న్యూఢిల్లీ: అబార్షన్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళ వైవాహిక స్థితిని ప్రమాణికంగా పరిగణించలేమని తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళకు ఉందని తెలిపింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని పేర్కొంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో సుప్రీంకోర్టు గురువారం ఈ విధంగా వ్యాఖ్యానించింది.
అదే విధంగా భర్త బలవంతం చేసినా అది అత్యాచారమే అవుతుందని సుప్రీం తీర్పునిచ్చింది. వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించాలన్న సుప్రీంకోర్టు.. దాని ద్వారా కలిగే గర్భాన్ని కూడా అబార్షన్ చేసుకునే అధికారం మహిళలకు ఉందని తెలిపింది. గర్భం దాల్చిన 24 వారాల వరకు ఎంటీసీ చట్టం ప్రకారం అబార్షన్‌కు అనుమతినిచ్చింది. ప్రతి భారతీయ మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉందని, కేవలం వివాహిత స్త్రీలే శృంగారం చేయాలని నిబంధన ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఎస్సై గా పదోన్నతి పొందిన డేవిడ్ దాస్ కి సన్మానం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న డేవిడ్ దాసుని ఎస్సై గా పదోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఆఫీస్ నుంచి ఆదేశాలిచ్చారు. గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్తున్న డేవిడ్ దాసుని, మనుబోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ముత్యాల రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వీడ్కోలు సభ నిర్వహించారు. మనుబోలు ఎస్ఐ ముత్యాలరావు మాట్లాడుతూ, డేవిడ్ దాస్ మనుబోలు పోలీస్ స్టేషన్లో చేసిన సేవలను కొనియాడారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాది దారులతో, పోలీస్ సిబ్బంది తో ఎంతో హుందాగా వ్యవహరించేవాడని, సున్నిత మనస్తత్వం కలవాడు అని, ఆయన ఎస్సై గా పదోన్నతి పొంది గుంటూరు జిల్లా కి వెళ్తున్న అందుకు సంతోషంగా ఉన్నా, ఒకవైపు స్టేషన్ ను వదిలి వెళ్తున్న అందుకు బాధగా ఉందన్నారు. ఎందుకంటే ఆయనకు, మాకు ఉన్న అనుబంధం అలాంటిది అని తెలియజేశారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి,సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
60 లక్షల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 17 మరియు 18 డివిజన్ పరిధిలోని అపోలో హాస్పిటల్ సెంటర్ టు పెద్ద బైపాస్ రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి మరియు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో ఈ రోడ్డు పనులను పూర్తిచేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ రోడ్డు మార్గం ద్వారా భారీ వాహనాలు పోకుండా రోడ్డు మొదట, చివరన ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి సహాయసహకారాలతో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులన్నింటిని పూర్తిచేయడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ శ్రీమతి హరిత గారు, 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, 18వ డివిజన్ కార్పొరేటర్ అశోక్ నాయుడు, 17, 18 డివిజన్ల స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కన్యాకపరమేశ్వరి ఆలయం లో 5 కోట్ల డబ్బు నోట్లతో అత్యంత వైభవంగా అలంకరణ
నెల్లూరు జిల్లా :
దసరా పండగ రానున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా ఐదు కోట్ల మేరకు 2000,500,200,100,50,20,10 డబ్బుల నోట్ల తో అత్యంత వైభవంగా అలంకరణ చేయడం జరిగింది.
కనివిని ఎరుగని రీతిలో భక్తులు ఆలయాన్ని చేరుకుని, మునుపెన్నడూ చూడలేనివిధంగా, ఆసక్తికరంగా ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని దర్శించుకోవడానికి, అత్యధిక సంఖ్యలో క్యూ లో
దర్శనము చెసుకున్నారు
తిరుపతి జిల్లా
నాయుడుపేట
నాయుడుపేట లో అత్యంత వైభవంగా శరన్నవరాత్రులు మూడవరోజు పూజా కార్యక్రమాలు
తిరుపతి జిల్లా నాయుడుపేట లో గడియారం సెంటర్ వద్ద వెలసియున్న శ్రీ శ్రీ పోలేరమ్మ వారి గుడి వద్ద మూడవ రోజును పురస్కరించుకొని దేవి శరన్నవరాత్రులు లో భాగంగా గాయత్రి దేవి కి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఉభయ దాతలు కుబేర్ మనీ, తంబి రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, మారా బత్తిన సుధాకర్, లాయర్ సోమశేఖర్,లు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన, కామిరెడ్డి రాజారెడ్డి, దేవతా కిషోర్, రామచంద్రారెడ్డి, గంథవల్లి భరత్ కుమార్, ఈ కార్యక్రమం శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గంధవల్లి సిద్దయ్య ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది
తిరుపతి జిల్లా...
నిజాయితీగా వందనం.
ఆటో డ్రైవర్ నిజాయితీకి అభినందనలు తెలిపిన పోలీస్ శాఖ.
ఈరోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయం లో కపిలతీర్థం నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆటో ఎక్కిన ఒక కుటుంబం టైం బయలుదేరుతుంది అన్న కంగారులో తమ విలువైన బ్యాగును ఆటోలో మర్చిపోయారు.
బ్యాక్ నందు సుమారు ఒకటిన్నర లక్ష రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నది ఆటో డ్రైవర్ శ్రీ ఉమాపతి ప్రయాణికులు బ్యాగు మరిచిపోయారన్న సంగతి గ్రహించి ఆలస్యం చేయక వెంటనే నిజాయితీతో రైల్వే స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఉన్న ట్రాఫిక్ పోలీసులకు అప్పగించడం జరిగింది.
ట్రాఫిక్ పోలీసు వారు బ్యాగ్ లో ఉన్న ఆధారాల ప్రకారం వెంటనే వాళ్ళకి ఫోన్ ద్వారా సమాచారం అందించి పోగొట్టుకున్న వారి బ్యాగును వారికి అప్పగించారు.
పోగొట్టుకున్న విషయం తెలుసుకొనే లోపే విలువైన బ్యాగును వెంటనే మాకు అప్పగించిన తిరుపతి పోలీసు వారికి అలాగే నిజాయితీతో వ్యవహరించిన ఆటో డ్రైవర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.
సమాచారం తెలుసుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., వారు నిజాయితీపరులకు ఎప్పుడు సమాజంలో గౌరవించబడతారని ఉమాపతిని స్ఫూర్తిగా తీసుకొని తోటి వారు కూడా నిజాయితీతో నిబద్ధతగా నడుచుకోవాలని ఇలాంటివారు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు.
ఆటో డ్రైవర్ ఉమాపతి నిజాయితీని ప్రశంసిస్తూ ట్రాఫిక్ డి.ఎస్.పి శ్రీ కాటమరాజు గారు సత్కరించి అభినందించారు.