నెల్లూరు జిల్లా
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన "స్పందన" వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన జిల్లా యస్.పి. విజయ రావు., ఇతర పోలీసు అధికారులు.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, యస్.పి. గార్లతో స్పందన కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు నెల్లూరు జిల్లా నుండి యస్.పి. విజయ రావు హాజరైనారు. ఈ కార్యక్రమం నందు సచివాలయ భవనాల నిర్మాణాలు, ఇ-క్రాపింగ్, డిజిటల్ లైబ్రరీస్, YSR హెల్త్ సెంటర్, జగనన్న హౌసింగ్ ప్రోగ్రాం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, ఇంటి పట్టాలు, టిడ్కో హౌసింగ్, జగనన్న స్మార్ట్ టౌన్షిప్, స్పందన గ్రీవెన్సెస్, అభివృద్ధి లక్ష్యాలు, పలు అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు
నెల్లూరు జిల్లా.....
నెల్లూరు AC సుబ్బారెడ్డి స్టేడియం లో ఘనంగా తైక్వాండో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం...
రాష్ట్రం లో అన్ని జిల్లాల నుంచి పోటీలకు విచ్చేసిన సుమారు 1200 మంది క్రీడా కారులు...
నెల్లూరు నగరం లోని AC సుబ్బారెడ్డి స్టేడియం లో రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభించారు,ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల నుండి 1200మంది క్రీడాకారులు మూడు రోజుల పాటూ జరిగే ఈ పోటీల్లో పాల్గొంటారు..
ముఖ్య అతిథిలుగా పాల్గొన్న నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి,అంతర్జాతీయ తైక్వాండో రిఫరీ పి.అచ్యుత రెడ్డి,ఛాంపియన్ షిప్ ఆర్గనైజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు...
తిరుపతి జిల్లా నాయుడుపేట
నాయుడుపేట లో అత్యంత వైభవంగా శరన్నవరాత్రులు నాలుగవ రోజు పూజా కార్యక్రమాలు
తిరుపతి జిల్లా నాయుడుపేట లో గడియారం సెంటర్ వద్ద వెలసియున్న శ్రీ శ్రీ పోలేరమ్మ వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రులు నాలుగవ రోజును ని పురస్కరించుకొని, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి కి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఉభయ దాతలు, కార్తీక్ రెడ్డి ఉష, వెంకట సుబ్రహ్మణ్యం మల్లేశ్వరమ్మ, హేమంత్ కుమార్ జయమ్మ గార్లు, కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జెండా తోరణాల దాతలు గా న్యూ కలకత్తా కాటన్ బజార్ వారు,మరియు సంతోష్ జనరల్ స్టోర్ వారు ఈ కార్యక్రమానికి తోరణాల దాతలుగా నిలిచారు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన, నాయుడుపేట ఏపీ ట్రాన్స్కో ఏడి శేఖర్, పసల హరిబాబు భూపమ్మ, కమిటీ మెంబర్ దేవత కిషోర్ కామిరెడ్డి రాజారెడ్డి, గంథవల్లి భరత్ కుమార్, ఈ కార్యక్రమం శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గంధవల్లి సిద్దయ్య ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నాలుగవ రోజు జరిగింది,
మూర్ఖత్వానికి మరో పేరు జగన్మోహన్ రెడ్డి..
నందమూరి తారక రామారావు యుగపురుషులు, ఆయన ఒక కులానికో వర్గానికో సంబంధించిన వారు కాదు..
అంతటి మహోన్నత వ్యక్తి పేరు మార్చడం దుర్మార్గం...
రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతో పేరు మార్చడం లేదు ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే పేరు మారుస్తున్నారు...
ఆంధ్ర రాష్ట్రానికి, శ్రీలంకకు పెద్ద తేడా లేకుండా పోయింది...
జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి సొంత చెల్లెలు హర్షించడం లేదు..
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి...
వైద్య విశ్వవిద్యాలయానికి నందమూరి తారక రామారావు పేరును కుట్రపూరితంగా తొలగించడాన్ని నిరసిస్తూ, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూరల్ నియోజకవర్గం నేతలు గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు..
దీక్ష ముగిసిన అనంతరం నాయకులకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు..
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
ఎందరో యుగ పురుషులు ఉన్నారని, అందులో నందమూరి తారక రామారావు ఒకరని, ఆయన ఒక కులానికో, మతానికో, వర్గానికో చెందిన వారు కాదని కొనియాడారు.
ఈ విషయాన్ని, ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరూ, దీనిని నమ్ముతారని, ఒప్పుకుంటారు అని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరును మార్చడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.
ఆ విశ్వవిద్యాలయానికి పునాదులు వేసింది ఎన్టీఆర్ అని ముందు దానికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే నామకరణం చేశారని, వైద్య విద్యార్థుల ట్రైనింగ్ విషయంలో, సర్టిఫికెట్స్ ల విషయంలో మాల్ప్రాక్టీసెస్ జరగకుండా, విశ్వవిద్యాలయాన్ని స్వయంప్రతి పత్తి కింద తయారు చేశారని అన్నారు.
ఏదో పెట్టాలని ఆయన పేరు పెట్టలేదని ఆయనను స్మరించుకోవాలని ఆయన చేసిన కృషికి అనుగుణంగా గొప్ప పనులు చేసిన వారి పేర్లను భావితరాలకు గుర్తుండేలా వారి పేర్లను పెడతారని అన్నారు..
రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతో విశ్వవిద్యాలయానికి పేరు మార్చలేదని, స్పెషల్ ఆలోచనను దృష్టిని దారి మళ్లించడానికి పేరును మార్చారని అన్నారు..
అమరావతి రాజధానిగా కొనసాగించాలని రైతులు ఉత్తరాంధ్ర మొత్తం పాదయాత్ర చేస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రం దివాలాస్థితిలో ఉందని శ్రీలంకకు ఆంధ్ర రాష్ట్రానికి తేడా లేకుండా పోయిందని ఈ రెండు అంశాలను దారి మళ్లించడానికి పేరు మార్పును తెరమీదకు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు.
రాజశేఖర్ రెడ్డి గారి పేరు విశ్వవిద్యాలయానికి పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే ఎన్టీఆర్ గారి పేరు మార్చి కాదని కొత్త యూనివర్సిటీ దానికి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకోవాలని సూచించారు.
ఆ మహా నాయకుడి పేరును తొలగించడం తప్పని స్వయానా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వారి పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడి పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల ని జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి హర్షించడం లేదని అయినా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మూర్ఖంగా వ్యవహరించే వారే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు..
జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాల్సింది పేరు మార్పుపై కాదని, రాష్ట్రంలో రైతులకు వ్యాపారస్తులకు రాష్ట్ర ప్రజానీకానికి అనేక సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నాయకులు ఉన్న ఎక్కడ కూడా మార్చిన దాఖలాలు లేవని తెలంగాణ ఉద్యమ సమయంలో విగ్రహాలను ధ్వంసం చేస్తే వాటిని తిరిగి నిర్మించారని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం మర్యాదలు పాటించడం లేదని, ముఖ్యమంత్రికి ఉండాల్సిన గౌరవాన్ని కాపాడుకోవాలని, అన్నారు.
నిరాహార దీక్ష చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా మహిళలకు ధన్యవాదాలు తెలిపారని అన్నారు..
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, తాళ్ళపాక అనురాధ, దొద్దపనేని రాజా నాయుడు, సాబీర్ ఖాన్, కప్పిర శ్రీనివాసులు, తడకపల్లి సుధా, పెంచల్ నాయుడు, రేవతి, వనజా రెడ్డి, మాతంగి కృష్ణా, డాక్టర్ ఊరందూరు సురేంద్ర బాబు, పనబాక భూలక్ష్మీ, కంటే వెంకట సాయి బాబా, ఈదర శ్రీనివాసులు, నన్నే సాహెబ్, కొమరి విజయ, ఉయ్యాల రవీంద్ర, మిర్చి రవి, జగన్ మోహన్, కే. వీ. సుబ్బరాజు, రసూల్, పెంచలయ్య, భాస్కర్, బుజ్జమ్మ, ప్రమీల, సుబ్బన్న, సత్తార్, అశోక్, సాజీద్, మారుతి, నెల్లూరు మురళి, కాపా భాస్కర్, సుబ్రహ్మణ్యం, అంబటి మణికంఠ, బమ్మిడి మణికంఠ, రూపక్, సునీల్, ఇజ్రాయేల్, పద్మావతి, తోటా సునీల్, దారా మళ్ళీ, వల్లెరు బాల సిద్దయ్య, రబ్బానీ, నవీన్, కొండల రావు, మౌనిక, నర్మదా, ప్రభావతి, గురవయ్యా, మునుస్వమి, జేజే నారాయణ, శీవాచారీ, శ్రీనివాసులు, కిషోర్ కుమార్, చెంచయ్య, అనీల్ బాబు, నారా శ్రీనివాసులు నాయుడు, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
కావలి మున్సిపాలిటీ పరిధిలోనీ మద్దూరుపాడు నందు బిజెపి ఆధ్వర్యంలో ప్రజా పోరు:: బిజెపి కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం.
భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షతన, బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశానుసారం, కావలి మున్సిపాలిటీ పరిధిలోని మద్దురుపాడులో పలు సెంటర్లలో ఈరోజు ప్రజాపోరు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
బీజేవైఎం కావలి పట్టణ అధ్యక్షులు ఆళ్ల తిరుపతిరావు ఆధ్వర్యంలో మద్దురుపాడు లోని పలు సెంటర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో బిజెపి కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ కావలి మున్సిపల్ పరిధిలోని మద్దూరుపాడు సమస్యల వలయంలో చిక్కుకుంది అన్నారు. గతంలో గ్రామం గా ఉన్న మద్దురూపాడు మున్సిపాలిటీలో విలీనమైనప్పటినుండి అనేక సమస్యలతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ,డ్రైనేజ్ వ్యవస్థ ,పారిశుద్ధ్య వ్యవస్థ , మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. కావలి మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే మద్దూరుపాడు ఒకటో వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి, ఇక్కడ వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి సంక్షోభం వలన తీవ్రంగా నష్టపోయిన బలహీన వర్గాలను ఆదుకునేందుకు 2020 ఏప్రిల్ నెల నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం అందిస్తుంది .ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 తో ముగుస్తున్న పథకాన్ని డిసెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచిత బియ్యాన్ని డిసెంబర్ వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కావలి మున్సిపాలిటీలో పాలన అస్తవ్యస్తంగా ఉంది ,నీటి నిర్వహణ మరియు పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉందని తెలిపారు. తడి చెత్త పొడి చెత్త పేరుతో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి కావలి ప్రాంతంలో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. అమృత పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 100 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు పూర్తిగా వైసిపి ప్రభుత్వం లో దుర్వినియోగం అయ్యాయని అన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేదలకు అందవలసిన బియ్యం నాలుగు నెలలుగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నాలుగు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.ముసునూరు రోడ్డు, తుమ్మలపెంట రోడ్డు, ఉదయగిరి బ్రిడ్జి రోడ్లు అధికార పార్టీ నాయకులకు మరియు ప్రజా ప్రతినిధులకు, అధికారుల కంటికి కనపడవా అని ప్రశ్నించారు.వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కావలి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు లక్కరాజు భాస్కర్ ,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుట్టుబోయిన మాధవరావు యాదవ్ ,కేతిరెడ్డి విష్ణు తేజ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శివప్రసాద్ బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కిల గుంట జీవ, కూరాకుల సవీంద్ర ,కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు కామినేని ఉదయలక్ష్మి ,కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మంగమూరు వెంకటరెడ్డి ,ఎస్సీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు కటకం మనోజ్ కుమార్, మహిళా మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి చేజర్ల స్వప్న తదితరులు పాల్గొన్నారు.
బి.పి.మండల్ విగ్రహ దిమ్మె కూల్చడమంటే బీసీ లను అవమానించడమే - టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర..
బీసీ రిజర్వేషన్ల పితామహుడు బి.పి.మండల్ విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను గుంటూరు నగరపాలక సిబ్బంది కూల్చివేయడం అత్యంత దుర్మార్గం.
బీసీ లన్నా, బీసీ నేతలన్నా వైసీపీ ప్రభుత్వానికి చిన్న చూపు. బీసీల హక్కుల కోసం అనుక్షణం తపించిన బి.పి.మండల్ వంటి మహనీయుని విగ్రహ దిమ్మె కూల్చడం బీసీ లను అవమానించడమే.
బీసీ వర్గాలపై జరిగే దాడులను, మైనార్టీలు, దళితుల పై పోలీసులు చేస్తున్న అరాచకాలను ఎదురించి బడుగుల పక్షాన నిలిచిన నాయకుడు బి.పి.మండల్.
పౌర హక్కుల కమిషన్ ఛైర్మన్ గా ప్రభుత్వ, విద్య సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు బి.పి.మండల్ అండగా నిలిచారు.
బీసీ లకు విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు లభించినప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని బి.పి.మండల్ ఎలుగెత్తి చాటారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన బి.పి.మండల్ విగ్రహ దిమ్మెను కనీస ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం అవమానిస్తుంది..