దొరవారిసత్రం పి.హెచ్.సి కి 50 లక్షలు తో అదనపు భవనము మంజూరు
దొరవారిసత్రం పి.హెచ్.సి కి 50 లక్షలు తో అదనపు భవనము మంజూరు
నిర్మాణానికి స్థలం పరిశీలిస్తున్న అధికారులు మరియు మండల ఉపాధ్యక్షులు దువ్వూరు
రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం న్యూస్:- దొరవారిసత్రం మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు నిధులను కొత్త భవనం నిర్మాణానికి మంజూరైనట్లుగా శుక్రవారం వైయస్సార్సీపి సీనియర్ నాయకులు మండల ఉప అధ్యక్షులు దువ్వూరు గోపాల్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ అభివృద్ధి పనుల్లో భాగంగా నేషనల్ హెల్త్ మిషన్ క్రింద రక్త పరీక్షలు నమూనా కేంద్రానికి గాను ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని తెలిపారు ఈ భవనాన్ని నిర్మించేందుకు స్థల పరిశీలనలో భాగంగా డివిజనల్ ఇంజనీర్ బందిలి రమణయ్య ఏఈ వైద్య అధికారి చైతన్య లు కలిసి భవనాన్ని నిర్మాణం చేసే స్థలాన్ని పరిశీలించారు పీ.హెచ్.సి కి ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఈ భవనాన్ని నిర్మించాలని మండల ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి స్థానిక సర్పంచి బ్లేస్సి ఎంపీటీసీ దొరస్వామి వైద్య అధికారులకు తెలియజేశారు దీంతో ఇంజనీర్లు కూడా సమ్మతించారు పీహెచ్ సీ కి ఇలాంటి భవనం రావడం ఎంతో సంతోషకరమైన అని ఆయన అన్నారు ఈ భవనాన్ని త్వరగా పూర్తిచేసేటట్లుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు