ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపికైన నలుగురు అభ్యర్ధులను ప్రకటించిన భారత ఎన్నికల సంఘం నామినేషన్ వేసిన డాక్టర్ శ్రీ బీద మస్తాన్ రావు, శ్రీ విజయసాయి రెడ్డి, శ్రీ నిరంజన్ రెడ్డి మరియు శ్రీ కృష్ణయ్య మొదలగు నలుగురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన రిటర్నింగ్ ఆఫీసర్ గెలుపొందినట్లు పత్రాలను పొందిన నలుగురు అభ్యర్ధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని క్యాంపు కార్యాలయంలో కలసి ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ శ్రీ బీద మస్తాన్ రావు
ఈరోజు 3-06-2022 తేదిన నామినేషన్ ఉపసంహరణ పిదప వైయస్సార్‌సీపీ అభ్యర్దులుగా రాజ్యసభకు నామినేషన్ వేసిన డాక్టర్ శ్రీ బీద మస్తాన్ రావు, శ్రీ విజయసాయి రెడ్డి, శ్రీ నిరంజన్ రెడ్డి మరియు శ్రీ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీ పివి సుబ్బారెడ్డి ప్రకటించారు. గెలుపొందినట్లు పత్రాలను నలుగురు అభ్యర్ధులకు రిటర్నింగ్ అధికారి శ్రీ పివి సుబ్బారెడ్డి అందించారు. ఈ కార్యక్రమములో మంత్రివర్యులు శ్రీ వేణుగోపాల కృష్ణ, శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,
ఆఫ్కాఫ్ చైర్మన్ శ్రీ కొండూరు అనిల్ బాబు, బిసి రాష్ట్ర నాయకులు శ్రీ దేవరాల సుబ్రహ్మణ్యం
మొదలగు వారు పాల్గొని రాజ్యసభకు ఎంపికైన డాక్టర్ శ్రీ బీద మస్తాన్ రావు, శ్రీ విజయసాయి రెడ్డి, శ్రీ నిరంజన్ రెడ్డి మరియు శ్రీ కృష్ణయ్య ను అభినందించారు. పిదప డాక్టర్ శ్రీ బీద మస్తాన్ రావు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని క్యాంప్ కార్యాలయంలో కలసి ధన్యవాదాలు తెలిపారు.
డాక్టర్ శ్రీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ బిసిలలో యాదవ సామజిక వర్గానికి ఇప్పటివరకు ఏ పార్టీ ఇవ్వని అవకాశాన్ని నాకు ఇచ్చి రాజ్యసభకు అభ్యర్ధి గా ఎంపిక చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనవంతు కృషిగా బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని, మన రాష్ట్ర అంశాలను రాజ్యసభలో లేవదీసి వాటి పరిష్కారానికి దోహదపదతానని చెప్పారు.డాక్టర్ శ్రీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిందని, మనసా, వాచా మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో అమలుకే ప్రాధాన్యం ఇస్తూ రాజకీయాల్లో కొత్త చరిత్ర రాస్తున్నారని చెప్పారు. ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త చరిత్రను రాసుకుంటూ ముందుకెళుతోందని, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో సమూల మార్పులు మొదలయ్యాయిని డాక్టర్ బీద మస్తాన్ రావు తెలిపారు.
ఎలాంటి సంక్షోభ సమయంలోనైనా పేదల బతుక్కి ఢోకా లేదన్న భరోసా ఈ రాష్ట్రంలో మాత్రమే ఉందని, ఏ ఆధారం లేని వృద్ధులు సహా పలు వర్గాలకు ఠంచన్‌గా ఒకటో తేదీనే పింఛను నడుచుకుంటూ ఇంటికొస్తోందని చెప్పారు. ప్రతినెల మొదటి రోజున 60.75 లక్షల మందికి 1543.80 కోట్ల రూపాయలను గ్రామ, వార్డు సచివాలయ్లలోని వాలంటీర్ల ద్వారా పంపిణి చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పారు.పిల్లల్ని బడికి పంపితే ప్రతి తల్లికి 15000 ఇస్తానని హామీ ఇచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నపటికీ ప్రతి తల్లికి డబ్బు ఇస్తూ అది సాధ్యమని నిరూపించారు మన ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వ బడులను నాడు – నేడు కింద బాగు చేయడం ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి గారు. వాటికి కార్పొరేట్ లుక్ తతెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదే అని డాక్టర్ మస్తాన్ రావు తెలిపారు.చేయూత కింద స్వయం ఉపాధి నిమిత్తం మహిళలకు 18500 రూపాయలను ఇస్తున్నారని, చేతిపనులు చేసే వివిధ వర్గాలవారికి నేస్తం పేరుతో మన ముఖ్యమంత్రి ఆర్ధిక సహాయం చేస్తున్నారని అన్నారు.
దాదాపు 31 లక్షల మందికిపైగా పేద కుటుంబాల సొంతింటి కల... స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తరవాత నెరవేరుతోందని, మహిళలు చిరు వ్యాపారాలు సైతం చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడ్డారని, ఇలా ఒకటేమిటి... చెప్పుకుంటూ పోతే మూడేళ్లలో ఈ రాష్ట్రం ఎన్నో మార్పులు చూసిందని, మూడేళ్ల కిందటి కంటే తామిప్పుడు బాగున్నామనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్న నిజమని, మున్ముందు మరింత బాగుంటామన్న నమ్మకమూ ప్రజలకున్నదని డాక్టర్ బీద మస్తాన్ రావు చెప్పారు. మూడేళ్ల కిందట మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ వై.యస్. జగన్‌మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధికిచ్చే నిర్వచనమిదే అని డాక్టర్ బీద మస్తాన్ రావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మళ్లీ ఎన్నికల ముందు మాత్రమే నేతలకు గుర్తుకు రావటమన్నది గతమంతా చూసిన చరిత్ర. కాని శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఫుల్‌స్టాప్ పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పింది చెయ్యటమే తన పరిపాలన అజెండాగా పెట్టుకున్నారని, మాట తప్పకూడదన్న చిత్తశుద్ధితో తొలిరోజు నుంచే హామీల అమలుకు నడుంకట్టారని, అందుకే మూడేళ్లలో నవరత్నాల ద్వారా 95 శాతానికి పైగా హామీలను అమలు చేయగలిగారని మస్తాన్ రావు అన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి, మరో 42వేల కోట్లు బకాయిలు పెట్టినా, పులిమీద పుట్ర మాదిరి మూడేళ్లుగా కోవిడ్ మహమ్మారి విజృంభించి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా, సంక్షోభంలో సైతం జన జీవనాలు తల్లకిందులు కాకూడదన్న ఉద్దేశంతో వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రూ.1.40 లక్షల కోట్లను నేరుగా జనం ఖాతాల్లోకి మన ప్రియతమ ముఖ్యమంత్రి బదిలీ చేశారని, వీటి లబ్దిదారులను కుల, మత, రాజకీయాలకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా వైయస్‌ఆర్ నవశకం పేరిట ఇంటింటి సర్వే చేయించి మరీ ఎంపిక చేశారని, అందుకే ఈ మొత్తంలో పైసా కూడా పక్కదోవ పట్టకుండా నేరుగా అర్హుల్ని చేరిందని డాక్టర్ బీద మస్తాన్ రావు తెలియ చేసారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తనకిచ్చిన అవకాశానికి డాక్టర్ బీద మస్తాన్ రావు మరొక్కసారి ధన్యవాదాలు తెలిపారు.