చంద్రయాన్ త్రీ ప్రయోగం కు రంగం సిద్ధం .
ఈ నెల 14 న షార్ నుండి ప్రయోగం.
జీ ఎస్ ఎల్ వి మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్ ఉపగ్రహ ప్రయోగం.
రవి కిరణాలు తిరుపతి జిల్లా (సూళ్లూరుపేట) శ్రీహరికోట:-
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో సారి ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ ప్రయోగానికి సిద్ధం అవుతుంది, ఈ నెల 14 న చంద్రయాన్ -3 ఉపగ్రహ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లను
సిద్ధం చేసింది,గత వైఫల్యాలను సరిచేసి సరికొత్త సాంకేతిక పరికరాలతో ఉమ్మడి నెల్లూరు
జిల్లా లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి చంద్రయాన్ ప్రయోగం జరపనుంది.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఇస్రో ఈ నెల 14 వ తేదీ ఎల్ వి ఎం మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్ - 3 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది,శ్రీహరికోట లోని రెండవ ప్రయోగ వేదిక నుండి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు ఈ ప్రయోగం జరుగుతుంది, చంద్రుని పై దాగి ఉన్న రహస్యాలను సాధించడానికి ప్రధానముగా ఈ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహిస్తుంది, చంద్రుని పై ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ వాతావరణ పరిస్థితుల పైన అధ్యనం చేయడానికి భవిషత్ లో మానవ సహిత చంద్రయాన్ ప్రయాణానికి అవసరమైన పరిశోధనల కోసం ఈ చంద్రయాన్ -3 ప్రయోగాన్ని నిర్వహిస్తుంది,ఈ ప్రయోగం జరిగిన 42 రోజుల తరువాత ఉపగ్రహం లోని ల్యాండర్ చంద్రుని పై దిగే విదంగా ఉపగ్రహాన్ని రూపకల్పన చేసి ఉన్నారు, అంటే భూమి నుండి 42 రోజుల పాటు ఉపగ్రహం చంద్రుని వైపుకు ప్రయాణం చేస్తుంది,2008 లో ఇస్రో ప్రయోగించిన మొదటి చంద్రయాన్ -1 ప్రయోగం ద్వారా పంపిన ఆర్బిటర్ ద్వారా చంద్రుని పై నీటి ఆనవాళ్లను ఇస్రో గుర్తించడం జరిగింది,అలాగే 2019 చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగం లో ఆర్బిటర్ ద్వారా ఒక ల్యాండర్ ను,ఒక రోవర్ ను పంపడం జరిగింది, లాండింగ్ సమయం లో సంబంధాలు తెగిపోవడం తో అది కాస్త పాక్షిక విజయంగా మిగిలిపోయింది, అపజేయలు విజయాలకు సోపానాలు అనే విషయం జగమెరిగిన సత్యం అనే విషయం అందరికి తెలుసు అందుకే ఇస్రో ఇప్పుడు రేటించిన ఉత్సాహం తో చంద్రయాన్ -3 తయారు చేసి ప్రయోగానికి సిద్ధం చేసింది,ఇప్పటికే చంద్రుని పై అడుగు పెట్టి సత్తా చాటిన అమెరికా,రష్యా,చైనా దేశాల సరసున చేరడానికి భారత్ కూడా చంద్రయాన్ -3 ప్రయోగ విజయం కోసం ఎదురుచూస్తుంది, ఈ ప్రయోగానికి సంబందించిన
విండో జులై 12 నుండి 19 వరకు అందుబాటులో ఉంటున్న నేపథ్యం లో 14 వ తేదీన
ప్రయోగానికి ముహూర్తం నిర్ణయించారు.