నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలలో శ్రీ బాలాజీ జిల్లాకి నాయుడుపేట నీ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఏపీ విభజన విద్యార్థుల సంఘం ఈ ర్యాలీ నిర్వహించారు
కొత్త జిల్లాల తో సంపూర్ణ అభివృద్ధి. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.
నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-
రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం, సంపూర్ణ అభివృద్ధి సాధ్యం అవుతాయని సులూరుపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు. పట్టణంలోని శనివారం ఆర్. అండ్. బి. అతిథి గృహం నుండి వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళలు ఆధ్వర్యంలో ర్యాలీగా పుర వీధుల్లో తిరిగి ప్రజలకు అభినందనలు తెలిపారు. అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల రెట్టింపు కావడంతో ఆయా జిల్లాల్లో విస్తీర్ణం తగ్గడంతోపాటు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటై అధికారుల నియామకం జరిగి అన్నీ జిల్లాలు మంచి అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేస్తాయని, అంతేకాకుండా ప్రజలకు అనువుగా జిల్లా కేంద్రాలు ఏర్పడడంతో ప్రజలు తమ పనులను సులభంగా చేసుకోగలరని, శ్రీ బాలాజీ జిల్లా రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతేకాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి పథకంలో బాలాజీ జిల్లా ముందుంటుందని కొనియాడారు .ఈ ప్రాంతంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండడం సంతోషదాయక మన్నారు. అలాగే పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రం, భీముల వారి పాలెం ఓడరేవు, అంతర్జాతీయ విమానాశ్రయం,శ్రీసిటీ సేజ్, మాంబట్టు సెజ్,మేనకూరు సెజ్ లు ఉన్నాయని వీటితోపాటు దుగ్గరాజపట్నం పోర్టు కూడా ఏర్పాటు కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి,సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, తడ మండల అధ్యక్షుడు కొలివి రఘు, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు,నాటక మండలి చైర్మన్ కళాత్తూరు శేఖర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ ,చిన్న సత్యనారాయణ మరియు సర్పంచ్ లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ .
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన OTS (ఒన్ టైం సెటిల్మెంట్) జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కార్యక్రమంలో భాగంగా కోటపోలూరు 1&2 సచివాలయంలో, ఆబాక సచివాలయంలో, KCN గుంట సచివాలయంలో,మంగళంపాడు సచివాలయంలో, మంగానెల్లూరు సచివాలయంలో మరియు దామానెల్లూరు సచివాలయం పరిధిలోని లబ్ధిదారులకు వన్ టైమ్ సెటిల్మెంట్ పట్టాలను లబ్దిదారులకు నేడు
సత్యం, అహింస మార్గంలో భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీ 74వవర్ధంతి సందర్భంగా నాయుడుపేట NUDA పార్క్ నందు గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన
మాజీ పార్లమెంట్ సభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గం
, మాజీ NUDA డైరెక్టర్ గూడూరు రఘునాథ్ రెడ్డి గారు, నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి గారు
పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు అవధానం సుధీర్ గారు, పార్లమెంట్ కార్యవర్గ సభ్యులు దార్ల రాజేంద్ర గారు, పెళ్లకూరు తెలుగు యువత అధ్యక్షులు నెలవల ప్రసాద్ గారు నాయుడుపేట పట్టణ STసెల్ అధ్యక్షులు ఉదయ్ కుమార్ గారు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు రెహమాన్ గారు సిరాజ్ గారు నారాయణ గారు రవి గారు నాయుడుపేట పట్టణ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సాయి గారు,తమ్మిన చైతన్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....
కాకాణి ఇక నీ ఆటలు సాగవ్...
అధికార అండతో మా పార్టీ నాయకుల పై దాడులకు పాల్పడితే తగిన బుద్దిచెబుతాం
*దొంగలను పట్టుకోవడం మానేసిన పోలీసులు ప్రతిపక్ష పార్టీ నేతల పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
ప్రజలకు మేలు చేయాల్సిన ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు.
అధికారులు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
అధికారులంటే మాకెంతో గౌరం ఉంది...హుందాగా వ్యహరించండి.
చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సర్వేపల్లి నియోజక వర్గంలోని పోలీసులు,అధికారులు, వై.సి.పి నాయకులు పై జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు
నెల్లూరులోని జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర
బొమ్మి సురేంద్ర కామెంట్స్...
వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంఎల్ఏ కాకాణి ప్రోధ్బలంతో సర్వేపల్లి నియోజక వర్గంలో టిడిపి నాయకులు, కార్యకర్తల పై దౌర్జన్యం మితిమీరి పోయింది.
పోలీసులు సైతం న్యాయం,ధర్మం లేకుండా వ్యవహరిస్తున్నారు. అధర్మమైన సరే... వైపిపి నాయకులను రక్షిస్తూ మా నాయకులు,కార్యకర్తల పై దాడులు,దౌర్జన్యాలు కు పాల్పడుతున్నారు.
ఇప్పటి వరకు ఓపికతో భరిం చాం...ఇక భరించే ప్రసక్తే లేదు.ఖచ్చితంగా తిరుగు బాటు చేసి తగిన గుణపాఠం చెబుతాం.
ఎంఎల్ఏ కాకాణి కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉదేశంతో పొదలకూరులో ఎస్ఐ కరిముల్లా మా మండల పార్టీ అధ్యక్షుడు పై దాడికి పాల్పడి ఆయన సతీమణిని సైతం అసభ్యపదజాలంతో దుర్భాషలాడాడు.
ఎంఎల్ఏ కాకాణి చేసిన అసత్య ఆరోపణలను ఖండించిన మా నాయకుడు పై దౌర్జన్యానికి పాల్పడడం సిగ్గుచేటు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వత మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పై అక్రమకేసులు బనాయించారు...
అభివృద్ది...అభివృద్ది అంటూ డప్పు కొట్టుకుంటూ...ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమి లేదు.
కాకాణికి దమ్ముంటే టిడిపి అధికారంలో ఉన్నసమయంలో మా నాయకులు సోమిరెడ్డి సహకారంతో సర్వేపల్లి నియోజక వర్గంలో జరిగిన అభివృద్ది...వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వత చేసిన అభివృద్ది లెక్కలు బయటపెట్టాలి.
ఎరువులు కొరత ఉన్నా సర్వేపల్లి నిమోజక వర్గంలో లేదంటూ ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే కాకాణి...ఆ విషయంలో తమ ప్రభుత్వంతో పాటు జిల్లాలోని మిగిలిన మంత్రులు,ఎమ్మెల్యేలను అసమర్దులుగా చూపుతున్నాడు.
ఎమ్మెల్యే కాకాణి ఆదేశాలతో గత తాసిల్దార్ స్వాతి చేసిన అవినీతి అక్రమాలను వెలికి తీశాడన్న నెపంతోనే పొదలకూరు టిడిపి నాయకుడు మస్తాన్‌బాబు పై పోలీసులతో దాడి చేయించాడు.
అప్పటి నుంచి మస్తాన్‌బాబు పై కక్ష కట్టిన ఎమ్మెల్యే కాకాణి పోలీసులను అడ్డుపెట్టుకుని మా నాయకుడు పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు.
సర్వేపల్లి నియోజక వర్గంలో మా నాయకుడు నాగేంద్ర ప్రసాద్‌కు సంబందించిన ఆస్తులను ధ్వంసం చేశారు.శ్రీనివాస యాదవ్ కు సంబందించిన పొలాల్లో కాలువలు తవ్వించి నష్టపరిచాడు.కోడూరులో గంగాధర్ అనే వ్యక్తి సంబందించిన రొయ్యల గుంతలను విధ్వంసం చేసి కోట్ల రూపాయలు నష్టం కలిగించాడు.
ప్రజలకు మేలు చేయాల్సిన ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు.
సర్వేపల్లి నియోజక వర్గంలో ఇప్పటి వరకు పని చేసిన ఎమ్మెల్యేలు ఎంతో హుందాతనంగా పనిచేస్తే కాకాణి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.
పోలీసులతో పాటు ఎంఆర్ఓ...ఎంపిడిఓల నుంచి కింద స్దాయి అధికారుల వరకు ఎమ్మెల్యే కాకాణి ఆదేశాలతో చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే తగిన గుణపాఠం చెబుతాం.
అదికారులంటే మాకెంతో గౌరం ఉంది...ఎమ్మెల్యే చెప్పినట్లు ఆడటం కాకుండా ప్రజల కోసం పని చేయాలని కోరుతున్నాం.
దొంగలను...దోపిడిగాళ్ళను పట్టుకోవడం మానేసిన పోలీసులు ప్రతిపక్ష పార్టీ నేతల పై దౌర్జన్యాలకు పాల్పడడం సిగ్గు చేటు
అధికారంలో ఎవ్వరూ శాశ్వతం కాదు...అది గుర్తుంచుకుని అధికారులు వ్యవహరించాలి...
చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఇప్పటి కైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వేపల్లి నియోజక వర్గంలో జరుగుతున్న అవినీతి,అక్రమాలు,దౌర్జన్యాలు,దాడులకు అడ్డుకట్ట వేయాలి.
సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు...చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులు, వై. సి.పి నాయకులు పై ఫిర్యాదు చేసిన నియోజక…
పీఆర్సీ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. అపోహలు ఉంటే కమిటీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. సోమవారం పీఆర్సీపై మంత్రుల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.
‘ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తాం. కమిటీని గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. ఉద్యోగులను చర్చలకు పిలించాం. చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రతి లోక్‌సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అయితే ఈ హామీని నెరవేర్చే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఎన్నికల హామీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. మరో రెండురోజుల్లో నోటీఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అరకును రెండు జిల్లాలుగా..
రాష్ట్రంలో మొత్తంగా 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 26 కొత్త జిల్లాలు ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ భౌగోళిక రిత్యా చాలా విస్తారమైనది. అందుకే ఈ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మార్పులు- చేర్పులు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
స్థానిక వైసీపీ నేతల అభిప్రాయాలు.. అధికారుల నివేదికలు అన్నింటినీ లెక్కలు వేసుకుని ఫైనల్‌గా 26 జిల్లాలు ఉండేలా కసరత్తు చేసినట్టు సమాచారం. గతంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై స్టేట్ లెవల్ కమిటీ, సబ్ కమటీలు, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలు కొత్త జిల్లాలపై సమావేశాలను నిర్వహించాయి. ఆ నివేదికల ఆధారంగానే జగన్ సర్కార్ 26 కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.