నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు గట్టుగా జవాబు చెప్పే రోజులు తొందర్లోనే దగ్గర్లోనే ఉన్నాయి, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తునారు అని అన్నారు. పిన్నెల్లిపై 307 కింద అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్భందించారు. టీడీపీ నేతలే దాడులు చేసి మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు అన్నారు. బాబుకు తప్పులన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా పండుతాయి అని పేర్కొన్నారు.
మోడీతో చంద్రబాబు భేటీ-విన్నపాల చిట్టా ఇదే
చంద్రబాబు ధోరణి మార్చుకోవాలి: వైఎస్ జగన్
AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని YS జగన్ మండిపడ్డారు. నెల్లూరు జైలులో ఆయనను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ఓటేయలేదనే కారణంతో రాష్ట్రంలో ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పైగా బాధితులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. CBN ధోరణి మార్చుకోవాలి. లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయుటలో తన వంతు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు.
గురువారం ఉదయం నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఓ. ఆనంద్ పదవీ భాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు మంత్రోత్సారణలు మధ్య వారి ఆశీర్వాదం అందుకున్నారు.
తోలుత జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి, ఇంచార్జి డి ఆర్ ఓ పద్మావతి నూతన కలెక్టర్ ఆనంద్ కు స్వాగతం పలికారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సర్వీస్ లో మొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ గా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు లో పని చేశానని, ప్రస్తుతం కలెక్టర్ గా జిల్లా కు రావడం సంతోషం గా ఉందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించుటలో కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
నెల్లూరు జిల్లా కి నూతన కలెక్టర్ గా, ఈరోజు చార్జ్ తీసుకున్న కలెక్టర్ ఆనంద్
ఆరు సంవత్సరాలు క్రితం గూడూర్ సబ్ కలెక్టర్ గా పని చేశాను నెల్లూరు జిల్లా కి కలెక్టర్ గారు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వం సంబంధించిన ప్రోగ్రామ్లకు దృష్టి పెడతానని తెలియజేశారు ప్రజలకు సంబంధించిన గ్రీవెన్స్ లో ప్రజల సమస్యలు దృష్టి పెడతానని తెలిపారు
నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయ ఆధునీకరణకు చర్యలు
రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు, జూలై 3 : నెల్లూరు నగరం మూలాపేటలోని ప్రసిద్ధి ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఆధునీకరించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావుకు సూచించారు. బుధవారం సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్‌కు మంత్రి పలు సూచనలు చేశారు. వేణుగోపాలస్వామి దేవాలయం నిధులు, ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా చేయాలని సూచించారు. అలాగే నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని తాను మంత్రి అయిన తరువాత తాను, మంత్రి నారాయణ కలిసి ఆలయాన్ని సందర్శించామని, ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అద్దాల మండపం పునర్నిర్మాణం చేపట్టేందుకు, మండపంలోని చారిత్రాత్మక చిత్రాల రూపకల్పన మొదలైన పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు నగరంలోనే రంగనాథస్వామి ఎంతో విలువైన ఆస్తులు వున్నాయని, పూర్తిస్థాయిలో ఆస్తుల వినియోగం, ఆదాయంపై దృష్టిసారించాలన్నారు. జిల్లాలో చాలా ఆలయాలకు విలువైన ఆస్తులు, భూములు వున్నాయని, అయిననూ ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వీటన్నింటిపై దృష్టిపెట్టనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు వారిచే జారీ