కావలి పట్టణం లోని శ్రీ లక్ష్మీ కాంత స్వామి వారి దివ్య ఆలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ అమ్మవారి ప్లవ నామ సంవత్సర ఫాల్గుణ మాస శుద్ధ త్రయోదశి శ్రీలక్ష్మి జయంతి మహోత్సవ వేడుకలు త్రయాహ్నక దీక్ష తో శ్రీ వైఖానస భగవ శాస్త్రిరీత్యా తల పెట్టిన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆర్ డి ఒ శ్రీ నూ నాయక్, కమీషన్ శివారెడ్డి అధిక సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి శ్రీ లక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. వంశపారంపర్య అర్చకులు ఆగమద్యమణి శ్రీమన్నారాయణ వెంకట శేషాచార్యులు దివ్య ఆశీస్సులతో పూజలు నిర్వహించినట్టు రామాచార్యులు తెలిపారు.
సామూహిక కుంకుమార్చన మరియు శాంతి కళ్యాణం లో పలువురు దంపతులు పాల్గొన్నారు.
మండలం లో విధ్యుత్ శాఖ కు సంబందించిన D లిస్ట్ లో ఉన్న పెండింగ్ బకాయిలను లైన్ ఇన్స్పెక్టర్ నెల్లిపూడి. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వాసులు చేశారు. లైన్ ఇన్స్పెక్టర్ తో పాటు ఎలక్ట్రికల్ సిబ్బంది కలిసి పెండింగ్ బకాయిలను వసూలు చేసి ప్రభుత్వనికి చెల్లించారు. ఇంటింటికి తిరిగి విద్యుత్ బకాయిలను వసూలు చేసిన వారిని పై అధికారులు గుర్తించి మండల సిబ్బంది కి కూడా అవార్డు లను అందజేశారు. ఈకార్యక్రమంలో మండల విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
తమ స్టడీ టూర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 10 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ వారికి సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ పుట్టుక, ప్రస్థానం, ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. శ్రీసిటీ కార్పొరేట్ సామాజిక భాద్యత (సిఎస్ఆర్) కార్యక్రమాల గురించి చెబుతూ, నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు, సామాజిక మౌళిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించడం ద్వారా శ్రీసిటీ పరిసర వెనుకబడిన ప్రాంతం ఎలా అభివృద్ధి సాధించిందో వివరించారు.
ఇక్కడ ప్రపంచశ్రేణి మౌళికవసతులు, వ్యాపారానుకూల వాతావరణం పట్ల ట్రైనీ ఐఏఎస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీ స్పష్టమైన దృష్టి, మంచి ప్రణాళిక, ఖచ్చితమైన అమలు, ఉపాధి కల్పన, స్థిరమైన పట్టణీకరణ సూత్రాలను ప్రశంసించిన అధికారులు, దీనికి కృషిచేసిన శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ పర్యటనపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, ట్రైనీ ఐఏఎస్ ల అధ్యయనానికి శ్రీసిటీని ఎంచుకోవడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. ట్రైనీ ఐఏఎస్ లే కాకుండా దేశ విదేశాలకు చెందిన అధికారులు, వ్యూహకర్తలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు తమ అధ్యయనానికి శ్రీసిటీని "తప్పనిసరి ఆప్షన్" గా ఎంచుకోవడం తమకు గర్వకారణమన్నారు.
ఏపీ దర్శన్ లో భాగంగా శ్రీసిటీకి విచ్చేసిన ఐఏఎస్ శిక్షణ అధికారులు, ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి తమ పలు సందేహాలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూడడంతో పాటు ఆల్స్టామ్, మాండెలెజ్, ఇసుజు, టోరె పరిశ్రమలను సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తడ ,సూళ్లూరుపేట, దొరవారి సత్రం మండల శాఖ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానం రద్దు కొరకు బైక్ ర్యాలీ నిరసన కార్యక్రమం ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు హోలీ క్రాస్ జంక్షన్ నుండి యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీ కావూరు ప్రభాకర్ గారి అధ్యక్షతన సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం నందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది .ఈ కార్యక్రమం యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీ జి జే రాజశేఖర్ గారు యుటిఎఫ్ జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న సి పీ ఎస్ విధానాన్ని ఇంతవరకు రద్దు చేయకపోవడాన్ని, ప్రభుత్వం మొండి వైఖరిని ఖండించారు. యు టి ఎఫ్ సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తూ- కలిసివచ్చే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలని కలిపి జేఏసీ ఏర్పాటు చేసి, సిపిఎస్ నిర్వీర్యం చేసేంతవరకు పోరాడతామని తెలియజేశారు. మార్చి 31వ తేదీ లోపు సిపిఎస్ రద్దు కొరకు ప్రభుత్వం రోడ్డు మ్యాప్ వేస్తుందని తెలిపింది. అయినా ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. జాతీయ విద్యా విధానం పేరుతో 3, 4, 5 తరగతులు హై స్కూల్ లో విలీనం చేయడం వల్ల ప్రాథమిక విద్య కుంటు పడుతుందని, బడుగు బలహీన పేద కుటుంబాలకు ప్రాథమిక విద్య దూరం అయ్యే ప్రమాదం ఉందని తెలియజేసి వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తర్వాత మూడు మండలాల ప్రధాన బాధ్యులు ప్రాంతీయ మహిళా కమిటీ కన్వీనర్ శ్రీమతి కే ఎన్ ఎస్ సునీల గారు సిపిఎస్ విధానం వల్ల జరిగే నష్టాలను వివరించారు . సూళ్లూరుపేట గౌరవ అధ్యక్షులు పి వెంకట స్వామి గారు తడ ప్రధాన కార్యదర్శి ఎస్ బాబు గారు దొరవారి సత్రం అధ్యక్షులు ఎం రమేష్ గారు సిపిఎస్ ఎస్ రద్దు కోరుతూ దాని వల్ల జరిగే నష్టాలు పరిణామాలను వివరించారు. తర్వాత జిల్లా నాయకులు మూడు మండల ప్రధాన బాధ్యులు మహిళా కమిటీ నాయకులు సి పి ఎస్ రద్దు కోరుతూ వినతి పత్రాన్ని ఎమ్మార్వో గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ,పెన్షనర్స్ 70 మంది వరకు పాల్గొని విజయవంతం చేశారు .ఈ కార్యక్రమంలో 3 మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఓంకారం శ్రీనివాసులు, కే సుధాకర్, ఎం శ్రీనివాసులు ,సిహెచ్ జనార్ధన్ బొబ్బిలి చంద్రశేఖర్, ఎస్కే హుస్సేన్ భాష ,డి సుబ్రహ్మణ్యం ,గోవర్ధన్, ఎస్ మస్తాన్ ఏదైనా మాహిళా కమిటీ నాయకులు సిహెచ్ రాజేశ్వరి ,సిహెచ్ జి ఉషారాణి, విజయవాణి భాగ్యమ్మ ,కుమారి కిరణ్, జానకి, కుసుమ కుమారి నిర్మల, జన విజ్ఞాన వేదిక నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య ,రాజేష్ రామ్మూర్తి గారు పాల్గొన్నారు.
శ్రీ కంటిని ఘనంగా సన్మానించిన పొనకా అభిమానులు గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి అధ్యక్షులుగా ఎన్నికై ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖ ఆడిటర్,ఎస్.వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం గూడూరు సమాఖ్య గౌరవ అధ్యక్షులు శ్రీ కంటి రామ్మోహన్ రావు ను ఆయన నివాసంలో పొనకా అభిమానులు కోదండరామయ్య,రమేష్,శ్రీధర్,చిన్నా,ముని,దిలీప్ తదితరులు ఘనంగా సన్మానించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 35 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 62 నుంచి 58 తగ్గించి , నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక టవర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు
మాట తప్పం మడమ తిప్పం అని ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా కూడా హామీలు నెరవేర్చ లేని వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి కేవలం పది వేల 143 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులకు నిరుత్సాహపరచడం అని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిగారు కళ్ళు తెరిచి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా నోటిఫికేషన్ను విడుదల చేసి ఇచ్చిన మాటను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ,లక్షల 84వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిగ్రీ చదివిన వారికి నిరుద్యోగ యువతకు నిరాశే మిగిలిందని, ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 లో 2607 పోస్టులను, పోలీస్ శాఖలో 7740 పోస్టులను, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను, విద్యుత్ శాఖ లో 1200 నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోస్టులను గ్రంథాల యాల్లో 6000 పోస్టులను నింపాలి అన్నారు. చర్యలు తీసుకోవాలని, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగ వయోపరిమితి 62 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు తగ్గించాలని డిమాండ్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 62 సంవత్సరములు పెంచడం వల్ల నిరుద్యోగులు అన్యాయమై పోతారని , నిరుద్యోగలను దృష్టిలో ఉంచుకొని వయోపరిమితిని తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తికేయ, నగర సహాయ కార్యదర్శి వెంకటేష్, శంకర్, చైతన్య, ఏబీవీపీ నాయకులు కిరణ్ ,మహేష్ ,నవీన్, ప్రదీప్ ,కృష్ణ ,కార్తీక్ ,రవి, సంతోష్, సుభాష్ ,గోపాల్ ,క్రాంతి ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి సూళ్ళూరుపేటలో ఏబీవీపీ నిరసన.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-
పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏబీవీపీ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రంలో కాళీగా వున్న లక్షా 35 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
మాట తప్పం మడమ తిప్పం అని ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా కూడా హామీలు నెరవేర్చ లేని వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి కేవలం పది వేల 143 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులకు నిరుత్సాహపరచడమని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 62 సం౹౹ పెంచడం వల్ల నిరుద్యోగులు అన్యాయమై పోతారని, నిరుద్యోగలను దృష్టిలో ఉంచుకొని వయోపరిమితిని తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా నోటిఫికేషన్ను విడుదల చేసి ఇచ్చిన మాటను నెరవేర్చాలని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వెంకటేష్, నగర సంయుక్త కార్యదర్శి బాలాజీ నగర ఉపాధ్యక్షుడు చందు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.