ఘనంగా దువ్వూరు గోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.....
దొరవారిసత్రం రవి కిరణాలు న్యూస్:- దొరవారి సత్రం మండల సీనియర్ వైసిపి నాయకులు, వైస్ ఎంపీపీ దువ్వూరు గోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో DBR యువసేన ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తాసిల్దార్ గోపిరెడ్డి, ఎంపీడీవో సింగయ్య ,ఎంఈఓ మస్తానయ్య లతో పాటు పలువురు సీనియర్ నాయకులు మరియు సర్పంచులు మరియు అధికారులు పాల్గొన్నారు.
సప్త ఖండ అవధాన సాహితీ ఝరి అంగరంగంగా విజయోత్సవ సభ
సప్త ఖండాలలోని వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సప్తఖండ అవధాన సాహితీ ఝరి విజయోత్సవ సభ, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, జీవన సాఫల్య సాహితీ పురస్కార సభ 29 మే 2022 న శ్రీ ప్రణవ పీఠం లో అత్యద్భుతంగా జరిగాయి. ప్రణవ పీఠం స్వచ్ఛంద కార్య నిర్వాహకురాలు అమెరికా, టెక్సాస్ నుండి శ్రీమతి కృష్ణ పద్మ తెలియచేసారు. సప్తఖండాల నుండి వివిధ దేశాల సాహిత్య నిపుణులు పాల్గొని సాహిత్య వేదిక అంగరంగంగా అలరించింది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న నానుడితో సభ జయప్రదంగా ముగిసింది.
ఈ అవధానంలో ఆస్ట్రేలియా ఖండం నుండి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ తరఫున శ్రీ గోవర్ధన్ మల్లెల గారు, దక్షిణ ఆఫ్రికా ఖండం నుండి దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ సీతారామరాజు గారు, ఐరోపా ఖండం నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(టాళ్) వైస్ చైర్మన్ మరియు కోశాధికారి శ్రీ రాజేష్ తోలేటి గారు, ఆసియా ఖండం నుండి సింగపూర్ శ్రీ సాంస్మృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రత్నకుమార్ కవుటూరి గారు, ఖతార్ దేశం నుండి తెలుగుకళా సమితి అధ్యక్షులు శ్రీ తాతాజీ ఉసిరికల గారు, శ్రీమతి సౌమ్య కంతేటి గారు, మలేషియా తెలుగు అసోసియేషన్ నుండి శ్రీమతి సత్యాదేవి మల్లుల గారు, ఉత్తర అమెరికా ఖండం, అమెరికా నుండి శ్రీ రామచంద్రరావు తల్లాప్రగడ గారు, కెనడా నుండి తెలుగుతల్లి కెనడా మాస పత్రిక ఎడిటర్ శ్రీమతి లక్ష్మీ రాయవరపు గారు, దక్షిణ అమెరికా ఖండం, పెరూ దేశం నుండి శ్రీ రంగారెడ్డి బద్దం గారు పృచ్ఛకులుగా పాల్గొనగా, ఆస్ట్రేలియా ఖండం నుండి శ్రీ అవధాన శారదామూర్తి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి గారు అవధాన సంచాలకత్వం చేసారు.
తెలుగు భాషకి అత్యున్నత వైభవం అయిన ‘అవధాన ప్రక్రియ’ను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో "సప్త ఖండ అవధాన సాహితీ ఝరి" అనే కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టారు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. మూడు భాషలలో సహస్రావధానం చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ప్రతి మాసం ఒక్కొక్క ఖండం చొప్పున దాదాపు 20కి పైగా దేశాలు పాల్గొనగా, అంతర్జాలం లో 13 అష్టావధానాలు పూర్తి చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, మే 29 వ తేదీన అంతర్జాలం వేదికగా సప్తఖండాల నుండి తెలుగు ప్రతినిధులుగా 11 మంది పృచ్ఛకులు పాల్గొనగా 14 వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేసారు.
కళాబ్రహ్మ శిరోమణి డా|| శ్రీ వంశీ రామరాజు గారు, ప్రసిద్ధ తెలుగు సినీ గేయ రచయిత శ్రీ భువన చంద్ర గారు, కొప్పరపు కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మా శర్మ గారు, ప్రముఖ కవి, సినీ గేయరచయిత శ్రీ వడ్డేపల్లి కృష్ణగారు విశిష్ట అతిథులుగా శ్రీ ప్రణవ పీఠానికి విచ్చేయగా, ప్రముఖ చలన చిత్ర నటులు శ్రీ తనికెళ్ళ భరణి గారు, శ్రీ వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ చిట్టెన్ రాజు గారు(అమెరికా), శ్రీమతి ఘంటసాల పార్వతి గారు, పెరుంగో సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ స్వామి నారాయణ గారు (కెనెడా) ... తదితరులు జూమ్ ద్వారా సభలో పాల్గొన్నారు.
ఈ విజయోత్సవ సభ లో సప్తఖండ అవధాన సాహితీ ఝరి ప్రత్యేక సంచిక ఆవిష్కరణతో పాటు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ వంశీ ఆర్ట్ థియేటర్స్ - ఇంటర్నేషనల్, ఇండియా; శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు శుభోదయం గ్రూపువారు సంయుక్తంగా నిర్వహిస్తున్న సద్గురు ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠాత్మకమైన సద్గురు ఘంటసాల శతజయంతి వంశీ - శుభోదయం అంతర్జాతీయ జీవిత సాఫల్య సాహితీ పురస్కారం- 2022 బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.
ఎంతో రసవత్తరంగా, కన్నుల పండుగగా సాగిన ఈ సభని వీక్షించిన సాహితీ ప్రియులు, చాలా కాలం తరువాత చక్కని కార్యక్రమం తిలకించామని హర్షం వ్యక్తపరిచారు.
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీ ప్రణవ పీఠం స్థాపించారు. ప్రవచన కర్తగా వారు సుప్రసిద్ధులు. సంగీత, సాహిత్యాలలో సమప్రతిభ, తెలుగు, సంస్కృతం, హిందీ భాషలలో సమ పాండిత్యం కలిగిన వారు. తెలుగు భాషని, సంస్కృతినీ నిలబెట్టడానికి వీరు ఆధ్యాత్మిక యాత్రలని శిష్యులతో చేస్తుంటారు.
ఏడు ఖండాల్లో జరిగిన ఈ 14 అవధానాలతో కలుపుకుని ఇప్పటికి 1244 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు, తెలుగు, సంస్కృతం, హిందీలో ఏకకాలంలో మహాసహస్రావధానం చేసారు వద్దిపర్తి వారు. వారి అసాధారణమైన ప్రతిభని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు గుర్తించాయి. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి సంకల్పం నిరాటంకంగా సాగాలని, తెలుగుభాష మరింత ఖ్యాతిని గడించాలని ఆశిద్దాం.
మన తెలుగు పతాకాన్ని ప్రపంచం అంతా రెప రెపలాడిద్దాం….
కెనడా లో అంగరంగ వైభోగంగా తాకా వారి శ్రీ సీతారాముల కళ్యాణం
తెలుగు అలయెన్సెస్ అఫ్ కెనడా (తాకా) వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. టొరంటోలోని శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ ఆడిటోరియంలో దాదాపు 600 మందికి పైగా భక్తులు హాజరవ్వగా, మేళతాళాలు, కూచిపూడి నాట్యము, పాటలు, భజనలతో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగింది. ఆదివారం, ఏప్రిల్ 10 వ తేదీ ఉదయం 9 గంటలకు కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. తాకా అధ్యక్షులు శ్రీమతి కల్పన మోటూరి మరియు కార్యవర సభ్యులు, ట్రస్టీలు, మరియు వ్యవస్థాపక సభ్యులు ఉదయము 6 గంటలకు వేడుక వద్దకు చేరుకొని పానకము, వడపప్పు తయారు చేయగా, తాకా యువ కార్యకర్తలు స్వామి వారి పెళ్లి మందిరమును ఏర్పరిచారు.
టొరంటో లోని, ప్రముఖ అర్ఛకులు శ్రీ మంజునాథ్ సిద్ధాంతి గారు మరియు వారి శిష్య బృందంతో సుప్రభాత సేవ, అభిషేకం, షోడశోపచార పూజలతో స్వామి వారి కల్యాణాన్ని మొదలు పెట్టి, కలశ స్థాపన, పుణ్యావచనం,ప్రవర,జిలకర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర క్రతువులతో కార్యక్రమాన్ని జరుపుతుండగా, సర్వోపచార సేవలు నృత్యం, గీతం మరియు భజనలు, మంగళ వాయిద్యాలతో భక్తులను అలరించారు. నాగేంద్రన్ మరియు వారు బృందం సన్నాయి డోలులతో అత్యంత శ్రావణీయంగా స్వామివారి కల్యాణాన్ని కావించారు.
ఈ కార్యక్రమంలో అలంకృత ఎలమర్తి (సుప్రభాతం), షాలిని చెరకుల,మయూఖ, శ్రీముఖి లక్కవజ్జుల, కృతి కవికొండల, రంజిత హంసాల,అనిత సజ్జ, హాసిని,ఆశ్రిత సామంతుల, సీరం గొర్తి వివిద గీతములు పాడగా , మరియు ప్రియాంక కూచిపూడి నృత్యం సర్వోపచారములలో భాగంగా కల్యాణ మహోత్సవం లో పాల్గొని భక్తుల అభినందనలు పొందారు. టొరంటోలో జరిగిన ఈ కార్యక్రమానికి 57 మంది జంటలు కల్యాణానికి కూర్చొన్నారు. దాదాపు వంద మంది సంకల్పం తీసుకున్నారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమము చివరగా మంగళ హారతులు పాడి , తీర్థ ప్రసాదాలు భక్తులందరికి అంద చేసారు.
ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరాల,రాణి మద్దెల, యూత్ డైరెక్టర్స్ విద్య భావనం, ఖాజిల్ మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు ఇతర వ్వ స్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం ,లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామ చంద్ర రావు దుగ్గిన మరియు అందరి వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి గారు అభినందించారు.
నాటి ఉగాది నుండి నేటి రోజు వరకు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ కార్యక్రమం ముగింపు
తిరుపతి జిల్లా నాయుడుపేటలో, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన, మజ్జిగ, మరియు ప్రతి శనివారం భోజన కార్యక్రమం, నేటికి 60 రోజులు దీక్ష పూర్తి చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో భాగంగా, సేవా సమితి అధ్యక్షులు మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువ అయినందున, సేవలో భాగంగా నాయుడుపేట మరియు చుట్టుపక్కల ప్రజలందరికీ, మజ్జిగ మరియు భోజనం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు, అలాగే భగవాన్ శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో, ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్లు చేయబడును ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన, సేవా సమితి కన్వీనర్, కే లీల చంద్రశేఖర్ గారిని అభినందించారు, ఈ కార్యక్రమంలో సభ్యులుగా, గణపతి గోపాలయ్య, శశిధర్ వై జనార్ధన్ యాదవ్, వి జనార్దన్ రెడ్డి లను ఆయన అభినందించారు, అనంతరం ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో ముగియనుంది అని తెలియజేశారు,
తిరుపతి జిల్లా నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న డాక్టర్" ఆధవరం సందీప్,పేదల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్న ఉచిత సేవలను పేదల సద్వినియోగం చేసుకోవాలని, ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఆధవరం సందీప్ పిలుపునిచ్చారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు అన్ని రకాల శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తామని అన్నారు, వయసు రీత్యా చేసే పనులు, శరీరంలో కాల్షియం తగ్గుదల, గర్భసంచి తీసివేయడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అలాగే మోకాళ్ళ కు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం, ట్రినిటీ హాస్పిటల్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు వైద్యరంగంలో మోకాళ్ళ మార్పిడి కి సంబంధించి కొత్త విధానం మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సకు బదులుగా బి మ్యాక్ ఇంజక్షన్ ద్వారా దీర్ఘకాలికంగా మోకాళ్ల అరుగుదల వల్ల పడుతున్న ఇబ్బంది కి శాశ్వత పరిష్కారం, ఆరోగ్యశ్రీ లేని, నిరుపేదలకు,సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చికిత్స చేయబడును అని ట్రినిటీ హాస్పిటల్ డాక్టర్ ఆదవరం సందీప్ అన్నారు, మా ఆసుపత్రి నందు, అన్ని రకాల పరికరములు కలవని, అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ట్రినిటీ హాస్పిటల్ సేవలు అందిస్తుందని అన్నారు
తిరుపతి జిల్లా. (సూళ్లూరుపేట) శ్రీహరికోట:-
ఇస్రో ఈ నెల 16 నుండి నివహిస్తున్న యువిక -2022 కార్యక్రమం ముగింపు
వేడుకను షార్ లో శుక్రవారం ప్రారంభించారు,రెండు రోజులు పాటు జరిగే
ముగింపు వేడుకలను షార్ లోని బీపీ హాలు లో షార్ డైరెక్టర్ A రాజరాజన్
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు, దేశవ్యాప్తముగా వివిధ రాష్ట్రాలకు
చెందిన 153 మంది విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది, ఈ విద్యార్థులు
శుక్రవారం సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యేక్షంగా వీక్షించారు, శనివారం తో
యువిక - 2022 వేడుకలు ముగుస్తాయి, అంతరిక్ష శాస్త్ర సాంకేతిక రంగం వైపు
యువతను ఆకర్షించడం కోసం ఇస్రో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను
ప్రోత్సహిస్తుంది, ఈ కార్యక్రమం లో అసోసియేట్ డైరెక్టర్ M బద్రినారాయణ మూర్తి ,
MSA డైరెక్టర్ సెంథిల్ కుమార్ , గ్రూప్ డైరెక్టర్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అపోలో హాస్పిటల్లో చికిత్స మెరుగైన వైద్యం కోసం మరికొద్దిసేపట్లో మెరుగైన చికిత్స కోసం చెన్నై కు తరలింపు ..
ఆమంచర్ల లో గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ ముగించుకుని ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఎమ్మెల్యేకు అస్వస్థత . రెండు వారాల క్రితం కూడా అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే. అపోలో డాక్టర్ శ్రీరామ్ సతీష్ :
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎలాంటి ప్రాణాపాయం లేదు. సాధారణ స్థితి కంటే హార్ట్ రేట్ పెరిగిపోయింది. బిపి తగ్గింది. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే కండిషన్ సాధారణ స్థితికి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోకి తరలించాం. ఎమ్మెల్యేకు ..గా పెరాక్సీజమల్ సుప్రవెంట్రిక్యులర్ టెకీ కాడియా. వైసిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి..ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు , హాస్పిటల్ కు చేరుకొని ఎమ్మెల్యేని పరామర్శించిన మంత్రి కాకాని మెరుగైన చికిత్స కోసం చెన్నై కు తరలింపు .....