భారీ ర్యాలీలో కాకాణి"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడంపై "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" పేరిట వారం రోజుల పాటు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఊరేగింపులో పాల్గొని, ప్రసంగించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించి, పూలు చల్లి ధన్యవాదాలు తెలియజేసిన ప్రజలు.
ముత్తుకూరు మండల కేంద్రంలో పోటెత్తిన జనం.
ప్రజల ఆనందోత్సవాల మధ్య ఆకాశాన్నంటిన సంబరాలు...
జగనన్నకు జై కొడుతూ, కదిలిన ప్రజానీకం.
బ్యాండు మేళాలు, కోలాటాలు, తీన్ మార్, బాణసంచాల మధ్య ఉవ్వెత్తున ఎగిసిన ప్రజల ఆనందం.
స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది ప్రజల హర్షధ్వానాల మధ్య సాగిన ఊరేగింపు.
విచ్చేసిన అశేష జనవాహినిని ఆకట్టుకున్న కాకాణి ప్రసంగం.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమాలకు, ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది.
👉 జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి స్వచ్ఛందంగా, భారీగా ప్రజలు తరలివచ్చి, తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు, నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లిని కొనసాగించమని నా విన్నపాన్ని, మన్నించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు.
👉 తిరుపతి పార్లమెంట్ జిల్లాలోకి వెళ్ళిపోతామని ఆందోళన చెందుతున్న, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడం ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది.
👉 సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడం పట్ల తెలుగుదేశం నేతలను మినహాయిస్తే, అన్ని వర్గాల ప్రజల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది.
👉 తెలుగుదేశం నాయకులు, విజయవాడకు యన్.టి.రామారావు పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేక, తమ పార్టీలోని కొంతమందిని రెచ్చగొట్టి, ఇతరుల పేర్లను ప్రతిపాదిస్తూ, వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
👉 జిల్లాల పునర్విభజన అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా జరగడంతో భరించలేని తెలుగుదేశం పార్టీవారు, విభేదాలు కల్పించి, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో 30 నెలల పదవీకాలంలో గ్రామాలలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతుండటంతో, రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుదాం.
👉 జగనన్నకు ధన్యవాదాలు తెలిపేందుకు, స్వచ్ఛందంగా తరలివచ్చిన అశేష జనవాహినికి చేతులు జోడించి, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.