ఆన్ లైన్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి- ఏ.ఐ.వై.ఎఫ్ కత్తి రవి.
సూళ్లూరుపేట మార్చి 11 (రవి కిరణాలు):-
అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శనివారం సూళ్లూరుపేట భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో యువకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అఖిలభారత యోజన సమైక్య తిరుపతి జిల్లా కార్యదర్శి కత్తి రవి హాజరయ్యారు. యువకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో అదే రీతిలో ఆన్లైన్ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్లు ఆధార్ ద్వారా వేలిముద్రలు క్యాప్చర్ చేసి వారి బ్యాంక్ ఖాతాల్లోని నగదు కాజేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే స్మార్ట్ ఫోన్ల వినియోదారులు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ఏ. ఇ. పి. ఎస్ లాక్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మోసాల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. అంతె కాకుండ యు.పి.ఐ చెల్లింపులు, ఫేక్ ఓ.ఎల్.ఎక్స్, లోన్ అప్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పారిశ్రామికంగా చెందుతున్న ఈ సూళ్లూరుపేట ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని కొంతమంది వ్యక్తులు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల మత్తులో యువతను పెడత్రోవ పట్టిస్తున్నారు, ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.వై.ఎఫ్ సూళ్ళురుపేట నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మోదుగుల వినోద్, పెద్ద గంగిశెట్టి గుణశేఖర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.