* పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పై తెలుగుదేశం పార్టీ పెట్టిన కేసులు అక్రమమం .
మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి వన్నె తగ్గని ప్రజాభిమానం ఉందన్న విషయం మరోసారి నిరూపితమైంది.
జిల్లా పార్టీ అధ్యక్షులు, MLC చంద్ర శేఖర్ రెడ్డి
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు, మేరుగ మురళి, మేకపాటి రాజా రెడ్డి, ఖలీల్ అహ్మద్ గార్ల తో పాటు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మీడియా సమావేశం లో మాట్లాడారు.
జిల్లా అధ్యక్షులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..
నిన్న జిల్లాకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి వన్నె తగ్గని ప్రజాభిమానం ఉందన్న విషయం మరోసారి నిరూపితమైంది.
అధికారులు ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ. ప్రజలందరి మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైంది.
25 లక్షల రూపాయలు ఖర్చు చేసి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారని హోం మంత్రి మాట్లాడటం సరికాదు అన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు తను నమ్ముకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలాంటి ఆపదలో ఉన్నా.
వారికి అండగా నిలుస్తారని తెలిపారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పై పెట్టిన ,హత్యాయత్నం కేసులు రెండు అక్రమమని మరియు తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగానే ఈ కేసులు బనాయించిందని అన్నారు.
ఈవీఎం ధంసమైన పది రోజులు తర్వాత వీడియోను ఎడిట్ చేసి టిడిపి నాయకులు కావాలనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు
ఈవీఎం కేసు నిలబడదనే కారణంగానే తెలుగుదేశం పార్టీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పై అక్రమంగా 307, హత్యాయత్నం కేసు నమోదు చేసిందన్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పై దౌర్జన్యం జరిగిందే తప్ప.. రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ దౌర్జన్యం చేయలేదన్న విషయం వీడియో చూస్తే అందరికి స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.
మే 24 వ తారీఖున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కారంపూడి లో సిఐ పై అత్యాయత్నం చేశారని అక్కడ ఒక ఫాల్స్ కేసు నమోదు చేశారని ఆరోపించారు.
ఇలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పై తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులు బనాయించడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించి.. ఇది సరికాదు అని చెప్పి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకే రామకృష్ణారెడ్డిగారిని పరామర్శించారని తెలిపారు.
రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగిన పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు.