వీధి వ్యాపారుల సంఘ జిల్లా మహాసభల గోడ ప్రతుల ఆవిష్కరణ.
వీధి వ్యాపారుల సంఘ జిల్లా మహాసభల గోడ ప్రతుల ఆవిష్కరణ.
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
మార్చి 3,4 తేదీల్లో గూడూరు పట్టణంలో నిర్వహిస్తున్న వీధి విక్రయదారుల కార్మిక సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని సులూరుపేట బస్టాండు మరియు మార్కెట్ సెంటర్లలో గోడ ప్రతులను విడుదల చేశారు. అనంతరం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శివ మాట్లాడుతూ
పండ్లు, కూరగాయలు, ఆహారం, ఇతరత్రా వస్తువులు ప్రజలకు అందజేయడంలో, చేరవేయడంలో వీధి విక్రయదారులు కీలక
పాత్ర పోషిస్తున్నారని వినియోగదారులకు అతి తక్కువ ధరలతో అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. కరోనా కాలంలో జనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు వెళ్లడానికి భయడుతుంటే వీధి విక్రయదారులు కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర సరుకులు, వస్తువులను తోపుడు బండ్లపైన, గంపల్లో తీసుకొచ్చి ప్రజల ఇళ్ల ముంగిటే విక్రయించారు. ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చినా, పెద్ద పెద్ద దుకాణాలు ఏర్పాటైనా వీధి చివరిలోని తోపుడు బండ్లపైన కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడుతున్నారంటే వీధి విక్రయదారులు అందిస్తున్న నాణ్యమైన సరుకులు, సేవలే కారణం. జీవనోపాధి కోసం ప్రభుత్వం మీద ఆధారపడకుండా, చిన్నా చితకా వ్యాపరం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీధి విక్రయదారులు నిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో వ్యాపారం చేసుకునే క్రమంలో పోలీసుల నుంచి, మున్సిపల్ సిబ్బంది నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీధి విక్రయాదారుల ఉపాధికి భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం విధి
విక్రయదారుల చట్టం' తీసుకొచ్చినా అది సక్రమంగా అమలు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఏర్పాటయింది. చిరు వ్యాపారులకు అండగా నిలబడింది. వ్యాపారులకు తమ చట్టబద్ధ హక్కుల గురించి తెలియజేయటంతో పాటు అధికారులపై ఉన్న బాధ్యతలను గుర్తుచేసేలా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ సంఘం ఏర్పాటయిన తరువాత వీధి వ్యాపారుల్లో ఒక ధైర్యం వచ్చింది. తమ వీధి వ్యాపారంతోనే గౌరవంగా బతకగలమన్న నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడం. సంఘాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఇప్పటికీ అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యకలాపాల గురించి చర్చించడం, నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియచేశారు. గూడూరులో చెరుకు వీధివిక్రయదారుల కార్మిక సంఘ ప్రథమ మహాసభకు ఈ ప్రాంతం నుంచి కూడా వేలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాసులు మరియు కార్యదర్శిలప్ప నాగేంద్రబాబు, ఈ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యామ్, జిల్లా నాయకులు శ్రీనివాసులు, హరిత , సులూరుపేట వీధివిక్రయదారులు పాల్గొన్నారు.