అతి త్వరలో వినియోగంలోకి జిల్లాలోని ఇసుక రీచ్ లు
అవసరమైన అనుమతుల కోసం యుద్ద ప్రాతిపదికన చర్యలు
ప్రత్యామ్నాయంగా సరిహద్దు జిల్లాల నుండి ఉచిత ఇసుక పొందే అవకాశం
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఇసుక కమిటీ చైర్మన్ చదలవాడ నాగరాణి
సాధ్యమైనంత త్వరగా జిల్లాలోని ఇసుక రీచ్ లను వినియోగంలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నామని, అప్పటి వరకు జిల్లా వాసులు సమీపంలోని కోనసీమ. తూర్పు గోదావరి జిల్లాలలోని ఇసుక నిల్వ కేంద్రాల నుండి ఉచిత ఇసుక పొందవచ్చని పశ్చిమ గోదావరి కలెక్టర్, జిల్లా ఇసుక కమిటీ చైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఇసుక కేంద్రాలు భీమవరం, నర్సాపురం పట్టణాలకు 50- 60 కి.మీ.ల దూరంలో ఉన్నాయని, జిల్లాలోని 5 మండలాలకు అతి సమీపంలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. నిడదవోలు మండలం పందలపర్రు కేంద్రంలో 52,082, పెరవలి మండలం పెండ్యాల కేంద్రంలో 1,46,249, ఉసులుమర్రులో 33,065 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. కోనసీమ జిల్లాలో మూడు ఇసుక నిల్వ కేంద్రాలు 15-30 కి.మీ.ల దూరంలో, జిల్లాలోని 5 మండలాలకు అతి సమీపంలో ఉన్నాయన్నారు. రావులపాలెం మండలంలోని రావులపాడు-1 కేంద్రంలో 34,171, రావులపాడు-2లో 82,950, కొత్తపేట కేంద్రంలో 25,897 మెట్రిక్ టన్నులు సిద్దంగా ఉందన్నారు. జిల్లాలోని ఆచంట, పెనుగొండ మండలాలలోని ఆరు ఓపెన్ ఇసుక రీచ్‌లు పనిచేయడంలేదని కలెక్టర్ సి.నాగరాణి వివరించారు. విభిన్న అనుమతులు పొందవలసి ఉందన్నారు. యలమంచిలి, నర్సాపురం ప్రాంతాలలో ఐదు డీ-సిల్టేషన్ పాయింట్లు ఉండగా, జలవనరుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుండి అనుమతులు తీసుకోవలసి ఉందన్నారు. ఈ నేపద్యంలో జిల్లాలోని ఆరు ఇసుక కేంద్రాలలో ఎటువంటి నిల్వలు లేవని చదలవాడ నాగరాణి వివరించారు. రేవుల వద్ద వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు, ప్రభుత్వం వారికి చెల్లించవలసిన సీనరేజ్, జీఎస్టీ తదితర ఖర్చులు మాత్రమే ఉంటాయన్నారు. మైన్స్ అండ్ జియాలజీ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉన్నాయని, వినియోగదారులు తమ ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలను చూపి ఇసుక పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. వినియోగదారుడి నుంచి డిజిటల్ పేమెంట్ కు మాత్రమే అనుమతి ఉంటుందని నాగరాణి స్పష్టం చేసారు. ఒక వ్యక్తికి ఒక రోజులో కేవలం 20 టన్నులు మాత్రమే తీసుకు వెళ్ళడానికి అనుమతి ఉంటుందన్నారు. స్టాక్ పాయింట్ల నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుకను పొందడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద వాహనాలలోకి లోడింగ్ చార్జీలు, ప్రభుత్వానికి చెల్లించవలసిన సీనరేజ్, తదితర ఖర్చులు చెల్లిస్తే సరిపోతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
సూళ్లూరుపేట టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ
సూళ్లూరుపేట రైల్వే గేటు నుండి పురవీధుల గుండా ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ
సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ కి అపూర్వ స్వాగతం
ఎమ్మెల్యే డాక్టర్ విజయ శ్రీ కి గజమాల వేసి ఘన స్వాగతం పలికిన టిడిపి, బిజెపి , జనసేన శ్రేణులు
ఎమ్మెల్యే డా "విజయశ్రీ కి అడుగు అడుగున బ్రాహ్మరధం పట్టిన ప్రజలు, టిడిపి, బిజేపి, జనసేనా నాయుకులు, కార్యకర్తలు
సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే కు అపూర్వ స్వాగతం
సూళ్లూరుపేట లోజరిగిన టిడిపి విజయోత్సవ ర్యాలీలో
జన జాతర
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ విజయ శ్రీ కి విజయోత్సవ ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రైల్వే గేటు వద్ద నుండి ర్యాలీ ప్రారంభించి పట్టణ పురవీధుల గుండా ర్యాలీ కొనసాగి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఎన్డీఏ కూటమి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఒకటి నారాయణరెడ్డి, ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నెలవల రాజేష్,సుధాకర్ రెడ్డి , మాధవ నాయుడు, సురేష్ నాయుడు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు బిజెపి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయోత్సవ సభను విజయవంతం చేశారు.
నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యం
రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ నివాసంలో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశం అనంతరం మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కావ్యా కృష్ణారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్
ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరై వివిధ అంశాలపై చర్చించిన కలెక్టర్ ఆనంద్, జేసీ సెతుమాధవన్
మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి నెల్లూరు జిల్లాను సర్వనాశనం చేశారు. ఏ విషయంలోనూ వృద్ధి లేదు
దగదర్తి ఎయిర్ పోర్టు, దుగరాజపట్నం పోర్టును సాధించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది
ఇఫ్కో కిసాన్ సెజ్ లో 2 వేలు ఎకరాలు ఖాళీ, ముత్తుకూరులో రిలయన్స్ భూములు 2200 ఎకరాలు ఖాళీ, పోర్టు ఎస్ఈజెడ్ లో ఐదు వేల ఎకరాలు ఖాళీ....వీటన్నింటిలో పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంపై చర్చించాం
కృష్ణపట్నం పోర్టు నుంచి తరలిపోయిన కంటైనర్ టెర్మినల్ ను పునరుద్ధరిస్తే ఉద్యోగాలు కోల్పోయిన 12 వేల మందికి తిరిగి ఉపాధి లభిస్తుంది
ఇరిగేషన్ శాఖ పరిధిలో పార మట్ట ఎత్తకుండానే బిల్లులు చేసుకున్న వైనంపై విచారణ జరపడంపైనా చర్చించాం
పీఓటీ చట్టం పేరుతో పేదల గొంతు కోసి వైసీపీ పెద్దమనుషులు తక్కువ ధరలకే భూములు కాజేసిన వైనంపై విచారణ జరపడంతో పాటు తిరిగి పేదలకు భూములు చెందేలా చేయాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం
జిల్లాలో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి రైతు బిడ్డలకు న్యాయం జరగడమే ధ్యేయంగా పనిచేస్తాం
ఈనాడు పత్రికకు సోమిరెడ్డి పేపర్ బాయ్" - కాకాణి
నెల్లూరు డైకస్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
కాకాణి మాట్లాడుతూ..
జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన ప్రతిదానికి జవాబు ఇచ్చాం.
నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక పత్రికలలో వ్యక్తిగతంగా రాస్తున్నారు.
సోమిరెడ్డి ఈనాడు పత్రికకు "పేపర్ బాయ్" అవతారం ఎత్తాడు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం, అక్రమ లేఔట్లను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది.
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించారు.
సోమిరెడ్డి అనుచరుడు పొదలకూరు పోలేరమ్మ మాన్యాన్ని ఆక్రమిస్తే స్థానికులు అడ్డుకొని, ఆక్రమణలు తొలగించారు.
2019లో బిజెపికి సంబంధించిన వ్యక్తి ఇచ్చిన అర్జీ మీద జిల్లా కలెక్టర్ గారు అక్రమ లేఔట్లపై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
తెలుగుదేశం పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో సోమిరెడ్డి మంత్రిగా వెలగబెట్టిన సమయంలో 40 అక్రమ లేఔట్లు గుర్తించామని అధికారులు కలెక్టర్ గారికి నివేదికలు అందజేశారు.
25 లేఔట్లకు ల్యాండ్ కన్వర్షన్ కూడా జరగలేదని గుర్తించారు.
విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి 6 కోట్ల 52 లక్షల 36వేల 405 రూపాయలు అక్రమ లేఔట్ల యాజమాన్యాల నుండి వసూలు చేయమని మెమో జారీ చేశారు.
అక్రమ లేఔట్ల యాజమాన్యాల నుండి 2 కోట్ల రూపాయలు ముడుపులు దండుకొని, సోమిరెడ్డి పంచాయతీ కార్యదర్శులను బెదిరించి, పెనాల్టీ వసూలు చేయకుండా అడ్డుకున్నాడు.
సోమిరెడ్డి ధన దాహానికి పంచాయతీ కార్యదర్శులు బలి అయ్యే పరిస్థితి ఏర్పడింది.
అక్రమ లేఔట్లు వేసి సంపాదించుకున్న యాజమాన్యాలు, దండుకున్న సోమిరెడ్డిని విడిచి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని ఆనాడు కలెక్టర్ గారికి నివేదించాం.
సోమిరెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా...!
ఈరోజు సోమిరెడ్డి ఈనాడు పేపర్ బాయ్ అవతారం ఎత్తి, మంత్రి ఊరు.., మంత్రి ఇలాకా అంటూ రాయిస్తున్నాడు.
సోమిరెడ్డీ.., నీ అల్లీపురం ఇంటి చుట్టూ ఉన్న అక్రమ లేఔట్లకు ఎంత ముడుపులు తీసుకొని మిన్నకుండిపోయావు.
సోమిరెడ్డీ.. దమ్ముంటే, నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమ లేఔట్ల పై విచారణ జరిపించు...
ఈనాడు పేపర్ అధినేత చెరుకూరి కిరణ్ (తండ్రి రామోజీరావు) గారికి బహిరంగ లేఖ రాస్తున్నా..
పొదలకూరులో డబ్బులు దండుకొని, అనుమతులు ఇచ్చే సంప్రదాయం సోమిరెడ్డిదని విచారించి, రాయగలవా!.
కృష్ణాపట్నం ఏపీ జెన్కో నుండి నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రతినిత్యం బల్కర్లతో ఫ్లై యాష్ తరలిస్తూ, సోమిరెడ్డి బల్కర్ కు నెలకు లక్ష రూపాయల చొప్పున సొమ్ము చేసుకుంటున్నాడు.
నుడా అనుమతులున్న లేఔట్ యాజమాన్యాలను బెదిరిస్తూ, అక్రమంగా కోట్లాది రూపాయలు సోమిరెడ్డి వసూలు చేస్తున్నాడు.
"సర్వేపల్లికే నా జీవితం అంకితం" అన్న సోమిరెడ్డి, లేఔట్ యాజమాన్యాలకు "సర్వేపల్లి మొత్తం రాసిస్తా.. నాకు ఎంత ఇస్తారన్న" చందంగా, చందాలు దండుకుంటున్నాడు.
సోమిరెడ్డి సర్వేపల్లిలోని కంపెనీ యాజమాన్యాలను బెదిరించి, ఎన్నికల ఖర్చు అయ్యిందంటూ, సొమ్ములు జమ చేసుకుంటున్న మాట వాస్తవం కాదా...!
సోమిరెడ్డి పై చంద్రబాబు నిఘా పెడితే నెల రోజుల కాల వ్యవధిలోనే కోట్లాది రూపాయల వసూళ్ల బాగోతం బయటపడుతుంది.
సోమిరెడ్డి సర్వేపల్లిలోని కంపెనీలను, పోర్టు యాజమాన్యాలను ముడుపుల కోసం బెదిరిస్తున్నాడు.
చంద్రబాబు సోమిరెడ్డి లాంటి అవినీతిపరుడ్ని, సర్వేపల్లిలో సోమిరెడ్డి చేస్తున్న దోపిడీని అడ్డుకోగలడా.., నిరోధించగలడా..!
అధికార పార్టీ శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసినా సర్వేపల్లిలోని లేఔట్ల యజమాన్యలను ఎక్కడైనా బెదిరించానని నిరూపించగలరా!
సోమిరెడ్డి పై నేను చేసిన ఆరోపణలకు సంబంధించి, విచారణ జరిపే ధైర్యం చంద్రబాబుకు ఉందా.. వాస్తవాలు అని తేలితే రాసే దమ్ము ఈనాడు రామోజీరావు తనయుడు కిరణ్ కు ఉందా!
ఎంపీలు, ఎమ్మెల్యేల సమన్వయంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి
- మంత్రులు ఆనం, నారాయణ
- ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీతో ప్రత్యేక సమీక్ష
- త్వరలో జిల్లాకు రానున్న ఇరిగేషన్ మంత్రి దృష్టికి సోమశిల జలాశయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు
- హాజరైన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, పాశం సునీల్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, కావ్య కృష్ణారెడ్డి
నెల్లూరు, జులై 6 : ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
శనివారం ఉదయం చింతారెడ్డిపాలెంలోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ తో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, పాశం సునీల్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ సమన్వయంతో కృషి చేస్తామన్నారు. నియోజకవర్గాల్లోని సమస్యలపై ఎమ్మెల్యేలతో చర్చించి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఒక అవగాహనకు వచ్చామన్నారు.
ఒక మంచి వాతావరణంలో ఎమ్మెల్యేలతో సమీక్ష జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి వాతావరణం లోనే అందరం కలిసి జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన మొదలుపెట్టిందన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ఇదివరకే ఉన్న పరిశ్రమల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ తో చర్చించామన్నారు. త్వరలో జిల్లాకు రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని ఆహ్వానించామని, సోమశిల జలాశయంలో చేపట్టాల్సిన క్రస్ట్ గేట్ల మరమ్మత్తులు, ఆఫ్రాన్, రక్షణగోడ మొదలైన అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు.
సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని గాడిన పెట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. దగదర్తి ఎయిర్పోర్ట్, దువరాజపట్నం పోర్టు, కిసాన్ సెజ్, కృష్ణపట్నం టర్మినల్ మొదలైన అనేక పారిశ్రామిక సంస్థల ఏర్పాటు పై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు.
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ శ్రీ ఆనంద్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఆనంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, మరియు మాజీ ఎన్.డి.సి.సి.బి చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారు.