"కాకాణితో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" పేరిట వారం రోజుల పాటు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో విచ్చేసిన రైతులు, ట్రాక్టర్లతో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ట్రాక్టర్లు, రైతులతో హోరెత్తిన మనుబోలు మండల కేంద్రం.
స్థానిక ప్రజలను ఆకట్టుకున్న గిరిజన సాంప్రదాయ నృత్యాలు.
అబ్బురపరిచిన డప్పు కళాకారుల విన్యాసాలు.
డప్పు వాయిద్యాలకు లయబద్దంగా నృత్యం చేసిన యువకులు.
జనాల్ని ఆకర్షించిన కేరళ కాయం - పళం సంప్రదాయ వాయిద్యం.
ట్రాక్టర్లు, రైతులతో కిక్కిరిసిన మనుబోలు ప్రధాన రహదారి.
స్థానిక ప్రజల హర్షాతిరేకాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన ర్యాలీ.
మండుటెండను సైతం లెక్కచేయకుండా, "జై జగన్" నినాదాలతో మారుమోగిన మనుబోలు.
స్వచ్ఛందంగా తరలివచ్చి, భారీ ర్యాలీ నిర్వహించిన రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేసిన కాకాణి.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే భాగంగా కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారు. సర్వేపల్లి నియోజకవర్గం, జిల్లాలోనే అతి ఎక్కువగా వరి ప్రధాన పంటగా, సాగు చేసే నియోజకవర్గం. సోమశిల జలాశయం నుండి సాగునీటిని నెల్లూరు డెల్టాకు అందించడంతోపాటు, కండలేరు జలాశయానికి తగినంత సాగునీరు విడుదల చేస్తేనే, రైతులకు సాగునీరంది, పంటలు పండించుకోగలరు. సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని శ్రీ బాలాజీ జిల్లాలో భాగమైతే, నెల్లూరు జిల్లాలో సాగునీటి విడుదల కోసం ఏర్పాటు చేసే, సాగునీటి సలహా మండలిలో మనం ప్రాతినిధ్యం కోల్పోయే వాళ్లం. నెల్లూరు జిల్లాకే తలమానికమైన సోమశిల జలాశయం నెల్లూరు జిల్లాలోనే ఉన్నందున, నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధుల సూచనల మేరకు సాగునీటిని విడుదల చేసేవారు తప్ప, మన ప్రాంతానికి సాగునీరు అందించాలనే మన వాదనలు అరణ్యరోదనగానే మిగిలిపోయేవి. సోమశిల జలాశయంలో పుష్కలంగా నీరులేని పరిస్థితుల్లో, సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా నుండి విడిపోతే, రైతాంగం పరిస్థితి ఊహించుకునేందుకు భయం వేస్తుంది. వైకాపా ప్రభుత్వంలో రైతాంగానికి ఎక్కడా సమస్య లేకుండా, సాఫీగా, సజావుగా సాగునీరు అందించాం. తెలుగుదేశం హయాంలో సాగునీటి కోసం రైతులు ఆందోళనతో కాలువలపై వెంపర్లాడుతూ, ఆనాటి పాలకుల నిర్ణయాలతో గ్రామాల మధ్య, రైతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎవ్వరూ, సాగునీటి కోసం కాలువల దగ్గర పడిగాపులు కాయకుండా, చివరి ఆయకట్టు వరకు సంపూర్ణంగా సాగునీరు అందించాం. దేశవ్యాప్తంగా ఎరువుల కొరత ఉన్నా, సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా, యూరియా లాంటి ఎరువులు సరఫరా చేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గాన్ని, నెల్లూరు జిల్లాలోనే అంతర్భాగంగా కొనసాగించటంతో అన్ని వర్గాల ప్రజలలో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండడంతో, తట్టుకోలేని తెలుగుదేశం మహా నాయకుడు చేస్తున్న వ్యాఖ్యలు చూసి, ప్రజలు ఆయనను "జోకర్" గా అభివర్ణిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరులోనే కొనసాగుతున్నందున పొదలకూరులో యువత బైక్ ర్యాలీ, ముత్తుకూరులో ప్రజా ర్యాలీ, వెంకటాచలంలో ఉద్యోగుల ర్యాలీ, మనుబోలులో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి, అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతాంగానికి అన్నివిధాలా అండగా నిలిచి, నిత్యం అందుబాటులో ఉండి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని సవినయంగా మనవి చేసుకుంటూ, ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున తరలివచ్చి, జగనన్నకు ధన్యవాదాలు తెలియజేసిన రైతు సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.