వందశాతం తప్పులు లేని ఓటర్ల జాబితానే లక్ష్యంగా పనిచేయండి...
వందశాతం తప్పులు లేని ఓటర్ల జాబితానే లక్ష్యంగా పనిచేయండి...
బిఎల్ఓ లు ఇంటింటి సర్వే పటిష్టవంతంగా నిర్వహించేలా చూడండి...
ఒకే ఇంట్లో పది ఓటర్ల కంటే ఎక్కువ ఉంటే పక్కాగా వెరిఫై చేయించాలి...
ఫామ్ 6, 7, 8లను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి....
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి...
ఈ నెల 21 వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరగనుంది. ఆ అంశం పై ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ లను, టీడీపీ నాయకులను ఉద్దేశించి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు..
జిల్లాలో వందశాతం తప్పులు లేని ఓటర్ల జాబితా నే లక్ష్యం గా పనిచేయాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా లోని నియోజకవర్గాల టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ లకు అబ్దుల్ అజీజ్ ఉద్బోధించారు.
జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందడానికి బాధ్యతగా కృషి చేయాలన్నారు. జిల్లాలో రూపొందిస్తున్న ప్రత్యేక ఎలక్టరోల్ పై బిఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఖచ్చితంగా పరిశీలన చేసి పటిష్టవంతంగా జాబితా రూపొందేలా బూత్ లెవెల్ ఏజెంట్ లు కృషి చేయాలని సూచించారు.
ఈ క్రమంలో ఏవైనా విజ్ఞప్తులు, తొలగింపులు ఉంటే అప్పటికప్పుడే వాటిని నమోదు చేసుకొని పరిశీలించి పరిష్కారం అందేలా చూడాలని పిలుపునిచ్చారు.ఒకే ఇంట్లో పదిమంది ఓటర్ల కంటే ఎక్కువ మంది ఉంటే వాటిని పక్కాగా పరిశీలన చేయాలని సూచించారు.
ఫామ్ 6, 7, 8 లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఫామ్ 6బి లో ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయాలని, జిల్లాలో కొంత శాతం మేర పూర్తి చేశారని, మిగిలినవి కూడా పూర్తి చేయాలన్నారు. ఒకే రకమైన రెండు ఫోటోలు, డూప్లికేట్ ఓటర్లను పక్కాగా తొలగించాలని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
18-19 వయసు ఉన్న యువత కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి తగువిధంగా అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గాల వారీగా జిల్లాలో అర్హులైన ఓటర్లు వందశాతం నమోదు కావాలని... ఇందుకు మండలాలలో ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.