రవి కిరణాలు న్యూస్. తిరుపతి జిల్లా, (సూళ్లూరుపేట) శ్రీహరికోట :-
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తిరుపతి జిల్లా లోని శ్రీహరికోట రాకెట్
ప్రయోగ కేంద్రం లో ఈ నెల 4 వ తేదీ ప్రారంభించి దేశ వ్యాప్తముగా వివిధ రాష్ట్రాలలో
కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు సోమవారం ముగిసాయి.
షార్ సెంటర్ లోని MR కురుప్ ఆడిటోరియం లో జరిగిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు వేడుకలను ఐఐటీ డైరెక్టర్ KN సత్యనారాయణ జ్యోతి వెలిగించి ప్రారంభించారు,
ఈ వేడుకల్లో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ కూడా పాల్గొన్నారు.దేశం లోని ఒరిస్సా ,తమిళనాడు,పుదుచ్చేరి,ఆంధ్రప్రదేశ్,తెలంగాణా ,రాష్ట్రాలలో జరిగిన ప్రపంచ అంతరిక్ష
వారోత్సవాలలో ప్రధానంగా విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనల పై అవగాహన కల్పించారు.
ఉపగ్రహ ప్రయోజనాలతో ప్రపంచం ఎలా ముందుకు పోతుందో తెలియజేసే సదస్సులు
కూడా నిర్వహించారు. ఈ సందర్భముగా షార్ డైరెక్టర్ రాజరాజన్ మాట్లాడుతూ దేశం లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి అంతరిక్ష పరిశోధనలే మూల కారణమని ,సమాచార సాంకేతిక విప్లవాన్ని ఉపగ్రహాల ద్వారా తీసుకు రావడం జరిగిందని భవిషత్ తరాల కోసం
ఇస్రో నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటుందని ఆయన అన్నారు. అలాగే ఐఐటీ
డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ అబ్దుల్ కలం వంటి శాస్త్రవేత్తలు నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని,అంతరిక్ష పరిశోధనలకు నేటి పాలకులు కూడా పూర్తి
స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారని దీని వలన విక్రమ్ సారాభాయ్ వంటి శాస్త్రవెతల
కలలు సాకారం అవుతున్నాయని ఆయన అన్నారు, ఈ సందర్భముగా విద్యార్థులకు
నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలు,క్విజ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో అస్సోసియేట్ డైరెక్టర్ R వెంకటరామన్,
కంట్రోలర్ శ్రీనివాసులు రెడ్డి,డిప్యూటీ డైరెక్టర్ సెంథిల్ కుమార్ ,డిప్యూటీ డైరెక్టర్ రఘురాం , ఇస్రో శాస్త్రవేత్తలు
తదితరులు పాల్గొన్నారు.