ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడురు డివిజన్ చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామం లో పుట్టి స్వయం కృషి స్వీయప్రతిభ తో కష్టాలను అధిగమించి విద్యను అభ్యసించి.. MSc గణితం లో పూర్తిచేశారు.. ఆ తర్వార యం బి ఏ పూర్తి చేసారు. ఉపాద్యాయ వృత్తిలో స్దిరపాడాలని చిననాటినుంచి కలలు గని.. ఆదిశగా అడుగులు వేసారు. కొన్ని కారణాల వల్ల బియడ్ ఎంట్రన్స్ రాయలేకపోవడంతో యం యస్ సీ పూర్తి చేసి..విఅర్ కాలేజీలో అద్యాపకుడిగా కరియర్ ప్రారంభించారు. తన గురువు కృష్ణారెడ్డితో కలసి ప్రేవేటుగా ట్యూషన్లు చెబుతూ..కొంతకాలం గడిపారు. అనంతరం ఓ కాలేజీని ప్రారంభించాలని భావించడం..తన గురువుతో ఆవిషయం ప్రస్తావించడం..ఆయన ఓకే చెప్పడంతో ధైర్యంగా ముందడుగు వేసి 140 మంది విద్యార్దులతో విద్యాసంస్దను ప్రారంభించారు. విద్యాసంస్దను ప్రారంభించిన అతికొద్దికాలంలోనే..జిల్లాలో ప్రజల ఆదరాభిమానాలు చూరగొని..నేడు వేలమంది విద్యార్దులకు ఉత్తమ విద్యను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఈ కళాశాల విద్యార్దికి రాష్ట్రపతి నుంచి అవార్డుకూడా లభించింది. అలా పిల్లల తల్లితండ్రులు తమపైన పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ముందుకుసాగుతున్నానంటూ ఎఁతో వినమ్రమతతో చెప్తారు. అందుకే రెడ్ క్రాస్ చైర్మన్ గా కూడా ఆయన ఎన్నికయ్యారు. కరోనా సమయంలో తన దానగుణాన్ని ప్రదర్సించి పలువురి ప్రశంశలు అందుకున్నారు. ఇప్పుడు తాజాగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఇప్పుడు తూర్పు రాయలసీమ వైయస్ అర్ సి పి ఉపాద్యయ ఎమ్మెల్సి అబ్యర్దిగా ప్రకటించారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట
నాయుడుపేట లో అత్యంత వైభవంగా శరన్నవరాత్రులు 5వ రోజు పూజా కార్యక్రమాలు
తిరుపతి జిల్లా నాయుడుపేట లో గడియారం సెంటర్ వద్ద వెలసియున్న శ్రీ శ్రీ పోలేరమ్మ వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న,శరన్నవరాత్రులు ఐదవ రోజుని పురస్కరించుకొని, శ్రీ అన్నపూర్ణ దేవి కి, ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఉభయ దాతలు గా వైదేహి షాపింగ్ మాల్ సుబ్బారెడ్డి మానస, ఓట్టూరు కిషోర్ యాదవ్ రాధ, కే గోపాల్ రెడ్డి మంజుల, ఎస్ శ్రీనివాసులు వెంకటసుజాత, కె రామ్మోహన్ రాజు సునీత, పి సుబ్రహ్మణ్యం శ్రీలక్ష్మి, మునేంద్ర నాగరత్నమ్మ గార్లు, కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ప్రసాద దాతలు ఎం ఆదిశేషయ్య చంగమ్మ, అన్నప్రసాద దాతలు వై మాదేశ్ కుమార్ పుష్పలత, వారు ఈ కార్యక్రమానికి దాతలుగా నిలిచారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు మరియు టిటిడి బోర్డు మెంబర్ కిలివేటి సంజీవయ్య, మరియు కామిరెడ్డి రాజారెడ్డి, దేవస్థానం కమిటీ మెంబర్ దేవత కిషోర్,గంథవల్లి భరత్ కుమార్, తదితరులు, ఈ కార్యక్రమం శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గంధవల్లి సిద్దయ్య ఆధ్వర్యంలో ఐదవ రోజు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగింది,
అమ్మణ్ణికి శ్రీ అన్నపూర్ణ అలంకారం:- ఉభయకర్తలుగా కొండేపాటి గంగా ప్రసాద్, కోమలి దంపతులు
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
దసరా వేడుకల్లో భాగంగా 5వరోజు శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి కి అన్నపూర్ణ అలంకారం చేశారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి , ఈఓ ఆళ్ళ శ్రీనివాసులురెడ్డి జ్యోతి వెలిగించి పూజలు ప్రారంభించారు. వేదపండితులచే అలంకార పూజలు చేసి భక్తులందికీ హారతులిచ్చారు, ఈ సందర్భముగా జరిగిన కుంకుమ పూజల్లో ఉభయదాతలు పాల్గొన్నారు. అలంకార ఉభయదాతలు కొండేపాటి గంగా ప్రసాద్, కోమలి దంపతులు కాగా ఈ వేడుకల్లో మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి,వంకా దినేష్ కుమార్ యాదవ్,మన్నెముద్దు పద్మజ, ఓలేటి బాల సత్యనారాయణ, కర్లపూడి సురేష్, బండి సునీత,మాజీ సభ్యులు గోగుల తిరుపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు కొండూరు జనార్ధన్, మీంజూరు రామకృష్ణ మరియు జెట్టి వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆలయ ఆవరణం లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
తిరుపతి జిల్లా,సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో జరుగుతున్న
శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 5 వ రోజు బుధవారం సాయంత్రం గాండ్ల వీధి, బాపూజీ వీధి, కచ్చేరి వీధి, పార్క్ వీధి ప్రాంతాల నుండి అమ్మణ్ణికి సారె ను తీసుకొచ్చారు. ముందుగా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి, ఆలయ ఈఓ ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి అక్కడకు వెళ్లి పూజలు చేసి అనంతరం మహిళలంతా కలిసి వారు తెచ్చిన సారెను తలపై పెట్టుకుని మేళతాళాలతో , కేరళ డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా
ఆలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా అమ్మణ్ణి చెట్టుకు పూజలు చేసి అనంతరం ఆలయంలోని అమ్మణ్ణి సన్నిధిలోకి చేరుకొని మహిళలంతా అమ్మణ్ణి కి సారెను స్వయంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు ఓలేటి బాల సత్యనారాయణ, కర్లపూడి సురేష్, ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్ మండల అధ్యక్షుడు అల్లూరు, అనిల్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు కొండూరు జనార్ధన్, మీజూరు రామకృష్ణ రెడ్డి మరియు కళత్తూరు జనార్దన్ రెడ్డి, జెట్టి వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి .
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
శరన్నవరాత్రులు పురస్కరించుకొని సూళ్ళూరుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారినీ దర్శించుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి వెంట మునిసిపల్ కమిషనర్ నరేంద్ర ,Ex DCMS డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్ , సూళ్లూరుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ , కౌన్సిలర్ మీజూరు రామకృష్ణ ,అలవల సురేష్ , చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఓలేటి బాల సత్యనారాయణ మరియు వంక దినేష్ యాదవ్ , అయిత శ్రీధర్ ,కాకి శ్రీ రామ్ మూర్తి , కట్ట మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చెరువుకు గండి పూడ్చేది ఎవరండీ ...
దొరవారి సత్రం రవికిరణాలు టీవీ న్యూస్ :- చెరువులకు వర్షపు నీరు చేరాలి, కరకట్టలు పటిష్టంగా ఉండాలి, నీటి సామర్థ్యం నిల్వలకు దోహదపడాలి, రైతులు వేసిన పంటలకు సాలీనా నీరు అందించే దిశలో చెరువులు ఉండాలి. కానీ దొరవారిసత్రం మండలంలోని పాలింపాడు గ్రామానికి ఎగువన ఉన్న అన్నా రెడ్డి గుంట చెరువుకు గండి పడి రెండేళ్లు కావస్తున్న పూడ్చేది ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిన్నపాటి చెరువు క్యాచ్ మెంట్ ప్రాంతంగా ఉపయోగపడుతూ అక్కడనుండి ఏ కోళ్ళు పెద్ద చెరువుకు వర్షపు నీరు చేరేలా దోహదపడుతుంది. అయితే కట్టకు గండిపడి రెండేళ్లు కావస్తున్న దాని మరమ్మత్తులు గాలికి వదిలి వేయడంతో అందులోకి చేరే వర్షపు నీరు నిల్వ ఉండక బీడు భూములు, కాలువల్లోకి వెళుతుంది. గతంలో కూడా రెండు పర్యాయాలు ఈ గండికి మరమ్మతులు చేసిన అదే ప్రాంతంలోమళ్లీ గండి పడింది.గతంలో దీనికి మరమ్మతులు చేసిన గుత్తేదారునికి పూర్తిస్థాయిలో బిల్లులు రాలేదని తెలిసింది. నేడు కురుస్తున్న వర్షాలకు పైనుండి ఈ చెరువుకు చేరే నీరంతా వృధాగా కిందికి వెళ్లాల్సిందే. దీని మరమ్మతులకు సంబంధిత శాఖ అధికారులు ఇరిగేషన్, పంచాయితీ రాజ్ ఎవరికి ఫిర్యాదు చేయాలనేది రైతులు సందిగ్ధంలో ఉన్నారు. పూర్వీకులు నిర్మించిన చెరువులు నేడు ఆక్రమణకు గురి కావడం, విస్తీర్ణం తగ్గిపోవడం, నీటి సామర్థ్య నిల్వలు అనుకున్న స్థాయిలో ఉండకపోవడంతో రైతులు వేసే పంటలకు సాలీనా మీరు సరఫరా కాలేక పోతుంది. ఇకనైనా అధికారులు స్పందించి చెరువుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి, చెరువుకు పడిన గండిని తక్షణమే శాశ్వత మరమ్మతులు చేయాలని ఆ చెరువు నీటి సామర్థ్యం నిల్వలకు దోహదపడాలని రైతాంగం కోరుకుంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టగలరని అభిప్రాయపడుతున్నారు.