శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, నేలటూరుపాళెంలో శ్రీ రాముల వారి పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. ముందుగా నెలటూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆరో ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి కాకాణి గారు
అట్టి రిపోర్ట్ ను సీతారాపురం పోలీసు స్టేషన్ వారి Cr.No:46/2022 U / Sec.379IPC కేసు నమోదు చేయబడినది .
దర్యాప్తులో భాగంగా , గౌ // SP గారైన శ్రీ . CH . విజయరావు పర్యవేక్షణలో , Crime శ్రీమతి చౌడేశ్వరి సూచనల మేరకు Incharge SDPO Kavali Sri . K. శ్రీనివాసులు , మరియు ఉదయగిరి CI అయిన శ్రీ గిరిబాబు మరియు W.S.I ఉదయగిరి SI SR . Puram వారి సిబ్బందితో రెండు బృందాలుగా ముద్దయిలకోరకు వెతుకుచుండగా ,
26.05.2022 రాబడిన సమాచారము మేరకు పై కనబరచిన ఇద్దరు ముద్దాయిలను అనుమానాస్పదముగా కావలి RTC బస్సు స్టాండ్ సెంటర్ లో ఉండగా పట్టుకొని విచారించగా , షుమారు 13 రోజుల కిందట సీతారాంపురం బస్సులో బంగారు ఆభరణాలు దొంగతనం చేసినట్లు , వాటిని నెల్లూరు వెళ్లి అమ్ము కుందామని కావలికి వచ్చినట్లుపై చెప్పినారు . అంతట వాళ్ళను పట్టుకొని వాళ్ళు వద్ద నుండి షుమారు 200 గ్రాములు బంగారు ఆభరణాలు వాటి విలువ షుమారు 10,00,000 / – రూపాయలు విలువ చేసే వాటిని స్వాధీనము చేసుకొని , అరెస్ట్ చేయడమైనది .ఈ సందర్భంగా SP శ్రీ విజయరావు సిబ్బందికి అభినందనలు తెలియ జేశారు .
ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో జూన్ 28 వరకు ఎన్నికల కోడ్
279 పోలింగ్ కేంద్రాలఏర్పాటు
ఎన్నికకు 648 బ్యాలెట్ యూనిట్స్ : జిల్లా కలెక్టర్ చక్రధర బాబు
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్ బాబు వెల్లడించారు.
గురువారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా 3 పార్లమెంటు, 7అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 115- ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉప ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన 25వ తేది నుండి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం జరిగిందన్నారు జిల్లాలో వచ్చే నెల జూన్ 28వ తేదీ వరకు అమలులో వుంటుందని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల నియమావళి కి అనుగుణంగా, కేంద్ర ఎన్నిక సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు బెల్ ఇంజినీర్ల సహకారంతో అవసరమైన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ సిద్దం చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 30వ తేదీన రిటర్నింగ్ అధికారిచే గజెట్ నోటిఫికేషన్ జారి చేయబడుతుందని, వచ్చే నెల జూన్ 6వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, జూన్ 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, జూన్ 9వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణ, జూన్ 23వ తేదీన పోలింగ్, జూన్ 26వ తేదీన ఓట్ల లెక్కింపు వుంటుందని కలెక్టర్ తెలిపారు.
ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 2,13,330 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందులో 1,05,924 మంది పురుష ఓటర్స్, 1,07,733 మంది మహిళా ఓటర్స్, 11 మంది థర్డ్ జండర్స్ ఓటర్స్ , 62 మంది సర్వీసు ఓటర్స్ వున్నారని కలెక్టర్ వివరించారు. ఓటర్లలో 80 సంవత్సరాల పైబడి వయస్సు గల 4,981 మంది వున్నారని, అలాగే విభిన్న ప్రతిభావంతులు 4,777 మంది వున్నారని, వీరు సజావుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
నియోజక వర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 1,000 ఓట్లు పైబడి ఓట్లు కలిగిన పోలింగ్ కేంద్రాల పరిధిలో అదనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. 2022,జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకొని ఓటర్ల జాబితాను సిద్దం చేయడం జరిగిందని, ఈ ఓటర్ల జాబితాను అభ్యర్దులకు, పోలింగ్ ఏజెంట్స్ కు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి 648 బ్యాలెట్ యూనిట్స్ ను, 593 కంట్రోల్ యూనిట్స్ ను, 583 వివి ప్యాట్స్ ను వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.
నియోజక వర్గ పరిధిలో ఏ ఓటర్ ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలో తెలిసేలా ఓటర్ల స్లిప్ లను ఓటర్లకు అందచేయడం జరుగుతుందని, అలాగే ఇప్పటికే ఎపిక్ కార్డును ఓటర్స్ కు జారి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఓటర్ ఎఫిక్ కార్డు తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు పాస్ బుక్, డ్రైవింగ్ లెసెన్స్, పాన్ కార్డు, ఎన్.ఆర్.ఈ. జి.ఏ కార్డు, పాస్ పోర్టు వంటి 12 రకాల గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేయుటకు ఎన్నికల సంఘం గుర్తించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా
జాయింట్ కలెక్టర్ వుంటారని, జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా డి.ఎం.హెచ్.ఓ
వుంటారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికల
ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు అవసరమైన కమిటీలను ఏర్పాటు
చేయడం తో పాటు అవసరమైన పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందని కలెక్టర్
తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు, అభ్యర్ధులకు
అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కలెక్టర్
తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరెందిరా ప్రసాద్, అడిషనల్ ఎస్.పి. హిమావతి,
జిల్లా రెవిన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి
సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
నెల్లూరు జనసేన పార్టీ టైగర్ శ్రీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు, చేపట్టిన పవనన్నప్రజాబాట కార్యక్రమం day10 రోజుకు చేరుకుంది, మన జనసేనపార్టీ ప్రెసిడెంట్, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నెల్లూరు సిటీ ప్రజలలోకి బలంగా తీసుకోనివెళ్తున్న మన కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు, అప్పుడే 10రోజులు అయిపోయ్యాయా అని అనిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు
వీధి వ్యాపారుల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన మునిసిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్.
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట:-
పేట మునిసిపాలిటి పరిధిలోని వీధి వ్యాపారుల కమిటీ సభ్యులతో సమావేశం ను మునిసిపల్ కమీషనర్ నాగిశెట్టి నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వీధి వ్యాపారులు తమ సమస్యలను కమిషనర్ కు తెలియజేస్తూ పట్టణంలో ఇంకా కొంతమంది వీధి వ్యాపారస్తులను జాబితాలో చేర్చాలని కోరారు. అందుకు కమీషనర్ మాట్లాడుతూ వారి పేర్లు ఇస్తే సర్వే జరిపి వారికి ID కార్డులను ఇచ్చి మరియు వారికి PM స్వనిధి/జగనన్న తోడు పథకాల క్రింద MEPMA ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.
ఈ సమావేశానిక ముఖ్య అతిథిగా విచ్చేసిన APGB మెయిన్ మేనేజర్ శ్రీమతి స్వాతి మాట్లాడుతూ నిజమైన వీధి వ్యాపారులు కు ఖచ్చితంగా ఆర్థిక సహాయం అందచేస్తామని తెలియ చేశారు. ఈ సమావేశం లో MEPMA సిటీ మిషన్ మేనేజర్ పెంచలయ్య, CO లు నారాయణమ్మ, హానుమాయి, పట్టణ సమాఖ్య అధ్యక్షులు స్వప్న, కార్యదర్శి రమణమ్మ, TLF RP విభ, MECC సుప్రియ, AITUC సభ్యులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట
నాయుడుపేట భరత్ నగర్ లో గడప గడప కార్యక్రమంలో కిలివేటి
తిరుపతి జిల్లా నాయుడుపేట భరత్ నగర్ లో గౌరవ శాసనసభ్యులు మరియు టిటిడి బోర్డు మెంబర్ శ్రీ కిలివేటి సంజీవయ్య గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో గడపగడపకు తిరిగారు,
ఈ కార్యక్రమంలో భాగంగా, భరత్ నగర్ కి సంబంధించిన ప్రజలు ఆయనను గౌరవప్రదంగా ఆహ్వానించి సత్కరించారు, ఈ గడప గడప కార్యక్రమంలో ఆయనతోపాటు వైయస్సార్ సిపి పార్టీ నాయకులు, కామిరెడ్డి రాజారెడ్డి గారు లాయర్ కుమార్ గారూ వైయస్సార్ సిపి పార్టీ అభిమానులు కార్యకర్తలు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పూర్వ విద్యార్థులతో కాకాణి సమావేశం
తేది:21-05-2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ లో తాను చదువుకున్న జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు.
నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేక దశాబ్దాలుగా పని చేస్తూ, సమాజంలో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని, మా కళాశాల విద్యార్థి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదగడం, తమ విజయంగా భావిస్తున్నామని, తాము ఎంతో గర్వపడుతున్నామని కళాశాల యాజమాన్యానికి చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి, తాను చదువుకున్న కాలేజీకి మంత్రి హోదాలో ముఖ్యఅతిథిగా రావడం, తమకు అంతులేని ఆనందాన్ని కలిగిస్తుందంటూ, పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రశంసించారు.
కాలేజీ యాజమాన్యం కాకాణికి సాంప్రదాయ రీతిలో ఘనస్వాగతం పలికి, ఘనంగా సన్మానించారు.
కాకాణి తనకు విద్యను అందించిన గురువులందరినీ ఘనంగా సత్కరించి, తన కృతజ్ఞతలు తెలియజేశారు.
కాకాణి తన ప్రసంగంలో తాను ఈ స్థాయికి చేరడానికి ఎంతోమంది ఆశీస్సులతో పాటు, తనకు విద్యను అందించిన విద్యాలయం పాత్ర కూడా ఉందని సవినయంగా తెలియజేశారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి విద్యార్థికి విద్యను అందించడం, తమకందరికీ సార్ధకత చేకూరిందని అధ్యాపకులు ప్రకటించారు.
పూర్వ విద్యార్థుల సమావేశానికి తనను ముఖ్య అతిధిగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించిన కాలేజీ యాజమాన్యానికి, అధ్యాపకులకు, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కు, పూర్వ విద్యార్థులకు, ప్రస్తుత విద్యార్థులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
తనతో చదువుకున్న సహ విద్యార్థులతో కలిసి, సివిల్ ఇంజనీరింగ్ విభాగంతో పాటు, కాలేజీలో కలియతిరిగి, మంత్రి కాకాణి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
పూర్వ విద్యార్థుల అభినందనలు, కేరింతల మధ్య ఆద్యంతం సమావేశం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది.