ఎవరో అధికారులు తెలపడం హేయమైన చర్య..
C i గారు వెంటనే స్పందించి కేసు కట్టి విచారణ చేపడతానని హామీ ఇచ్చారు.
ఆడబిడ్డకి ఆపద అని తెలపిన తక్షణమే స్పందించి సిఐ గారికి కేసును చేదించమని ఆదేశించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు అని తెలిపారు.
వీలైనంత త్వరగా బాలికను తల్లిదండ్రులకు అప్పగించే వరకు కూడా జనసేన పార్టీ తరఫున మద్దతుగా నిలుస్తామని తెలిపారు.
ప్రజల్లో ఉండే నమ్మకాన్ని నిలబెట్టుకునే సేవలు అందించాలి, జిల్లా కలెక్టర్ ఆనంద్
నెల్లూరు, కలెక్టరేట్
రెవిన్యూ శాఖపై ప్రజల్లో ఉండే నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా రెవిన్యూ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా వారికి సేవలు అందించాలని
జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు.
బుధవారం ఉదయం పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్ కార్యాలయం పక్కన రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవిన్యూ ఫిల్లింగ్ స్టేషన్ ను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల ద్వారా పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారంటే, నాణ్యతా పరిమాణాలు సక్రమంగా ఉంటాయని ప్రజలు నమ్ముతారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సేవలు అందించాలన్నారు. పూర్వపు జిల్లా కలెక్టర్ యం హరి నారాయణన్ ఈ పెట్రోల్ బంకు అనుమతులు, స్థల సేకరణ కొరకు విశేష కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం రెవిన్యూ అసోసియేషన్ కు అందచేస్తున్నందున, ఆ మొత్తాన్ని ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయవలసిందిగా కోరారు.
నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పోలీసు, సివిల్ సప్లైస్, జైల్ తదితర శాఖల ద్వారా పెట్రోల్ బంకులు నడుస్తున్నాయని, వారితో రెవెన్యూ శాఖ ఆరోగ్యవంతమైన వాతావరణంలో పోటీపడి ప్రజలకు సేవలు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఆర్ఓ పద్మావతి, ఆర్డీవో మలోల, ఐఓసీ డివిజనల్ హెడ్ అనిల్ కుమార్, రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
మనమంతా 5 సంవత్సరాలు కష్ట పడి పనిచేద్దాం - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చుకుందాం
కార్యకర్తల్లో భరోసా నింపిన..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో, ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి,YCP జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని..నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తల్లోభరోసా నింపుతుందన్నారు .
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని..పార్టీ అధికారంలోకి రాలేదని కార్యకర్తలు ఎవరు నిరుత్సాహ పడవద్దని సూచించారు .
..కార్యకర్తలు అందరూ సమిష్టిగా కష్టపడి పని చేస్తే ఐదు సంవత్సరాల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావచ్చని కార్యకర్తలకు భరోసానిచ్చారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ ఉన్న నాయకుడని.. ఎంత కష్టం వచ్చినా ప్రజలకు , కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని తెలిపారు.
కార్యకర్తలకు ..పార్టీ అండగా ఉంటూ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించడం జరుగుతుందన్నారు.
కాలినడకన మాలకొండకు టిడిపి నేత నూకరాజు మదన్ మోహన్ రెడ్డి
.. కోటంరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించడంతో మొక్కు తీర్చుకునేందుకు పయనం
ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా 3 వ సారి అఖండ విజయం సాధించడంతో తమ ఇలవేల్పు మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి దగ్గరకి కాలినడకన మొక్కు తీర్చుకునేందుకు 19 డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతి నూకరాజు మదన్ మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమానికి టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత, మాజీ మేయర్ భాను శ్రీ తదితరులు హాజరయ్యారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అనంతరం వారు కాలినడకన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూకరాజు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారని, తన మొక్కును తీర్చుకునేందుకు 50 మందితో కలిసి కాలినడకన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలని ఆ దేవుడిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, టిడిపి నేతలు పాల్గొన్నారు.
ఉచిత ఇసుక పాలసీ పేద ప్రజల కోసం అక్రమ రవాణా దారుల కోసం కాదు.
పేదల సొంతింటి కల నెరవేరాలని చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేశారు.
జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఇసుకపాలసి వల్ల వేలమంది భవన కార్మికులు ఇబ్బందులు పడ్డారు.
అక్రమ రవాణాదారులపై అధికారులు ఉక్కుపాదం మోపాలి.
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.
నెల్లూరు నగరంలో మంగళవారం నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ కామెంట్స్
పేదలపై ఇసుక భారం పడకూడదు పేదల సొంతింటి కల నెరవేరాలని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
ఫ్రీ శ్యాండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేశారు.
జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఇసుకపాలసి వల్ల వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పాలయ్యారు. వారం వారం తమ సెంట్రింగ్ సామాన్లు అమ్ముకొని జీవనం సాగించిన పరిస్థితులు చూశాం.
పేదవాడు సొంతింటిని నిర్మించాలంటే ఇంటి ఖర్చు పది లక్షల అయితే అందులో ఇసుక ఖర్చే రెండు లక్షలు అయ్యేది.
ఫ్రీ స్యాండ్ పాలసీ అమలుతో భవన నిర్మాణ కార్మికులు పేద బడుగు బలహీన వర్గాలు హర్షిస్తున్నారు.
ఇసుక అందుబాటులో ఉండటం వల్ల సోషియో ఎకనామిక్ గ్రోత్ పెరిగి కాస్ట్ ఆఫ్ క్యాపెక్స్ తగ్గి, ఇల్లు ఫ్యాక్టరీలు కట్టే వారిపై భారం తగ్గుతుంది.
జగన్మోహన్ రెడ్డి పాలనలో నాలుగు నుంచి ఐదు వేలు అయ్యే ట్రాక్టర్ ఇసుక నేడు ఉచితంగా అందనుంది.
గత వైసిపి పాలనలో గొల్ల కందుకూరు ఇసుక రీచ్ లో 50వేల క్యూబిక్ మీటర్లకు అనుమతి ఉండగా ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించి అవినీతికి పాల్పడ్డారు.
గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఇసుకలో 50 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది.
సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా ఉచిత ఇసుక పాలసీని అందిస్తాం.
అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించడానికి ఇసుక రీచ్ లలో నిరంతర విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుంది. జిల్లా స్థాయి సాండ్ కమిటీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
ఉచిత ఇసుక పాలసీలో అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలి. ఉచిత ఇసుక పాలసీ పేద ప్రజల కోసం అక్రమ రవాణా దారుల కోసం కాదు.

అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కార్యవర్గ సమావేశము నిర్వహించడం జరిగింది
ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్ర రెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేంద్ర యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగి రెడ్డి పాల్గొనడం జరిగింది
ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుడు యొక్క పిల్లలకు ఉచిత విద్య అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అది కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఉచితంగా అందించాలని గత ప్రభుత్వం లో ఇది జర్నలిస్టులకు నోచుకోలేదని ఈ ప్రభుత్వంలో జర్నలిస్ట్ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆయన తెలియజేశారు సమస్యలు ఏవైనా కూడా తన దృష్టికి వచ్చింది వెంటనే పరిష్కారం దిశగా మేము ముందుకు వెళ్దామని జర్నలిస్ట్ పిల్లలు ఉచిత విధితోపాటు ఇంటి పట్టాలు మరియు హెల్త్ కార్డులు సమస్య ప్రస్తుతం రాష్ట్ర కమిటీ కూడా ఈ సమస్యల పైన పోరాటం చేస్తుందని తెలియజేశారు
జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ మునుపటిలో ప్రభుత్వంలో జర్నలిస్టుల పైన జరిగిన దాడులు ప్రతిఘటిస్తూ జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో పలు ఉద్యమాలు నిర్మించిందని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పోరాటం చేసినందుకు ప్రతిఫలంగా సమస్యలు పరిష్కారం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా జోగిరెడ్డి మరియు కడపల మల్లికార్జునరావు మన సమస్యల పైన ప్రసంగించారు మీటింగ్ కు జిల్లా కమిటీ లందరూ కూడా పాల్గొన్నారు,