జాతీయ పొగాకు నియంత్రణదినం ర్యాలీ
జాతీయ పొగాకు నియంత్రణదినం ర్యాలీ రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం న్యూస్:- మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది బుధవారం జాతీయ పొగాకు నియంత్రణ దినంపై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీలో పొగాకు నియంత్రణపై పలు రకాల స్లోగన్ తో గ్రామాల్లో ర్యాలీ నిర్వహిస్తూ పొగాకు పై అవగాహన కలిగిస్తూ పొగాకు నియంత్రించాలని ప్రజలకు తెలిపారు అనంతరం మండల కేంద్రం వద్ద మానవ హారం ఏర్పాటు చేశారు డాక్టర్ చైతన్య మాట్లాడుతూ చుట్ట బీడీ సిగరెట్ అనారోగ్యానికి తొలిమెట్టు పొగాకు పదార్థాల వాడకాలు వద్దు మంచి ఆరోగ్యమే మన హద్దు పొగాకు వాడకం వల్ల క్యాన్సర్ రావడం జరుగుతుంది అని డాక్టర్ తెలిపారు మానవహారంగా ఏర్పడి పొగాకు నియంత్రణపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సంపూర్ణమ్మ సూపర్వైజర్ పద్మావతి కిరణ్ మరియు వైద్య సిబ్బంది సుధాకర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు