డెవలప్మెంట్ ఆఫీసర్ లను సంఘీభావం తెలియచేయవలసినదిగా
October 11, 2022
dharma
,
lic
,
Meeting
,
Nellore
ఈ రోజు తిరుపతిలోని వైయస్ఆర్ మార్గ్ నందు డిపిఆర్ కళ్యాణమండపంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తూర్పు రాయలసీమ పట్టబద్ధుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి గారు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని తిరుపతి నియోజకవర్గ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గారు మాట్లాడుతూ మార్చి నెలలో శాసనమండలికి పట్టబధ్రుల నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మన ప్రియతమ నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మన పార్టీ అభ్యర్థిగా గూడూరుకు చెందినటువంటి, ఆ నియోజకవర్గంలో చాలా ప్రాధాన్యం, పలుకుబడి ఉన్నటువంటి, అదేవిధంగా మన పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న గెలుపు కోసం నెల్లూరు జిల్లా మొత్తం నిరంతరం కృషి చేసిన తమ్ముడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాలని తెలిపారు.
అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగిందని, పార్టీకి చాలా బాగా పనిచేసాడు, ఎమ్మెల్యే కావలసినటువంటి వ్యక్తి గూడూరు నియోజకవర్గం రిజర్వుడు నియోజకవర్గం కనుక అవకాశం ఇవ్వలేకపోయామని, కనుక శ్యామ్ శాసనమండలి సభ్యుడైతే, పార్టీకి చాలా మంచిగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారని నాయకులను ఉద్దేశించి తెలిపారు.
36 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి అత్యధిక మెజారిటీ తీసుకువచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు, అధికారాన్ని నెత్తికెక్కించుకోకుండా, ప్రజా సేవకులుగా పనిచేసి, తూర్పు రాయలసీమ శాసనమండలి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన భాద్యత పార్టీ శ్రేణులపై ఉందని శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి సూచించారు.
పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ముందుగా నాకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని, గౌరవనీయులు పెద్దలు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు గారికి, జనంతో ఎల్లప్పుడూ మమేకమవుతూ ప్రజల మనల్ని పొందుతున్న భూమన అభినవ్ గారికి నా కృతజ్ఞతలు అని తెలిపారు. తూర్పు రాయలసీమకు సంబంధించిన 36 నియోజకవర్గాల్లో దాదాపుగా 24 నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగాయని, ఈ నియోజకవర్గంలో వచ్చినంత మహిళలు ఏ నియోజకవర్గంలో రాలేదని, నా సతీమణికి విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పదవినిచ్చినప్పుడు నేరుగా మన ముఖ్యమంత్రి గారితో మాకు ఈ పదవి వద్దని చెప్పానని, జగన్ మోహన్ రెడ్డి గారు మా చెల్లికి ఇస్తున్నాను అని విత్తనాభివృద్ధి సంస్థ పదవి మా కుటుంబానికి ఇచ్చారని,ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళామణులందరిని చూసిన తర్వాత నేను ఆరోజు తప్పు చేశానేమో అని అనిపిస్తుందని, ఈ నియోజకవర్గంలో కరుణాకర్ అన్న, అభినయ్ సారధ్యంలో రాజకీయాల్లో మహిళలు మరింత బాధ్యతతో పని చేస్తున్నారని తెలిపారు, మీరందరూ కూడా ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొని, నియోజకవర్గంలో ఎక్కువ మంది ఓటర్లను చేర్పించి, నా విజయాన్ని కృషి చేయాలని పిలపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్ర రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కె బాబు, టౌన్ బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్ర, గంగమ్మ గుడి చైర్మన్ కట్టా గోపియాదవ్, స్టేట్ విలెజ్ & ఖాదీ కార్పొరేషన్ డైరెక్టర్ దుద్దెలు బాబు, ఇతర సీనియర్ నాయకులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,అనుబంధ విభాగాల నాయకులు, పాల్గొన్నారు.
వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల్లో వ్యతిరేకత చూసి మతి చలించింది. సాక్షాత్తు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన అమరావతిపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అమరావతిలో రాజధాని కడతామంటే రైతులు భూములిచ్చారు. అమరావతికి అధికార, ప్రతిపక్షలుండే నిండు సభలో ఒప్పుకుంటేనే రైతులు భూములివ్వడానికి అంగీకరించారు అమరావతిలో రాజధాని కడతామని చెప్పి కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్లలో గెలిచింది ధర్మాన రాజీనామా కాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులను రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనండి.విశాఖలో సగానికి పైగా పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోయాయి. దమ్ముంటే 30 మందికి పైగా ఉన్న లోక్ సభ, రాజ్యసభ వైసీపీ ఎంపీలు కలిసి విశాఖలో రైల్వే జోన్ తీసుకురండి. మూడు రాజదానుల సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులు చూసుకొని మాట్లాడాలి. రైతుల పాదయాత్ర పై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి. రాజధాని కుప్పంలోనో, నారావారిపల్లిలోనో పెట్టుకుంటే ఏడవండి. రాష్ట్ర నడిబొడ్డులో నిర్మిస్తున్న రాజధానిపై మీకున్న కష్టమేంటో చెప్పాలి. అమరావతికి అభివృద్ధికి సంబంధం లేదు..అమెరికాలోని పరిస్థితులే అందుకు నిదర్శనం చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన 10 కేంద్ర సంస్థలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖలో భూకుంభకోణంలో 40 వేల కోట్లు అవినీతి జరిగింది.ఈ ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వమే మేలు అన్నట్టుంది. మంత్రులు రాజీనామా చేసి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోండి. రోజమ్మతో మాట్లాడుకుని జబర్దస్త్ లో మూడు రాజధానుల స్కిట్ వేసుకోండి
తేది:10-10-2022
వెస్ట్రన్ ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్ కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి కి వివరించిన మంత్రి కాకాణి. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాల పట్ల అభినందనలు తెలియజేసిన ఆస్ట్రేలియా శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్. ఆంధ్ర రాష్ట్రానికి ఆధునిక సాంకేతిక సహకారాన్ని అందించడంతోపాటు, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు వ్యవసాయ పరిశోధనలకు ఆస్ట్రేలియా దేశంలో అవకాశం కల్పించాలని కోరిన మంత్రి కాకాణి.
కరెంట్ ఛార్జీల్లో మళ్ళీ మోసం జరిగింది -పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 147వ రోజున 49వ డివిజన్ యనమలవారివీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తిరుగుతుంటే అనేక ఇళ్ళలో ప్రజలు కరెంట్ బిల్లులు చూపించి విపరీతంగా ఎలా పెరిగాయో చూపిస్తున్నారన్నారు. గతేడాది ఓ నెలలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో వాడని కరెంటుకి బిల్లులు ఎలా వసూలు చేశారో, ఈ ఏడాది కూడా అదే మోసానికి ప్రభుత్వం పాల్పడుతోందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా నూతన కరెంట్ బిల్లులు ఇంకా తీయలేదని, రోజులు పెరిగితే యూనిట్లు పెరిగి స్లాబ్ మారి అది కూడా సామాన్యులకు భారంగా మారుతోందని అన్నారు. ఉచితాలను ఎర వేసి పన్నులు, బిల్లుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని, ఈ ప్రభుత్వ అసంబద్ధ విధానాలే రేపటి జనసేన పార్టీ గెలుపుకు కొలమానాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ల వలన కలిగే ప్రమాదాలను నివారించేందుకు
కావలి పట్టణం లోని "మునిసిపల్ ఆఫీస్ ప్రాంగణంనందు మెప్మా "ఆఫీస్ లో జేమ్స్ HP గ్యాస్ ఏజెన్సీ వారి యల్ పి జీ పంచయాత్.... కావలి మెప్మ కార్యాలయంలో స్థానిక జెమ్స్ హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ వారు, కావలి అగ్నీ మాపక అధికారులతో కలిసి ఎర్పాటు చేసిన యల్ పి జీ పంచాయత్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ విశేష కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకురాలు శ్రీమతి విరజ రెడ్డి గారు గ్యాస్ వాడకం పై అవగాహన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని తెలియచేశారు. అగ్నీ మాపక శాఖ అధికారి శ్రీ రామ్ సిద్దార్థ్ గారు మెప్మ సభ్యులకు గ్యాస్ సిలిండర్ల వలన కలిగే ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చాలా విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మేప్మ అధికారిణి , భారతి గారు,Hp గ్యాస్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది, ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రజా సంఘాల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, మొఘల్ సలీం బేగ్ మొదలగు వారు పాల్గొన్నారు.
రవి కిరణాలు న్యూస్. తిరుపతి జిల్లా, (సూళ్లూరుపేట) శ్రీహరికోట :-
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తిరుపతి జిల్లా లోని శ్రీహరికోట రాకెట్
ప్రయోగ కేంద్రం లో ఈ నెల 4 వ తేదీ ప్రారంభించి దేశ వ్యాప్తముగా వివిధ రాష్ట్రాలలో
కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు సోమవారం ముగిసాయి.
షార్ సెంటర్ లోని MR కురుప్ ఆడిటోరియం లో జరిగిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు వేడుకలను ఐఐటీ డైరెక్టర్ KN సత్యనారాయణ జ్యోతి వెలిగించి ప్రారంభించారు,
ఈ వేడుకల్లో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ కూడా పాల్గొన్నారు.దేశం లోని ఒరిస్సా ,తమిళనాడు,పుదుచ్చేరి,ఆంధ్రప్రదేశ్,తెలంగాణా ,రాష్ట్రాలలో జరిగిన ప్రపంచ అంతరిక్ష
వారోత్సవాలలో ప్రధానంగా విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనల పై అవగాహన కల్పించారు.
ఉపగ్రహ ప్రయోజనాలతో ప్రపంచం ఎలా ముందుకు పోతుందో తెలియజేసే సదస్సులు
కూడా నిర్వహించారు. ఈ సందర్భముగా షార్ డైరెక్టర్ రాజరాజన్ మాట్లాడుతూ దేశం లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి అంతరిక్ష పరిశోధనలే మూల కారణమని ,సమాచార సాంకేతిక విప్లవాన్ని ఉపగ్రహాల ద్వారా తీసుకు రావడం జరిగిందని భవిషత్ తరాల కోసం
ఇస్రో నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటుందని ఆయన అన్నారు. అలాగే ఐఐటీ
డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ అబ్దుల్ కలం వంటి శాస్త్రవేత్తలు నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని,అంతరిక్ష పరిశోధనలకు నేటి పాలకులు కూడా పూర్తి
స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారని దీని వలన విక్రమ్ సారాభాయ్ వంటి శాస్త్రవెతల
కలలు సాకారం అవుతున్నాయని ఆయన అన్నారు, ఈ సందర్భముగా విద్యార్థులకు
నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలు,క్విజ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో అస్సోసియేట్ డైరెక్టర్ R వెంకటరామన్,
కంట్రోలర్ శ్రీనివాసులు రెడ్డి,డిప్యూటీ డైరెక్టర్ సెంథిల్ కుమార్ ,డిప్యూటీ డైరెక్టర్ రఘురాం , ఇస్రో శాస్త్రవేత్తలు
తదితరులు పాల్గొన్నారు.