నెల్లూరు, ఏప్రిల్ 17 : రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డికి వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు.
ఆదివారం మధ్యాహ్నం విజయవాడ నుంచి నెల్లూరు బయల్దేరిన మంత్రి కాన్వాయ్ మధ్యాహ్నం నాలుగు గంటలకు కావలికి చేరుకుంది. కావలి పట్టణంలోని పెండెం వారి సెంటర్లో ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నేతలు, అభిమానులు మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో మంత్రిని సత్కరించారు. అనంతరం కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లిన కాకాణి అక్కడి కార్యకర్తలు, నేతలతో ముచ్చటించారు.
అనంతరం నెల్లూరుకు బయల్దేరిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కాన్వాయ్ సాయంత్రం 5:30 గంటలకు కావలి టోల్ప్లాజాకు చేరుకోగా అక్కడ మంత్రి రాక కోసం మధ్యాహ్నం నుంచి వేచి ఉన్న వైకాపా కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కాకాని భారీ కాన్వాయ్ తో నెల్లూరుకు చేరుకోగా ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఆర్యవైశ్య నాయకులు, వైకాపా కార్యకర్తలు కాకాణి కి అపూర్వ స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రి ఘనంగా నివాళులర్పించారు. అక్కడినుంచి విజయ మహల్ గేట్ సమీపంలోని మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసిన మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి నగరంలోని వైసిపి కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. వైసీపీ కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికి తమ నేతకు శుభాకాంక్షలు తెలిపారు.
క్రిమినల్ కేసులలో సాక్ష్యాలు దొంగిలించిన కుట్ర ఎవరిదో బహిర్గతం చేయాలి
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ : నెల్లూరు కోర్టులో క్రిమినల్ కేస్ లో సాక్ష్యాధారాల దొంగతనంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుపై ఎవరి ప్రభావం లేకుండా కేసును నిశితంగా పర్యవేక్షించి విచారణ చేపట్టాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఈమేరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
క్రిమినల్ కేస్ లలో నుండి తప్పించుకోవడానికి సాక్ష్యాధారాలను దొంగిలించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇటువంటి చర్యలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై ఎవరి ప్రభావం లేకుండా కేసును నిశితంగా పర్యవేక్షించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించాలని కోరారు. సమాజంలో శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమైన సాక్ష్యాల చోరీని న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణించాలన్నారు. ఈ కుట్రలో భాగస్వామ్యులు అందరిని అరెస్ట్ చేసి న్యాయం జరిగే విధంగా గౌరవ హైకోర్టు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చెంగాళ్ళమ్మ ఆలయంలో చండీయాగం
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట : తెలుగు తమిళ ఆరాధ్యదైవం కాళంగి నది ఒడ్డున వెలసిన దక్షిణ ముఖ కాళీ భక్తుల కొంగు బంగారం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు నేడు పౌర్ణమి సందర్భంగా ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో చండీయాగం నిర్వహించారు. ఈ చండీ యాగానికి ఉభయకర్తలుగా సన్నా రెడ్డి రాజగోపాల్ రెడ్డి , శ్రీసిటీ MD, శ్రీ సన్నారెడ్డి రవీంద్ర రెడ్డి శ్రీమతి మమత గార్లు దంపతులు వ్యవహరించారు. అనంతరం దేవస్థానం సిబ్బందికి బట్టలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకండలి సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్, కర్లపూడి సురేష్ బాబు, బండి సునీత, మన్నే ముద్దు పద్మజ, నాయుడుకుప్పం నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు
తిరుపతి జిల్లా.దొరవరిసత్రం మండలం అక్కరపాకు గ్రామంలో లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నేడు ఆయన 131వ జన్మదినం రోజున పురస్కరించుకొని బి ఎస్ పి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎర్ర బోతు సుబభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవలు చేశారని అదేవిధంగా కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన హక్కు కల్పించాలని ముఖ్యంగా పేద బలహీనవర్గాల కుటుంబాలకు ఎనలేని సేవలందించారని వారి మూలంగా ఈ దేశంలో పేద ప్రజలు ఆయన చేసిన సేవలను అందించారు. ముఖ్యఅతిథిగా బద్ది చెంగయ్య. తలారి హరీష్ బాబు.SSC .RLY.కార్యకర్తలు మరియు దళిత నాయకులు పాల్గొన్నారు.
పేటలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు
తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అ ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నేడు ఆయన 131వ జన్మదినం రోజున పురస్కరించుకొని ఏ డి పి ఎస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమం అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర బోతు సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సులూరుపేట ఆర్డిఓ రోజ్ మాండ్ మరియు తాసిల్దార్ కె రవి కుమార్ విచ్చేసి కేక్ కట్ చేసి ప్రజలకు పంచి పెట్టారు. అనంతరం ఆర్ డి ఓ రోజ్ మాడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవలు చేశారని అదేవిధంగా కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన హక్కు కల్పించాలని ముఖ్యంగా పేద బలహీనవర్గాల కుటుంబాలకు ఎనలేని సేవలందించారని వారి మూలంగా ఈ దేశంలో పేద ప్రజలు ఆయన చేసిన సేవలకు వాడవాడలా వీధివీధిన ఆయన ఫోటోలకు పూలమాలలు వేసి ఇ నివాళులర్పిస్తారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సులూరుపేట నియోజకవర్గ ఏ డి పి ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు దళిత నాయకులు పాల్గొన్నారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు ఏమైనా పరిహారం ఇచ్చారా
కరువు జిల్లాలలో ప్రత్యాన్మాయ పంటలు ప్రోత్సహించండి
పార్లమెంట్లో గళమెత్తిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎనిమిది లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, సుమారు రూ. 3,000 కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని, కేంద్ర ప్రభుత్వానికి తెలుసా, తెలిసినట్లయితే రాష్ట్రానికి ఏదైనా పరిహారం మరియు ఆర్థిక సహాయం అందించబడిందా అలా అయితే దాని వివరాలు మరియు కాకపోతే, కారణాలు తెలుపగలరని అలాగే దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా సహాయపడే పంటల విధానాలను మార్చడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అని తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర వ్యవసాయ శాఖామాత్యులు సమాధానంగా శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ బదులిస్తూ విపత్తు నిర్వహణలో ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంచబడిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుండి గుర్తించబడిన ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో నష్టాల అంచనాను చేపట్టి ఆర్థిక సహాయాన్ని అందిస్తాయని. తీవ్రమైన ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఏర్పాటు చేసిన విధానం ప్రకారం అదనపు ఆర్థిక సహాయం అంతర్-మంత్రిత్వ కేంద్ర బృందం (ఐఎంసిటి) ద్వారా ప్రభావిత ప్రాంతాల సందర్శనతో సహా, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్/ఎన్డీఆర్ఎఫ్ కింద సహాయం ఉపశమనం రూపంలో అందించబడుతుందని తెలియజేసారు. 2021లో రాష్ట్రంలో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన నష్టాల కోసం ఎన్డీఆర్ఎఫ్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1080.71 కోట్ల (వ్యవసాయ ఇన్‌పుట్ సబ్సిడీకి రూ.555.19 కోట్లతో సహా) అదనపు ఆర్థిక సహాయాన్ని కోరిందని. ఐఎంసిటి నివేదిక ఆధారంగా మరియు సబ్-కమిటీ ఆఫ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క సిఫార్సుల ప్రకారం, రూ.351.43 కోట్ల (వ్యవసాయ ఇన్‌పుట్ సబ్సిడీకి రూ. 201.90 కోట్లతో సహా) ఆర్థిక సహాయాన్ని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించిందని, మారుతున్న వాతావరణంలో దేశీయ ఆహార ఉత్పత్తిని కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కోవడానికి, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఫ్లాగ్‌షిప్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ 'నేషనల్ ఇన్నోవేషన్స్‌ను ప్రారంభించిందని. కరువులు, వరదలు, మొదలైన విపరీత వాతావరణ పరిస్థితులకు గురయ్యే జిల్లాలు మరియు ప్రాంతాలలో వాతావరణాన్ని తట్టుకునే సాంకేతికతలను అభివృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని, సహజ ప్రమాదాలు/విపత్తులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు & వ్యాధులు మొదలైన వాటి కారణంగా పంట దిగుబడి నష్టాలకు ఆర్థిక మద్దతు కోసం పంటల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేసారు, అలాగే ఇంకా, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నీటి ఆధారిత వరి పంటల ప్రాంతాన్ని ప్రత్యామ్నాయ పంటలకు మళ్లించడానికి 2013-14 నుండి అసలైన హరిత విప్లవ రాష్ట్రాలలో అంటే హర్యానా, పంజాబ్ & ఉత్తర ప్రదేశ్ (పశ్చిమ భాగం)లో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాన్ని (CDP) అమలు చేస్తోంది. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ముతక తృణధాన్యాలు, న్యూట్రి తృణధాన్యాలు, పత్తి మొదలైనవి. ఎంపీ గురుమూర్తి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా తెలియజేసారు.