నేడు అనగారిన వర్గాల కు సమానత్వం ఉందంటే దానికి కారణం బాబు జగ్జీవన్ రాం..
నేడు అనగారిన వర్గాల కు సమానత్వం ఉందంటే దానికి కారణం బాబు జగ్జీవన్ రాం
అన్ని సామాజిక వర్గాలకు స్థిరత్వం అన్నిరంగాల్లోనూ అవకాశం ఉండాలి. మహోన్నత వ్యక్తుల స్ఫూర్తి తో అందరం కలిసికట్టుగా పనిచేసి అనగారిన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలి. చరిత్రలో చిరస్మరణీయులు బాబు జగ్జీవన్ రామ్
- అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి
నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమర యోధుడు, మాజీ భారత ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కాకి ప్రసాద్, దారా విజయ్ బాబు, మాతంగి కృష్ణా ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, టీడీపీ ఎస్సీ సెల్ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నగరంలోని వేదాయపాలెం సెంటర్ లో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
115 సంవత్సరాలు గడుస్తున్నా వారిని ఇంకా గుర్తుపెట్టుకుని నివాళి అర్పిస్తున్నారంటే వారు చేసిన త్యాగాలు వారు చేసిన మహోన్నతమైన పనులే వాటికి కారణం అని అన్నారు. అప్పటి పరిస్థితులు వేరని, వెనుకబడిన వర్గాల సమానత్వం ఉండేది కాదని, ఆయన చేసిన ఎన్నో పోరాటాల వల్ల నేటి పరిస్థితుల్లో మార్పు ఉందని తెలిపారు. నేడు దళిత నాయకులు అందరితో కలిసి భుజాలు భుజాలు ఆనించి నిలబడుతున్నారు అంటే దానికి ఆ రోజుల్లో ఆయన వేసిన విత్తనాలే కారణమని అన్నారు. సమానత్వం అనేది డబ్బుతో ఆస్తులతో రాదని సమానత్వం అనేది చదువుతో వస్తుందని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాల వారికి స్థిరత్వం అన్నిట్లో అవకాశం రావాలని రాజకీయంలో గాని చదువు లో గాని అన్ని రంగాల్లోనూ అన్ని సామాజిక వర్గానికి సమానత్వం ఉండాలని పేర్కొన్నారు. దేశం మొత్తం మీద ఉన్న అనగారిన వర్గాల నీటికి కలిపి ఒక పార్టీని స్థాపించారని, ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎనిమిది మంది శాసనసభ్యులను గెలిపించుకున్నారు అని అన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం కేంద్ర శాసన సభ సభ్యుడిగా, ఎక్కువ కాలం కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పని చేసి రికార్డు సృష్టించారని అన్నారు. మహోన్నత వ్యక్తుల స్ఫూర్తి తో అందరం కలిసికట్టుగా పనిచేసి అనగారిన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపి నేతలు, ఎస్సీ సెల్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు