బాలాయపల్లి నూతన మండల కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ
స్థానిక శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండల కార్యాలయం శిదిలావాస్తకు చేరుకోవడంతో 15 వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న నూతన భవనానికి నేడు భూమిపూజ చేశారు.
వెంకటగిరి శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో మండల కార్యాలయాలు శిదిలావస్థలో ఉన్నాయని తెలిపిన వెంటనే జడ్.పి చైర్మన్ ఆనం అరుణమ్మ గారు స్పందించి నిధులు మంజూరు చేసారని ఆయన అన్నారు. ఒక కోటీ అరవై లక్షల రూపాయల నిధులతో ఈ భవనాన్ని నిర్మించానున్నారని తెలియజేసారు.
తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మాట్లాడుతూ గత పాలకుల కాలంలో కనీసం మరమ్మత్తులకు నోచుకోకుండా మండల కార్యాలయానికి విచ్చేసే ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా లేని ఈ భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించడం అభినందనీయం అన్నారు.
మహిళా సాధికారతే జగనన్నకే సాధ్యం ఎమ్మెల్యే వైసిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతే లక్ష్యంగా వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నాడని ఇది అక్కా చెల్లెమ్మలు గుర్తుపెట్టుకోవాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు నాయుడుపేట పట్టణంలో కేకే కళ్యాణ మండపం నందు గురువారం వైయస్సార్ చేయూత చెక్కులు మహిళలకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో మహిళలు పడుతున్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులను గుర్తించి మహిళలకు వైయస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 18750 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు మహిళను ఏ ప్రభుత్వం ఆదుకోకపోగా పొదుపు గ్రూపులు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించుకుపోగా సున్నా వడ్డీ రుణాలను వెనక్కి ఇచ్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు 2024లో మళ్లీ వైసీపీని ఆదరిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు మహిళలకు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. వైయస్సార్ చేయూత చెక్కుల పంపిణీ నాయుడుపేట లో అర్బన్ రూరల్ పరిధిలో మొత్తం 4360 మంది మహిళల లబ్ధిదారులకు 8 కోట్ల 17 లక్షల 50 వేల చెక్క లు అందజేయడం జరిగింద
శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం, జొన్నవాడ క్షేత్రం, బుచ్చిరెడ్డిపాలెం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భముగా , గౌరవనీయులైన టీటీడీ బోర్డు మెంబర్ శ్రీయుత క్రిష్ణమూర్తి ధర్మపత్ని అనురాధ గార్లు మరియు నెల్లూరు రూరల్ శాసన సభ్యులు శ్రీయుత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (ఆర్.డి.వో) శ్రీయుత ఏ . మలోల గారు, బుచ్చిరెడ్డిపాలెం మండలం MRO శ్రీమతి యం. ప్రమీల గారు , ఎస్.ఐ కె.వీర ప్రతాప్ గారు తదితరులు విచ్చేసి శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు గారు మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీ డబ్బుగుంట వెంకటేశ్వర్లు గారు మరియు పాలక మండలి సభ్యులు గుమ్మా రఘురామయ్య గారు , ముంగర శివ కుమార్ గారు మరియు ఎక్స్ ఆఫీషియో సభ్యులు శ్రీ ఎస్ శశిశేఖర్ శర్మ గారు ఆలయ మర్యాదలతో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి, శ్రీ మల్లికార్జున స్వామి వారికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, శ్రీ కామాక్షితాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి శేషవస్త్రంతో సత్కరించి, ప్రసాదములు అందచేశారు.
- పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు
చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి
- డబ్బుగుంట వెంకటేశ్వర్లు
సహాయ కమీషనరు మరియు
కార్యనిర్వహణాధికారి
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను అర్హులైన కాంట్రాక్టు కార్మికులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్ల నుంచి భర్తీ చేయాల్సి ఉంది. పోస్టులకు అర్హత డిగ్రీ. సెప్టెంబర్ 18న 38 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు రాత పరీక్షకు హాజరయ్యారు. అనంతరం మౌఖిక పరీక్ష నిర్వహించారు.
రాత పరీక్షకు 45 మార్కులు, మౌఖిక పరీక్షకు ఐదు మార్కులు. అయితే ఈ పోస్టుల భర్తీలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, తక్షణమే పరీక్షా ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటీషన్ దాఖలైంది. జీవో ప్రకారం.. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌లను నియమించేటప్పుడు రాత పరీక్షలతో పాటు ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్షలను నిర్వహించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనను ప్రభుత్వ అధికారులు ఉల్లంఘించారని, మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని ఎంపిక చేస్తున్నారని కొందరు.
రాష్ట్రంలో 560 గ్రేడ్-2 పోస్టుల నియామకాలకు ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చింది. 38వేల మంది అంగన్ వాడీ టీచర్లు ఇటీవల రాత పరీక్షలు రాశారు. మౌఖిక పరీక్షలు లేకుండానే సెలెక్ట్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. గ్రేడ్ 2 ఎక్స్ టెన్షన్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాలు తాత్కలికంగా నిలిచిపోనున్నాయి.
రాష్ట్రంలో 560 గ్రేడ్-2 పోస్టుల నియామకాలకు ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చింది. 38వేల మంది అంగన్ వాడీ టీచర్లు ఇటీవల రాత పరీక్షలు రాశారు. మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని సెలెక్ట్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కొందరు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సెప్టెంబర్ 29వ తేదీ గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం 50 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని శ్రవణ్ కుమార్ వాదించారు. వీటిలో 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు మౌఖిక పరీక్ష నిర్వహించాలన్నారు. అయితే రాత పరీక్ష నిర్వహించిన అధికారులు.. మౌఖిక పరీక్ష నిర్వహించకుండానే కొందరిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నారని, ఉద్యోగాల భర్తీల్లో అవకతవకలు జరిగాయని ఆయన కోర్టుకు తెలిపారు.
రాత పరీక్షను సెప్టెంబర్ 18న అధికారులు నిర్వహించారని, మౌఖిక పరీక్ష నిర్వహించకుండానే కొందరిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భర్తీల్లో అవకతవకలు జరిగాయని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. దీంతో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.
ఇలా ఉండగా.. రెండు రోజుల క్రితం మహిళ, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించి.. అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రాల సూపర్ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఏం సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామని అధికారులు కూడా తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని తెలిపారు. అయితే నియామకాల ప్రక్రియను పూర్తిచేయడానికి సీఏం విధించిన గడువుకు ఒక రోజు ముందు ఈ నియామకాల ప్రక్రియను తాత్కలికంగా నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీచేసింది.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 5వ రోజు దుర్గమ్మ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.దీంతో ఇంద్రకీలాద్రి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. దుర్గమ్మ దర్శనానికి వినాయకుడి గుడి వద్ద నుండి భక్తులు బారులు తీరారు. నేడు శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచి కొండ మీద భక్తులు క్యూ కట్టారు. లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న అమ్మని దర్శించుకుని భక్తులు పునీతులవుతున్నారు.