తిరుపతి జిల్లా నాయుడుపేట
నాయుడుపేట లో అత్యంత వైభవంగా శరన్నవరాత్రులు నాలుగవ రోజు పూజా కార్యక్రమాలు
తిరుపతి జిల్లా నాయుడుపేట లో గడియారం సెంటర్ వద్ద వెలసియున్న శ్రీ శ్రీ పోలేరమ్మ వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రులు నాలుగవ రోజును ని పురస్కరించుకొని, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి కి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఉభయ దాతలు, కార్తీక్ రెడ్డి ఉష, వెంకట సుబ్రహ్మణ్యం మల్లేశ్వరమ్మ, హేమంత్ కుమార్ జయమ్మ గార్లు, కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జెండా తోరణాల దాతలు గా న్యూ కలకత్తా కాటన్ బజార్ వారు,మరియు సంతోష్ జనరల్ స్టోర్ వారు ఈ కార్యక్రమానికి తోరణాల దాతలుగా నిలిచారు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన, నాయుడుపేట ఏపీ ట్రాన్స్కో ఏడి శేఖర్, పసల హరిబాబు భూపమ్మ, కమిటీ మెంబర్ దేవత కిషోర్ కామిరెడ్డి రాజారెడ్డి, గంథవల్లి భరత్ కుమార్, ఈ కార్యక్రమం శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గంధవల్లి సిద్దయ్య ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నాలుగవ రోజు జరిగింది,
మూర్ఖత్వానికి మరో పేరు జగన్మోహన్ రెడ్డి..
నందమూరి తారక రామారావు యుగపురుషులు, ఆయన ఒక కులానికో వర్గానికో సంబంధించిన వారు కాదు..
అంతటి మహోన్నత వ్యక్తి పేరు మార్చడం దుర్మార్గం...
రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతో పేరు మార్చడం లేదు ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే పేరు మారుస్తున్నారు...
ఆంధ్ర రాష్ట్రానికి, శ్రీలంకకు పెద్ద తేడా లేకుండా పోయింది...
జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి సొంత చెల్లెలు హర్షించడం లేదు..
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి...
వైద్య విశ్వవిద్యాలయానికి నందమూరి తారక రామారావు పేరును కుట్రపూరితంగా తొలగించడాన్ని నిరసిస్తూ, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూరల్ నియోజకవర్గం నేతలు గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు..
దీక్ష ముగిసిన అనంతరం నాయకులకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు..
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
ఎందరో యుగ పురుషులు ఉన్నారని, అందులో నందమూరి తారక రామారావు ఒకరని, ఆయన ఒక కులానికో, మతానికో, వర్గానికో చెందిన వారు కాదని కొనియాడారు.
ఈ విషయాన్ని, ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరూ, దీనిని నమ్ముతారని, ఒప్పుకుంటారు అని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరును మార్చడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.
ఆ విశ్వవిద్యాలయానికి పునాదులు వేసింది ఎన్టీఆర్ అని ముందు దానికి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే నామకరణం చేశారని, వైద్య విద్యార్థుల ట్రైనింగ్ విషయంలో, సర్టిఫికెట్స్ ల విషయంలో మాల్ప్రాక్టీసెస్ జరగకుండా, విశ్వవిద్యాలయాన్ని స్వయంప్రతి పత్తి కింద తయారు చేశారని అన్నారు.
ఏదో పెట్టాలని ఆయన పేరు పెట్టలేదని ఆయనను స్మరించుకోవాలని ఆయన చేసిన కృషికి అనుగుణంగా గొప్ప పనులు చేసిన వారి పేర్లను భావితరాలకు గుర్తుండేలా వారి పేర్లను పెడతారని అన్నారు..
రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతో విశ్వవిద్యాలయానికి పేరు మార్చలేదని, స్పెషల్ ఆలోచనను దృష్టిని దారి మళ్లించడానికి పేరును మార్చారని అన్నారు..
అమరావతి రాజధానిగా కొనసాగించాలని రైతులు ఉత్తరాంధ్ర మొత్తం పాదయాత్ర చేస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రం దివాలాస్థితిలో ఉందని శ్రీలంకకు ఆంధ్ర రాష్ట్రానికి తేడా లేకుండా పోయిందని ఈ రెండు అంశాలను దారి మళ్లించడానికి పేరు మార్పును తెరమీదకు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు.
రాజశేఖర్ రెడ్డి గారి పేరు విశ్వవిద్యాలయానికి పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే ఎన్టీఆర్ గారి పేరు మార్చి కాదని కొత్త యూనివర్సిటీ దానికి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకోవాలని సూచించారు.
ఆ మహా నాయకుడి పేరును తొలగించడం తప్పని స్వయానా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వారి పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడి పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల ని జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి హర్షించడం లేదని అయినా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మూర్ఖంగా వ్యవహరించే వారే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు..
జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాల్సింది పేరు మార్పుపై కాదని, రాష్ట్రంలో రైతులకు వ్యాపారస్తులకు రాష్ట్ర ప్రజానీకానికి అనేక సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన నాయకులు ఉన్న ఎక్కడ కూడా మార్చిన దాఖలాలు లేవని తెలంగాణ ఉద్యమ సమయంలో విగ్రహాలను ధ్వంసం చేస్తే వాటిని తిరిగి నిర్మించారని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం మర్యాదలు పాటించడం లేదని, ముఖ్యమంత్రికి ఉండాల్సిన గౌరవాన్ని కాపాడుకోవాలని, అన్నారు.
నిరాహార దీక్ష చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా మహిళలకు ధన్యవాదాలు తెలిపారని అన్నారు..
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, తాళ్ళపాక అనురాధ, దొద్దపనేని రాజా నాయుడు, సాబీర్ ఖాన్, కప్పిర శ్రీనివాసులు, తడకపల్లి సుధా, పెంచల్ నాయుడు, రేవతి, వనజా రెడ్డి, మాతంగి కృష్ణా, డాక్టర్ ఊరందూరు సురేంద్ర బాబు, పనబాక భూలక్ష్మీ, కంటే వెంకట సాయి బాబా, ఈదర శ్రీనివాసులు, నన్నే సాహెబ్, కొమరి విజయ, ఉయ్యాల రవీంద్ర, మిర్చి రవి, జగన్ మోహన్, కే. వీ. సుబ్బరాజు, రసూల్, పెంచలయ్య, భాస్కర్, బుజ్జమ్మ, ప్రమీల, సుబ్బన్న, సత్తార్, అశోక్, సాజీద్, మారుతి, నెల్లూరు మురళి, కాపా భాస్కర్, సుబ్రహ్మణ్యం, అంబటి మణికంఠ, బమ్మిడి మణికంఠ, రూపక్, సునీల్, ఇజ్రాయేల్, పద్మావతి, తోటా సునీల్, దారా మళ్ళీ, వల్లెరు బాల సిద్దయ్య, రబ్బానీ, నవీన్, కొండల రావు, మౌనిక, నర్మదా, ప్రభావతి, గురవయ్యా, మునుస్వమి, జేజే నారాయణ, శీవాచారీ, శ్రీనివాసులు, కిషోర్ కుమార్, చెంచయ్య, అనీల్ బాబు, నారా శ్రీనివాసులు నాయుడు, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
కావలి మున్సిపాలిటీ పరిధిలోనీ మద్దూరుపాడు నందు బిజెపి ఆధ్వర్యంలో ప్రజా పోరు:: బిజెపి కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం.
భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షతన, బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశానుసారం, కావలి మున్సిపాలిటీ పరిధిలోని మద్దురుపాడులో పలు సెంటర్లలో ఈరోజు ప్రజాపోరు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
బీజేవైఎం కావలి పట్టణ అధ్యక్షులు ఆళ్ల తిరుపతిరావు ఆధ్వర్యంలో మద్దురుపాడు లోని పలు సెంటర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో బిజెపి కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ కావలి మున్సిపల్ పరిధిలోని మద్దూరుపాడు సమస్యల వలయంలో చిక్కుకుంది అన్నారు. గతంలో గ్రామం గా ఉన్న మద్దురూపాడు మున్సిపాలిటీలో విలీనమైనప్పటినుండి అనేక సమస్యలతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ,డ్రైనేజ్ వ్యవస్థ ,పారిశుద్ధ్య వ్యవస్థ , మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. కావలి మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే మద్దూరుపాడు ఒకటో వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి, ఇక్కడ వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి సంక్షోభం వలన తీవ్రంగా నష్టపోయిన బలహీన వర్గాలను ఆదుకునేందుకు 2020 ఏప్రిల్ నెల నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం అందిస్తుంది .ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 తో ముగుస్తున్న పథకాన్ని డిసెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచిత బియ్యాన్ని డిసెంబర్ వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కావలి మున్సిపాలిటీలో పాలన అస్తవ్యస్తంగా ఉంది ,నీటి నిర్వహణ మరియు పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉందని తెలిపారు. తడి చెత్త పొడి చెత్త పేరుతో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి కావలి ప్రాంతంలో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. అమృత పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 100 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు పూర్తిగా వైసిపి ప్రభుత్వం లో దుర్వినియోగం అయ్యాయని అన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేదలకు అందవలసిన బియ్యం నాలుగు నెలలుగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నాలుగు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.ముసునూరు రోడ్డు, తుమ్మలపెంట రోడ్డు, ఉదయగిరి బ్రిడ్జి రోడ్లు అధికార పార్టీ నాయకులకు మరియు ప్రజా ప్రతినిధులకు, అధికారుల కంటికి కనపడవా అని ప్రశ్నించారు.వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కావలి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు లక్కరాజు భాస్కర్ ,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుట్టుబోయిన మాధవరావు యాదవ్ ,కేతిరెడ్డి విష్ణు తేజ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శివప్రసాద్ బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కిల గుంట జీవ, కూరాకుల సవీంద్ర ,కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షులు కామినేని ఉదయలక్ష్మి ,కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మంగమూరు వెంకటరెడ్డి ,ఎస్సీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు కటకం మనోజ్ కుమార్, మహిళా మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి చేజర్ల స్వప్న తదితరులు పాల్గొన్నారు.
బి.పి.మండల్ విగ్రహ దిమ్మె కూల్చడమంటే బీసీ లను అవమానించడమే - టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర..
బీసీ రిజర్వేషన్ల పితామహుడు బి.పి.మండల్ విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను గుంటూరు నగరపాలక సిబ్బంది కూల్చివేయడం అత్యంత దుర్మార్గం.
బీసీ లన్నా, బీసీ నేతలన్నా వైసీపీ ప్రభుత్వానికి చిన్న చూపు. బీసీల హక్కుల కోసం అనుక్షణం తపించిన బి.పి.మండల్ వంటి మహనీయుని విగ్రహ దిమ్మె కూల్చడం బీసీ లను అవమానించడమే.
బీసీ వర్గాలపై జరిగే దాడులను, మైనార్టీలు, దళితుల పై పోలీసులు చేస్తున్న అరాచకాలను ఎదురించి బడుగుల పక్షాన నిలిచిన నాయకుడు బి.పి.మండల్.
పౌర హక్కుల కమిషన్ ఛైర్మన్ గా ప్రభుత్వ, విద్య సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు బి.పి.మండల్ అండగా నిలిచారు.
బీసీ లకు విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు లభించినప్పుడే సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని బి.పి.మండల్ ఎలుగెత్తి చాటారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన బి.పి.మండల్ విగ్రహ దిమ్మెను కనీస ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం అవమానిస్తుంది..
మోదీ పాలన దేశానికి, జగన్ పాలన రాష్ట్రానికి ఒరిగేది ఏమి లేదు - మాజీ ఎంపీ చింతా మోహన్.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
దేశం లో కుల,మత,ప్రాంతాల మధ్య ద్వేషాలు పెంచుతూ బాషల మధ్య బీజేపీ ప్రభుత్వం అసమానతలు పెంచుతుందని, రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరును గురించి చిన్నపిల్లల్లాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తిట్టడం శోచనీయమని ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని సీఎం జగన్ ఆకాశంలో ఉన్నారని 175 కి 175 సీట్లు గెలుచుకుంటారని అనుకోవడం అవివేకమని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో 26 సీట్లు రావడం కష్టమేనని అమరావతి రైతుల పాదయాత్రను ఉద్దేశించి మంత్రులు చేసే వ్యాఖ్యలు బాధాకరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంలో తాత్కాలిక ప్రయోజనం వైయస్ రాజశేఖర్ రెడ్డి అంత పెద్ద డాక్టర్ కాదని శాశ్వత ప్రయోజనాల రూపకల్పన వైపు సీఎం జగన్ దృష్టి సారించాలని దేశంలో మోడీ పాలన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంతా ఒకే తాటి మీదకు తీసుకురావడం లక్షంగా
ముందుకు పోతుందని మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ అన్నారు. గురువారం
స్థానిక ఆర్ &బి గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో చింతా మోహన్ పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్ళ పాలనలో దేశానికి 8 పులులు తెచ్చారే తప్ప ఇంకేమి
చేయలేదని, ఆదానిని ప్రపంచ కుబేరుడు చేశారని పేదల ఆకలి ,నిరుద్యోగుల బాధలు ఆయనకు అర్ధం కావడం లేదని ఆయన
విమర్శించారు.దేశాన్ని బీజేపీ బ్రష్టు పట్టిస్తే ,రాష్ట్రాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్రష్టు పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలలో ఇసుక నుంచి గ్రావెల్ వరకు విచ్చలవిడిగా దోచుకు తింటున్నారని దోపిడి చేసింది చాలు ఇక ఆపేయండి అని వారికి పది రోజులు టైం ఇస్తున్నానని వారు దోపిడిని ఆపకుంటే అందరి బాగోతం బయటపెడతానని చింతా మోహన్ హెచ్చరించారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు మంచి విశేష ప్రజాదరణ లభిస్తుందని 2024లో రాహుల్ సారధ్యంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అన్నారు.
ఘనంగా చెంగాలమ్మ శరన్నవరాత్రి వేడుకలు
శ్రీ అష్టకాలళిగా శ్రీ శ్రీ శ్రీ చెంగాళ్ళమ్మ పరమేశ్వరి దేవి.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
పట్టణంలో వెలసినఉన్న శ్రీ చెంగాళ్ళమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా గురువారం నాల్గవ రోజు అమ్మవారు శ్రీ అష్ట కాళీ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ అష్టకాలి అలంకారం ఉభయకర్తలగా హైదరాబాదుకు చెందిన మద్దాలి చరణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీ ప్రియా రెడ్డి దంపతులు వ్యవహరించారు శరన్నవరాత్రి సందర్భంగా చెంగాళ్ళమ్మ తల్లికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో చండీయాగం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా సూళ్లూరుపేటకు చెందిన మాదరపాక జగన్మోహన్, గౌరీ దంపతులు వ్యవహరించారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఈ చండీయాగం నిర్వహించారు.
కోళ్ళమిట్ట నుండి "సారే"
శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి "సారె" ను కోళ్ల మిట్ట, రాఘవయ్యపేట, రాజీవ్ నగర్, ఇసుకమిట్ట, రైల్వే గేటు, హనుమాన్ వీధి ప్రాంతాలకు చెందిన భక్తులు భక్తి శ్రద్ధలతో బయలుదేరారు. ఈ" సారె" కార్యక్రమం కోళ్ల మిట్ట చెంగాళ్ళమ్మ చెట్టు నుండి భక్తులు బయలుదేరారు. భక్తులతో పాటు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఆలయ ఈఓ ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఊరేగిపు బాణాసంచాల మధ్య డప్పులు, మంగళ వాయిద్యాల నడుమ వీర జాటీలతో భక్తులు కోలాహంగా బయలుదేరి ఆలయ వద్దకు చేరుకున్నారు. ముందుగా చెంగాలమ్మ చెట్టు వద్ద పూజలు నిర్వహించి అనంతరం భక్తులందరూ ఆలయం లోకి వెళ్లి అమ్మవారికి స్వయంగా "సారె" ను సమర్పించారు. సాయంత్రం ఆలయంలో నెల్లూరుకు చెందిన లవ్లీ ఈవెంట్ వారిచే నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం ప్రజలను ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కళత్తూరు జనార్దన్ రెడ్డి, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి వంకా దినేష్ కుమార్ కర్లపూడి సురేష్ బాబు ఓలేటి బాల సత్యనారాయణ మన్నెముద్దుల పద్మజా నాయుడు కుప్పం నాగమణి బండి సునీత, పెనుభేటీ మారమ్మ, ఎక్స్ అఫీషియో సభ్యులు కీసరపల్లి నరేంద్ర, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.