ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్. కృష్టయ్యను రాజ్యసభ సభ్యుని గా ఖరారు చేసిన సందర్బంగా గురువారం బిసి. సంక్షేమ జాతీయ మహిళ నాయకరాలు. పద్మ జ యాదవ్ ,యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు కుంభం నాగమణి యాదవ్ ,జిల్లా కార్యదర్శి జయంతి మనోహర్, సురేష్ తదితరులు ఆర్. కృష్టయ్య ని కలసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా నాగమణి యాదవ్ మాట్లాడుతూ బీసీ లకు పెద్ద పీట వేయడం లో సీఎం జగన్ ఎంతగానో అలోచించి 72కోట్ల బీసీ మనోభావాలు దృష్టిలో పెట్టుకొని జాతీయ అధ్యక్షుడు గా. ఆర్ కృష్ణయ్య ను రాజ్య సభ గా సిటు ఇచ్చినoదుకు గాను బీసీ లు అందరి తరుపున సీఎం జగన్ కి అభినందనలు తెలిపినట్టు నాగమణి యాదవ్ చెప్పారు.
తడ మండలం మాంబట్టు సెజ్ లోని అపాచి పరిశ్రమలో కార్మికుడు అనుమానాస్పద మృతి.
తిరుపతి జిల్లా.తడ : మండల పరిధిలోని మాంబట్టు సైజులో ఉన్న అపాచీ పరిశ్రమలు ఓ కార్మికుడు బాత్రూం లో ఉరి వేసుకుని చనిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది చనిపోయిన వ్యక్తి బంధువుల సమాచారం మేరకు
దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొమరం నవీన్ (29 సంత్సరాలు) గురువారం యధావిధిగా విధులకు హాజరయ్యారు.అయితే బాత్ రూంలో అతను మృతి చెంది ఉండడాన్ని కార్మికులు గుర్తించారు.సూళ్లూరుపేట ఆసుపత్రికి నవీన్ ను తరలించిన ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు.
అయితే నవీన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అతనిని హత్య చేసి చంపి ఉంటారని తలిదండ్రుల ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం సెక్షన్ హెడ్ కమలాకర్ తోటి కార్మికుల ముందు చొక్కా పట్టుకొని లాగడంతో మనస్థాపం చెంది బాత్ రూం లోకి వెళ్ళి ఉరివేసుకుని చనిపోయినట్లు కార్మికులు తెలిపారు. నీ అతని బంధువులు మాత్రం
సీసీ కెమెరాలు పరిశీలన చేస్తే బాత్ రూమ్ వద్దకు ఎవ్వరెవ్వరు వెళ్లారు అన్నది తెలుస్తుందనీఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్నతడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ మృతిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిట్టమూరు మండల పరిధిలోని తాగేడమ్మ గుడి సమీపంలో ఆర్ వన్ ఫైవ్ మోటార్ సైకిల్ పడి వ్యక్తి మృతి వివరాలు తెలియాల్సి ఉంది
మృతుడు పూడిరాయి దోరువు పంచాయితీ మాజీ సర్పంచ్ ఎల్ల పోతు రాజగోపాల్ రెడ్డి కుమారుడు ఎల్లపోతు నవీన్ (23) గా గుర్తింపు నవీన్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ గా జాబ్ చేస్తున్నాడు గురువారం బెంగళూరు నుండి పూడిరాయి దొరువుకి వెళ్తుండగా మల్లం సమీపంలో ఈ సంఘటన జరిగింది
దొరవారిసత్రం :- తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలపరిధిలోని మావిళ్లపాడు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న దొరవారిసత్రం ఎస్ ఐ అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.