తడ లో మెడికవర్ సేవలు అభినందనీయం.ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
తడ లో మెడికవర్ సేవలు అభినందనీయం.ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.
రవి కిరణాలు తిరుపతి జిల్లా తడ:-
మెడికవర్ ఆసుపత్రి సేవలు తడలో అందించేందుకు ఏర్పాటుచేసిన ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇక్కడ హాస్పిటల్ పెట్టడం ఎంతో అభినందనీయమని సూళ్లూరుపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు. బుధవారం తడలో మెడికవర్ హాస్పిటల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణ & మహారాష్ట్ర రాష్ట్రాల్లో దాదాపు 28 శాఖలతో మెడికవర్ ఆసుపత్రి వైద్యసేవలు అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సూపర్ స్పెషాలిటీ సేవలను తడలోనే అందించే అవకాశం కల్పించడం శుభ పరిణామం అన్నారు. ముందుగా ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇంకా ఉత్తమ వైద్య సేవలు అవసరమైనట్లయితే నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ తరలించే ఏర్పాట్లు కూడా చేయడం అభినందించదగిన విషయం అన్నారు .ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ మాట్లాడుతూ సూళ్లూరుపేట, తడ, శ్రీ సిటీ శ్రీహరి కోట తదితర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా మెడికవర్ క్లినిక్ తడలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముందుగా ఇక్కడ ఈసీజీ ,వైద్య పరీక్షలు ,అన్ని రకాల హెల్త్ చెకప్ లు , నిర్వహించడం ప్రాథమిక చికిత్సలు ఇక్కడే జరిపి అవసరమైన ఉత్తమ వైద్యం కోసం నెల్లూరు, చెన్నై వంటి ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కన్సల్టెషన్స్ మరియూ క్లినికల్ లేబరేటరీ పరీక్షలు, కూడా ఇక్కడ చేసుకునే వీలు ఉందన్నారు . అంతేగాక 24 x 7 డాక్టర్లు, వైద్య సిబ్బంది, అందుబాటులో ఉంటారన్నారు. అనేక ఆరోగ్య సమస్యలకు ఇక్కడ చికిత్సలు లభిస్తాయని, ఈ ప్రాంత ప్రజలు మెడికవర్ హాస్పిటల్ వారి మెడికవర్ క్లినిక్ వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రారంభానికి ముందుగా ఎమ్మెల్యే చే జ్యోతి ప్రజ్వలన, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తడ మండలం ఎంపీపీ కొలవి రఘు రెడ్డి మండలం సర్పంచ్ శశి కుమార్ మునస్వామి గండవరం సురేష్ రెడ్డి మరియు మెడికవర్ క్లినిక్ మార్కెటింగ్ మేనేజర్ ఉదయ భాస్కర్ నర్సింగ్ హెడ్ శైలజ పి ఆర్ ఓ చందు వర్మ, హాస్పిటల్ సిబ్బంది మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.