ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడవసారి సర్వేపల్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు.
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన నెల్లూరు పార్లమెంట్ తెదేపా అధికార ప్రతినిధి పఠాన్ సాబీర్ ఖాన్
గత ఐదేళ్లు కౌరవ సభగా మారిన శాసనసభ నేడు గౌరవ సభగా మారడం సంతోషంగా ఉంది...
వైకాపా ప్రభుత్వం చేసిన దాష్టికాలని ప్రజలు గమనించే నేడు వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా లేని తీర్పును ప్రజలు ఇచ్చారు...
గతంలో ఈ రాష్ట్ర స్థితిగతులను మార్చే చట్టాలు చెయ్యాల్సిన శాసనసభలో గత ముఖ్యమంత్రి మొదలు మంత్రులు వైకాపా శాసనసభ్యులు ఇష్టారీతిగా ప్రతిపక్షాలను దుర్భాషలాడుతూ కౌరవసభగా మార్చారు...
ఆనాటి దారుణాలను చూసి విసిగి వేసారిన నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భీష్మ ప్రతిజ్ఞ చేసి ఆనాటి కౌరవ సభను గౌరవ సభగా మార్చిన తరువాతే శాసనసభలో అడుగుపెడతానని తీసుకున్న నిర్ణయానికి నేడు సహకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు...
ప్రతిపక్ష హోదా కూడా లేని వైకాపా ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులను తెలుసుకొని నడుచుకోవాలి....
గత 5 ఏళ్ళు వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయాన్ని చేసింది....
నేడు కూటమి ప్రభుత్వంలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను....
అదేవిధంగా వైకాపా క్రికెట్ టీం 11 మందికి నెల్లూరు పార్లమెంట్ కమిటీ తరుపున క్రికెట్ కిట్ ను బహుకరిస్తున్నాము...
వైకాపా 11 మంది శాసనసభ్యుల్లో ఏ ఒక్కరైనా వచ్చి ఈ కిట్ ను స్వీకరించాలి...
కెప్టెన్ గా ఎలాగో జగన్ రెడ్డి ఉంటాడు కనుక వైస్ కెప్టెన్ గా పెద్ది రెడ్డిని పెట్టుకుంటాడు ఏది ఏమైనప్పటికీ కనీసం ఆటల్లో ఉండే నీతినైనా వైకాపా నేర్చుకోవాలని తప్పుడు విధానాలను మార్చుకోవాలని అన్నారు...
కళ్ళు మూసి తెరిచే లోపు 5 ఏళ్ళు అయిపోతాయి అన్న జగన్ రెడ్డి అదే ఐదేళ్లలో తాను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని గుర్తించుకోవాలి....
ఈ ఐదేళ్లలో నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ సారధ్యంలో రాష్ట్ర రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి,పోలవరం నిర్మాణం, వ్యవస్థలకు పూర్వ వైభవం రావడాన్ని జగన్ రెడ్డి కళ్ళు ముసుకోకుండా చూడాలి....
నీతిని మరిచిన జగన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఇక కనీసం పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యుడిగా నైనా జగన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయాలి...
అదేవిధంగా నేడు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నెల్లూరు రురల్ ప్రజల అపద్భాంధవుడు ప్రజా నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పఠాన్ సాబీర్ ఖాన్ గారు తెలిపారు
పై సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి కనపర్తి.గంగాధర్,మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి అస్లాం 36 వ డివిజన్ ఇంచార్జి ఎస్ ఎ రసూల్ మైనారిటీ సెల్ కార్యదర్శి సత్తార్,అఫ్జల్
సులేమాన్ తదితరులు పాల్గొన్నారు
యోగతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
• యువత తమ జీవితంలో యోగను భాగం చేసుకోవాలి
• ఘనంగా 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవం
• ఆకట్టుకున్న ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల యోగ ప్రదర్శన
• భారతదేశం ఆకారంలో విద్యార్థుల మానవహారం
నెల్లూరు, 21 జూన్ 2024
యోగతోనే శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమౌతుందని, ఈ నేపథ్యంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువతరం యోగను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని, రోజుకు కనీసం ఓ గంట యోగ సాధన కొనసాగించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగ మిత్రమండలి - నెల్లూరు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, క్షేత్ర కార్యాలయం - నెల్లూరు, నెహ్రూ యువకేంద్ర, పి.ఎం.పి. అసోసియేషన్, రుడ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు డి.కె.జూనియర్ కళాశాల వసతిగృహంలో యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమ అనంతరం యోగ గురించి అన్ని రంగాల ప్రజలకు అవగాహన కల్పించే సంకల్పంతో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర కార్యాలయం, నెల్లూరు మరియు ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ - నెల్లూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దాదాపు 10 రోజుల పాటు ఇథాకా ఇంటర్నేషనల్ స్కూల్ జి.ఎం. శ్రీ సంగం జీవన్, ప్రిన్సిపల్ శ్రీ రవికుమ్మమూరు, యోగ శిక్షకురాలు శ్రీమతి పద్మావతి పర్యవేక్షణలో కఠోర పరిశ్రమ ద్వారా విద్యార్థుల యోగాసనాలతో చేసిన అద్భుతాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారతదేశ రూపులో విద్యార్థులతో ఏర్పాటు చేసిన మానవ హారం విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సాధారణ ప్రజలు యోగ వైపు ఆకర్షితులు అవుతారని భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దొడ్ల కౌసల్యమ్మ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఎ.శ్రీనివాసులు గారు మాట్లాడుతూ... నిత్యం యోగ సాధన ద్వారా అనేక రుగ్మతలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి, జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు యోగ ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
గీతా వైభవ్ ట్రస్ట్ కు చెందిన బాషా గురూజీ మాట్లాడుతూ... భారతీయ సనాతన ధర్మం యోగకు ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని, గత 10 సంవత్సరాలుగా ప్రపంచం ఈ స్ఫూర్తిని గుర్తించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం ద్వారా చక్కని ప్రయోజనాలు పొందాలని సూచించారు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగే వారికి యోగ చక్కని సాధనమని అభిప్రాయ పడ్డారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార సహాయకులు శ్రీ హరికృష్ణ, యోగమిత్ర మండలి సభ్యులు శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, శ్రీ రవీంద్ర, యోగ శిక్షకులు శ్రీమతి పద్మావతి, శ్రీ నాగూర్ గురూజీ, పి.హెచ్.పి. జిల్లా అధ్యక్షులు శ్రీ శాఖవరపు వేణుగోపాల్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ రసూల్, న్యాయవాది శ్రీమతి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
యోగా దినోత్సవం సందర్భంగా, యోగ, లోగో, ఆవిష్కరించిన, కోవూరు ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, జీవన యోగశాల టెస్ట్ చైర్మన్, ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో, కోవూరు శాసన సభ్యురాలు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి, నెల్లూరు లోని నివాసం వద్ద, యోగ డే ఫోటో కాల్, లోగోను ఆవిష్కరించిన, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆవిష్కరించి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కోవూరు గిన్నిస్ రికార్డు యోగా క్రీడాకారుడు, సాధనకు, అభినందనలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో, యోగ మాస్టర్ ప్రసన్నకుమార్, నరేంద్ర, సెక్రటరీ స్వప్న, కోశాధికారి సరోజ, మరియు గ్రూప్ సభ్యులు రామ్ సింగ్, రవీంద్ర, అరుణ, కోట సత్యం, నాగ భవాని, పాల్గొని ఘనంగా , లోగో ఆవిష్కరణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి , యోగ మాస్టర్ ప్రసన్నకుమార్ మీడియాతో మాట్లాడారు.
బహిరంగ ప్రదేశాలలో
మద్యం సేవించడం నిషిద్ధం:- సిఐ మధుబాబు.
పట్టణమంతా 12 చోట్ల హెచ్చరిక బోర్డులు.
రవి కిరణాలు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట పట్టణం తో పాటు సూళ్లూరుపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని తడ, శ్రీహరికోట
ప్రాంతాలలో ఇక పై బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం పై నిషేధం విధించడం
జరిగిందని సిఐ మధు బాబు తెలియజేసారు, జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు బుధవారం పట్టణం లోని 12 చోట్ల సిఐ మధుబాబు స్వయంగా పోలీస్ వారి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు,ఈ సందర్భముగా సిఐ మాట్లాడుతూ ఇక పై ఎక్కడా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని ,ఎక్కడైనా అలా జరుగుతుంటే వెంటనే సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేసారు.
రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు రేప్ చేసిన ఒక పనికి మాలిన ఎస్సై
తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్
భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి "ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని" ప్రాధేయపడ్డాడు.
ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి రేప్ చేశాడు.
తాను శ్రీధర్ బాబు మనిషిని అని తనని ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.
చోటా మోటా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే "బాబన్న (శ్రీధర్ బాబు) బావున్నాడా.. నాకు ఇంతకు ముందే ఫోన్ చేశాడు" అంటూ మాట్లాడేవాడు.
ఈయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉండగా ప్రతిరోజూ ఒక చికెన్ సెంటర్ నుండి చికెన్ పంపాలని హుకుం జారీ చేసేవారట.
సమాచారం మేరకు