కావలి నియెజకవర్గంలో అభివృద్ధి శూన్యం .. 400 కోట్ల రూపాయల అవినీతి...
ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వైసీపీ నేతలు ,అధికారులు..
ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పై వామపక్ష నేతలు మండిపాటు....
కావలి నియెజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని జరగకపోయినా 400 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ,వైసీపీ నేతలు అధికారులు కలసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగిందని వామపక్ష నేతలు డేగా సత్యం (సిపిఐ) పసుపులేటి పెంచలయ్య (సిపిఎం)కరవాది భాస్కర్ (సిపిఐ. ఎంల్ ) ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని స్ధానిక జర్నలిస్ట్ క్లబ్ నందు వారు మాట్లాడుతూ కావలి నియెజకవర్గంలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఇప్పుడు ఎక్కడా లేదని మీడియా సమావేశంలో తెలిపిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పడు మీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు నిరూపించలేక పోయారని వారు ప్రశ్నించారు. గతంలో కూడా గెలిచిన ఎమ్మెల్యే, అప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను కాబట్టి నేను నియెజకవర్గం అభివృద్ధి చేయలేకపోయనని చెప్పిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సంరం అవుతున్నా ఏం అభివృద్ధి చేసావో చెప్పాలన్నారు. బాలక్రిష్ణారెడ్డి నగర్ ,ఇందిరమ్మ కాలనీలలో సమస్యలను ఎప్పుడైనా పరిశీలించి ఒక తట్ట మట్టి కాని ఒక లైటు కానీ వేయించారా అని ప్రశ్నించారు. అలానే వైకుంఠపురం ప్లై ఓవర్ అలానే ఉందని తుమ్మలపెంట రోడ్డు పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందన్నారు. ఆఖరుకు ఉదయగిరి ప్లైఓవర్ బ్రిడ్జిపై గుంతలు పూడవక ప్రమాదాలకు గురై వికలాంగులు అవుతున్నారని సోమరవం దివ్యాంగుల సంఘం ఆద్వర్యంలో వారు ఆ గుంటలు పూడ్చితే ఇంక ఇంతకన్నా ఈ ప్రభుత్వానికి పాలకులకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. అలానే పట్టణంలో ఎక్కడ పట్టినా ప్రభుత్వ అనుమతులు లేకుండా మున్సిపల్ అనుమతితో 100 ఎకరాలకు పైగా అక్రమ లేఅవుట్స్ వేసారని వాటికి తోలిన గ్రావెల్ ఎక్కడ నుంచి తోలారో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. ఒక వేళ గ్రావెల్, అనుమతులతో తోలి ఉంటే ప్రభుత్వ ఖజానాకు ఎంత లబ్ధి చేకూర్చారో చెప్పగలరా అని సవాల్ విసిరారు. అలానే అనేక నీటి గుంటలు ,పంట కాలువలు ,స్మశానాలు పూడ్చి లే అవుట్స్ వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. అలానే కావలి చెరువు ,రుద్రకోట ,చెలంచర్ల ,అడవి లక్మీపురం ఇలా అనేక చెరువల నుంచి గ్రావెల్ తోడేసి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన మాట వాస్తవం కాదా అన్నారు. అసలు మైనింగ్ అధికారులు ఈ లేవుట్స్ కు వేసిన గ్రావెల్ ఎక్కడ నుంచి వచ్చిందో ఒక్కసారైనా పరిశీలించారా అని ఎద్దేవా చేశారు. అలనే త్రొవ్విన గ్రావెల్ అంతా జగన్నన్న లే అవుట్స్ కు ఉపయెగించామని చెప్పే ఎమ్మెల్యే అసలు జగనన్న లే అవుట్స్ లోని ఎత్తెన దిబ్బలు అన్నీ కరిగించి ముసునూరు బొంతరాయి గనులను పూడ్చి లే అవుట్స్ వేసింది ఎమ్మెల్యేకు తెలియదా అన్నారు.అదేకాక అక్రమ లేవుట్స్ నందు నిర్మించే భవంతులకు మున్సిపల్ కమిషనర్ భారీ నజరానాలు తీసుకుని పర్మిషన్ ఇస్తుంటే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి తెలియకపోవటం విడ్డూరం అన్నారు. ఇళ్ల ప్లాన్లు మంజూరు చేసే మున్సిపల్ కమిషనర్ అవి అక్రమ లేఅవుట్స్ అని తెలియదా అని ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు కాదా అన్నారు. అక్రమ లే అవుట్స్ కు వాడిన గ్రావెల్, మున్సిపల్ పర్మిషన్లతో దోచుకున్న డబ్బు, అక్రమంగా కలుపుకున్న ప్రభుత్వ స్ధలాలు మెత్తం 400 కోట్లు పైన ఉంటుందన్నారు.అలానే మీ మాట వినకపోతే సంవత్సరానికి ఆరు నెలలకు ,మూడు నెలలకు కూడా అధికారులను మార్చేసిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి అధికారులను మూడు,నాలుగు సంవత్సరాలు అయినా మారవకుండా వారికే అవార్డులు ఇప్పించటం చూస్తుంటే కావలి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అదే కాకుండా మున్సిపల్ కమిషనర్ అలానే కార్మికుల పేరుతో పనిలో లేకపోయినా వారి జీతాలను బొక్కేస్తున్నమాట వాస్తవం కదా అని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలను విమర్శించే ముందు మీ తప్పులను సరిచేసుకోవాలని హితువు పలికారు. వామపక్ష పార్టీలకు కావల్సింది అధికారం కాదని ప్రజల సమస్యలు ,కార్మికుల సమస్యలేనని వారికి ఎప్పుడూ అండగా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చేవూరు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.