సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జి ఓ కాపీలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన టిడిపి నాయకులు.
సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జి ఓ కాపీలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన టిడిపి నాయకులు.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టిడిపి నేతలు నిరసన తెలియజేసారు,
టిడిపి నియోజకవర్గం ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం,తిరుపతి పార్లమెంట్ టిడిపి కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి అద్వర్యం లో ఎన్టీఆర్ యూనివర్సిటీ కి వైయస్ఆర్ పేరు పెట్టాలని తీర్మానించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అదే పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పేరు మార్పుకు రూపొందించిన ప్రతిపాదనల జి ఓ కాపీలను దగ్ధం చేసి నిరసన తెలియజేసారు. అనంతరం
ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు.
అనంతరం టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ...
యన్ టి ఆర్ పేరు తొలగించడం దారుణం. పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ .
భారతదేశం లోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన నందమూరి తారక రామారావు పేరును
తొలగించాలన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అవివేకమని పట్టణ టిడిపి
అధ్యక్షుడు ఆకుతోట రమేష్ విమర్శించారు.
ఏ పి కి దుర్దినం - తిరుమూరు సుధాకర రెడ్డి.
తెలుగు జాతికే వన్నె తెచ్చిన ఎన్టీఆర్ ను విస్మరించడం AP కి ఇది ఒక దుర్దినమని
ప్రభుత్వాలు మారిన పేర్లు మార్పు చేసే సాంప్రదాయం భారతదేశం లో ఎక్కడా లేదని
పైశాచిక ఆనందం కోసం సీఎం విరుద్దంగా వ్యవహరిస్తున్నారని టిడిపి తిరుపతి పార్లమెంట్
అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి విమర్శించారు.
మహనీయులను అవమానిస్తున్నారు - వేనాటి సతీష్ రెడ్డి విమర్శ.
మహనీయులను అవమానిస్తున్నారని చెప్పడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడమే నిదర్శనమని,సూళ్లూరుపేట లో పోలీసులు వారి విధులను పక్కన పెట్టి
మున్సిపాలిటీ పనులు చేస్తున్నారని, పట్టణం లో గంజాయి , గుట్కాలు విచ్చల విడిగా
అమ్ముతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుందని టిడిపి తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి విమర్శించారు.
పేరు మార్చడం దుర్మార్గం- టిడిపి ఇంచార్జ్ నెలవల సుబ్రమణ్యం .
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి YSR పేరు పెట్టాలనే సీఎం ప్రతిపాదన దుర్మార్గమైన
చేర్య అని ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఎన్టీఆర్ పేరు కొనసాగేవరకు టిడిపి
పోరాటం చేస్తుందని నియోజకవర్గం టిడిపి ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు.