మర్రిపాడు.... టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను మర్యాద పూర్వకంగా కలిసిన టీడీపీ కావలి సోషల్ మీడియా కోఆర్డినేటర్ మల్లు స్వాతిరెడ్డి.. మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మల్లు రమణారెడ్డి కోడలు మల్లు స్వాతి రెడ్డి. కావలి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా సమాచార బాధ్యతలను ప్రజలకు నీరాడంబరగా తెలియపరుస్తున్నా మల్లు స్వాతి రెడ్డి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న స్వాతి రెడ్డిని అభినందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
మూడో విడత వైఎస్సార్ చేయూత లబ్ధిదారులు చెక్కులు అందజేసిన MLA సంజీవయ్య, మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి....
MLA సంజీవయ్యకూ పూలతో ఘనంగా స్వాగతం పలికిన పొదుపు మహిళలు..
రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ...
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పంలో బటన్ నొక్కి 26,39,703మంది అకౌంట్‌లలో 4,949.44 కోట్లు జామచేశారు.. రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్టీ, ఎష్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వైఎస్సార్ చేయూత కింద అందిస్తున్న సంగతి తెలిసిందే.వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందించిన నిధులతో మహిళలు చిన్న వ్యాపారాలు, ఇతర అవసరాలకు, ఉపాధి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.
ఈరోజు సూళ్లూరుపేటలోని స్థానిక MKM కల్యాణమండపం నందు సూళ్లూరుపేట పట్టణ,రూరల్ సంబందించిన వైఎస్సార్ చేయూత లబ్ది కలిగిన అక్క, చెల్లమ్మలకు MLA, సంజీవయ్య గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి గారు,MPP అనిల్ రెడ్డి గారు,చెక్కులని అందజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం వ్యాప్తంగా, మండల వారిగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత కింద సాయాన్ని అందజేస్తునట్టు MLA సంజీయ్య గారు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సహాయని మన ముఖ్యమంత్రి ys జగన్ మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారని MLA సంజీవయ్య గారు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు అందించారు. మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున అందించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందించిన నిధులతో మహిళలు చిన్న వ్యాపారాలు, ఇతర అవసరాలకు, ఉపాధి కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు.పెద్ద సంఖ్యలో వైస్సార్ ఆశ్ర లబ్దిపొందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని, జగనన్నకూ ధన్యవాదములు తెలిపారు. అంతేకాదు ప్రతి మండలానికి ఒక వైఎస్సార్ చేయూత మహిళాలు వైస్సార్ ఆశ్ర ద్వారా వచ్చిన పెద్ద మొత్తాని తక్కువ దరకి అందిస్తున్నారాని MLA సంజీవయ్య గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు కలత్తూరు శేఖర్ రెడ్డి,సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరేందర్ కుమార్,MRO రవి కుమార్,వైస్ చైర్మన్ పోలూరు పద్మ, చిన్ని సత్యం, కౌన్సిలర్స్ ముంగర శేషారెడ్డి, చిట్టి బాబు, శరత్ గౌడ్, ముత్తుకూరు లక్ష్మమ్మ,, సన్న రెడ్డి సౌజన్య, కడూరు లక్ష్మమ్మ, పేర్నాటి లక్ష్మీదేవి, ఉమ్మటి రమ్య, తుపాకుల సుశీల, గుణపాటి మన స్వామి, బదిలీ మహేశ్వర్, మింజురూ రామకృష్ణ , కొండూరు జనార్ధన్, మునీంద్ర బాబు, పాముజుల విజయలక్ష్మి, షాఇక్ జాబీనా, పొన్న ముని ప్రసాద్, విజయలూరు అశ్విని, మరియు మునిసిపల్ కోఆప్షన్ సభ్యులు, కాళహస్తి బాబురావు, కలత్తూరు సునీల్ రెడ్డి, షాఇక్ షహీన, మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్స్, తుపాకుల ప్రసాద్, మల్లి శ్రీనివాసులు, వీరరాఘవ మొదలియార్, మరియు వైస్సార్సీపీ నాయకులు ఐత శ్రీధర్, అలవల సురేష్,పాల మురళి, ఒలేటి సత్యం,ఫయాజ్,మోహన్రెడ్డి, ఎర్రపారెడ్డి బాబూరెడ్డి,సర్పంచ్లు, గురవయ్య, బుంగ చెంగయ్య,మాజీ DCMS డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్, చెంగాలమ్మ ట్రస్ట్ బోర్డు సభ్యులు కర్లపూడి సురేష్, మాజీ సభ్యులు గోగుల తిరుపాల్, మున్సిపల్ అధికారులు,సూళ్లూరుపేట మెప్మా, పొదుపు అక్క, చెల్లమ్మలు ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రవి కిరణాలు న్యూస్ శ్రీసిటీ: తిరుపతి విమానాశ్రయం డైరెక్టర్ ఎం.రాజకిషోర్ శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇతర అధికారులతో చర్చించిన ఆయన, విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలు, సేవలను వివరించారు. తిరుపతి విమానాశ్రయంలో మరిన్ని సేవలను పెంచాల్సిన ఆవశ్యకత, డిమాండ్ దృష్ట్యా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన అన్నారు. శ్రీసిటీ పరిశ్రమవర్గాలు తమ ప్రయాణ అవసరాలు, కార్గో బుకింగ్‌లకు ఎయిర్‌పోర్ట్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. చిన్న, భారీ వస్తువులను వివిధ గమ్యస్థానాలకు త్వరితగతిలో రవాణా చేయడానికి కార్గో టెర్మినల్ వీలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. శ్రీసిటీ, విమానాశ్రయం మధ్య రోడ్డు కనెక్టివిటీ మెరుగుపడుతున్న నేపథ్యంలో ప్రయాణ అవసరాలకు కూడా తిరుపతి విమానాశ్రయాన్ని వినియోగించుకోవాలని రాజకిషోర్ కోరారు.
శ్రీసిటీని సందర్శించినందుకు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కి డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏపిఐఐసి తిరుపతి జోనల్ మేనేజర్ ఎస్ఎస్ సోనీ తదితరులు పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా సిద్దార్థ లాజిస్టిక్స్ కంపెనీని రాజకిషోర్ సందర్శించి, అక్కడ అధికారులతో చర్చించారు.
బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని సి.పి. ఐ నాయకులు డిమాండ్.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట పట్టణం లోని వినాయకుని గుడి సెంటర్లో నిర్మాణం లో ఉన్న బ్రిడ్జ్
ను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం
సిపిఐ అద్వర్యం లో ఆందోళన నిర్వహించారు,బ్రిడ్జ్ నిర్మాణ పనులు చివరి దశ లోకి
వచ్చిన తరువాత గత మూడు వారాలుగా పనులు చేయకుండా అలాగే వదిలి వేయడం
పై సి.పి.ఐ నాయకులు బ్రిడ్జ్ పైన బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేసారు,బ్రిడ్జ్
పనులు వెంటనే పూర్తి చేయాలనీ, బ్రిడ్జ్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని
నినాదాలు చేశారు , ఈ నిరసన కార్యక్రమం లో సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు మోదుగుల పార్థసారథి, మోదుగుల రమణయ్య ,నియోజకవర్గ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ఆనంద్,జిల్లా సమితి సభ్యులు శ్రీనివాసులు, ప్రభుదాసు ,నియోజకవర్గ కార్యదర్శి ఇలపా. నాగేంద్ర బాబు, మహిళా సంఘం నాయకురాలు బి చెంచమ్మ లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి బాలయ్య,బాలు ,సూర్య, తదితరులు పాల్గొన్నారు.