తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో పలువురు నూతన గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలను స్థానిక ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి,జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు.బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన ఏడుగురు గ్రామ వాలంటీర్లకు స్థానిక ప్రజా ప్రతినిధులు నియామక పత్రాలను అందించారు.ఇందులో చేరివి సచివాలయం పరిధిలో శివాని,ధనలక్ష్మి, కన్నవరంలో రేఖ,మీనా,కొత్తమారికుప్పంలో గోమతి,ఇలరశి,శిరణబూదూరు సచివాలయం పరిధిలో సోనియా తదితరులు నియామక పత్రాలను అందుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతిమ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది అర్హులకు అందేటట్టు చూడాల్సిన బాధ్యత గ్రామవాలంటీర్ల పై ఉందన్నారు.ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన ప్రజలకు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనాధికారి రమణకుమార్,సీనియర్ అసిస్టెంట్ శివయ్య,జూనియర్ అసిస్టెంట్ సురేష్ కుమార్,ఎంపిటిసి మోహన్ రెడ్డి,సుధాకర్, శ్రీరాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా సత్యవేడు ప్రింట్ మీడియా అసోసియేషన్ సభ్యులు పలువురు శ్రీ సిటీ ఎండి డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డిని సన్మానించారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇటీవల గౌరవ డాక్టరేట్ పట్టాను శ్రీసిటీ ఎండి రవీంద్రసన్నా రెడ్డికి ప్రధానం చేశారు.ఈ నేపథ్యంలో బుధవారం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సత్యవేడు ప్రింట్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రయ్య,సభ్యులు ఎస్. శ్రీనివాసరావు,సలీంభాష,విగ్నేష్ తదితరులు శ్రీసిటీ ఎండి రవీంద్రసన్నారెడ్డికి పూలమాలవేసి శాలువా కప్పి సత్కరించడం తోపాటు స్వామి చిత్రపటాన్ని బహూకరించారు.ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం,తడ,సూళ్లూరుపేట మండలాలకు చెందిన పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
పల్లిపట్టు నాగరాజును సత్కరించిన శ్రీసిటీ ఎండీ
రవి కిరణాలు న్యూస్ శ్రీసిటీ, సెప్టెంబర్ 28, 2022:
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2022కి ఎంపికైన పల్లిపట్టు నాగరాజును శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందించారు. బుధవారం శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగరాజును సన్మానించి గౌరవించారు. శ్రీసిటీ పరిసర ప్రాంతానికి చెందిన నాగరాజు అత్యున్నత సాహిత్య గౌరవానికి నామినేట్ కావడం, జాతీయ ఖ్యాతిని పొందడం ఈ ప్రాంత సాహిత్యాభిమానులందరికీ చాలా సంతోషకరమైన విషయంగా డా. రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో సాహిత్యరంగంలో అత్యుత్తమ జాతీయ పురస్కారం 'జ్ఞానపీత్' అవార్డు నాగరాజును దక్కాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన హిందూ దినపత్రిక తిరుపతి ప్రత్యేక ప్రతినిధి ఎడి రంగరాజన్ మాట్లాడుతూ నాగరాజు విలక్షణమైన సాహిత్య శైలిని కొనియాడారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన మత్స్యకారులు, చర్మకారులు, పారిశుద్ధ్య కార్మికులను రచనా వస్తువులుగా ఎంచుకుని, సమాజానికి వాళ్ళు ఎలా ఉపయుక్తమో వివరించటం అద్భుతమని పేర్కొన్నారు.
తనకు లభించిన గౌరవం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన నాగరాజు, తన స్వంత ప్రాంతంలో, ప్రముఖ శ్రీసిటీ పారిశ్రామిక నగరంలో లభించిన ఈ గౌరవాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన కవిత్వం ద్వారా సమకాలీన సమస్యలపై గొంతు విప్పడమే కాకుండా, వాటిని పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందన్న భావన కలుగుతోందంటూ, తన రచన 'యాలై పూడిసింది' గురించి వ్యాఖ్యానించారు.
సత్యవేడు మండలం రాజగోపాలపురానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు నాగరాజు సమకాలీన సామాజిక సమస్యలను ప్రస్తావించే 52 కవితల సంకలనం 'యాలై పూడిసింది' అనే తెలుగు రచనకు గాను పురస్కారానికి ఎంపికయ్యారు.
శ్రీసిటీ ప్రెస్ రిలేషన్స్ ఆఫీసర్ డి.రవి స్వాగత సందేశంతో సన్మాన సభ ప్రారంభం కాగా, శ్రీసిటీ పీఆర్వో మరియు ప్రముఖ తెలుగు కథా రచయిత పల్లేటి బాలాజీ నాగరాజు గారిని పరిచయం చేస్తూ ఆయన సాహిత్య రచనలు, విశిష్ట శైలి గురించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సత్యవేడు, వరదయ్యపాలెం, తడ విలేకర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు.
తిరుమల సెప్టెంబర్ , 28:-
తిరుమలలో లక్ష్మి వి పి ఆర్ రెస్ట్ హౌస్ ప్రారంభించి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి బుధవారం ఉదయం 9.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది.
రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి ఎంపీ లు గురుమూర్తి, ఎంఎల్సీ కళ్యాణ చక్రవర్తి, ఎం ఎల్ ఏ లు తిరుపతి, శ్రీకాళహస్తి, భూమన కరణాకరరెడ్డి, బియ్యపు మధుసూధన్ , తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణ రెడ్డి, తిరుపతి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, అడిషనల్ ఎస్ పి సుప్రజ, జిల్లా జాయింట్ కలెక్టర్ డి కే బాలాజీ, తిరుపతి నగర పాలక కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ లు భూమన అభినయ రెడ్డి,తదితరులు వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓర్వకల్లు బయలుదేరి వెళ్లారు.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట : సూళ్లూరుపేట CPI పార్టీ కార్యాలయంలో AISF ,AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115 వ జయతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇలపా నాగేంద్రబాబు మాట్లాడుతూ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదంతో, నా దేహం ముక్కలైనా.... నా దేశాన్ని ముక్కలు కానివ్వం అని యుక్త వయస్సులో వురికంబాన్ని ముద్దాడిన వీరుడని కొనియాడారు. యువకులు విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో AIYF జిల్లా సహాయ కార్యదర్శి మోదుగుల వినోద్ కుమార్, AISF నియోజకవర్గ కార్యదర్శి తేరే సూర్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బాలు, వసుంధర, విజయమ్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
చెంగాలమ్మ ఆలయంలో శరన్నవరాత్రులు మూడవ రోజున అభిషేకం, గోపూజ మరియు చండి యాగం.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట : కాల్లంగి నది ఒడ్డున గలసియున్న శ్రీ శ్రీ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం నందు శరన్నవరాత్రులు సందర్భముగా మూడవ రోజు శ్రీ అమ్మవారికి అభిషేకం చేస్తారు అనంతరం గోపూజ నిర్వహించి తదుపరి చండియాగం నిర్వహించారు . ఈకార్యక్రమం ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి సమక్షంలో, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో నిర్వహిచారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన అనంతరాజు ఉమామహేశ్వర రావు శ్రీమతి లక్ష్మీ సుభద్ర దంపతులు ఉభయకర్తలగా వ్యవహరించారు. ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ చంద్రశేఖర్ రెడ్డి, మన్నేముద్దు పద్మజ తదితరులు పాల్గొన్నారు.