అపాచీ పరిశ్రమలో ఉద్యోగులకు కరోనా అపాచీ ఫుట్ వేర్ కంపెనీ లో కరోనా కలకలం...
భయాందోనలో అపాచి కార్మికులు సుమారు 15 వేల మంది కార్మికులు అపాచి కర్మాగారం లో పనిచేస్తున్నారు సుమారు 100 మందికి కరోన సోకినట్లు సమాచారం. అపాచీ పరిశ్రమలో పనిచేస్తున్న చైనా వారికి కూడా కరోన సోకినట్టు గుసగుసలు. కావున అధికారులు వెంటనే స్పందించాలని,కరోనా నియంత్రణ కు పాటుబడాలని కార్మికులు కోరుతున్నారు. ఇంకా ఎంతమందికి కరోనా సోకింది అనే సమాచారం తెలియడం లేదు.
అక్రమ సంబంధం ఎంతటి కేనా దారి తీస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ ఈ సంఘటన.
అక్రమ సంబంధాన్ని నిలదీసినందుకు ముగ్గురు వ్యక్తుల పై కత్తితో దాడి చేసి ఒకరి మృతికి కారణమైన వింజమూరు కు చెందిన అబ్దుల్ భాష అక్క కాపురం చక్కదిద్దేందుకు తోడు నిలిచిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్న నరేష్ ఇటీవల ఆత్మకూరు మండలం కరటం పాడు సచివాలయం వద్ద తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న సచివాలయంలో పనిచేస్తున్న మహిళను నిలదీసేందుకు వచ్చిన భార్య నవ్య భారతి పై మరియు ఆమె వెంట వచ్చిన బావమరిది నరేష్ పై కక్ష పెట్టుకొని ఈ దాడికి ఒడిగట్టిన నవ్య భారతి భర్త అబ్దుల్ భాష. అక్క కాపురం చక్కబెట్టేందుకు తోడబుట్టిన సోదరి వెంట తోడు నిలిచినందుకు ప్రాణం పోగొట్టుకున్న నరేష్.. నరేష్ కు ఇటీవలే వివాహమైంది. అబ్దుల్ భాష అక్రమ సంబంధం పై గతంలో మర్రిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా పోలీస్ స్టేషన్ వద్ద ఇలాగే చేతికి గాయం చేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న అబ్దుల్ భాష. ఇతని శాడిజం చర్యల కారణంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా భయపడుతూ ఉన్న బంధువులు మరియు పోలీసులు. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఈ హత్యాయత్నానికి ఒడిగట్టిన అబ్దుల్ భాష
జలదంకి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడకలు...
ముస్తాబైన చెన్నకేశవ స్వామి ఆలయం...
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జలదంకి గ్రామంలో వేంచేసి ఉన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో, వైసిపి నాయకులు చేవూరు జనార్ధన్ రెడ్డి సూచనలతో వైఎస్సార్ సీపీ మహిళ నేత, మాజీ సర్పంచ్ తిప్పారెడ్డి ఇందిరాయదుందన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేకువజామున 4.గంటల నుండి దేవస్థాన ప్రధాన అర్చకులు బ్రహ్మణక్రాక తిరువెంగళా చార్యులు... వేద మంత్రాలతో పూజా కార్యక్రామాలు నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ని ప్రధాన వీధులలో ఘనంగా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు..
కోటపోలూరు లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ చోరీ
సూళ్ళూరుపేటలో వరుస చోరీరు భయాందోళనలో ప్రజలు.
నెల్లూరుజిల్లా. సూళ్ళూరుపేట : మండలపరిధిలో ని కోటపోలూరు పడమర హరిజనవాడ లో శ్రీ వేంకటేశ్వర ఆలయము నందు గుర్తు తెలియని వ్యక్తులు హుండీ ని అపహరించి అందులోని నగదును ఎత్తుకుని హుండీని ఊరి బయట ఉన్న పొలాలలో వదిలేసారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు.
నెల్లూరుజిల్లా. దొరవారిసత్రం: దొరవారిసత్రం మండలంలోని మేలనత్తూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంటు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. క్రికెట్ పోటీలలో గెలుపొందినవారికి మొదటి బహుమతి రూ. 5116 , రెండో బహుమతి రూ.2500 జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బురకాల లీలా మోహన్ అందజేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రైస్ కుక్కర్ ,రెండో బహుమతి నాన్ స్టిక్ పెనుము ,మూడో బహుమతి శారీని సూళ్లూరుపేట నియోజకవర్గం మహిళా నాయకురాలు బురకాల గీతాంజలి,సర్పంచ్ మణేయ్యలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్రీడలు శారీరక ,మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు.అలాగే ముగ్గుల పోటీలు మన సంస్కృతి,సాంప్రదాయాలను తెలియజేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
సూళ్ళూరుపేటలో ఘనంగా గోదాదేవి తిరు కళ్యాణ మహోత్సవ వేడుకలు
ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.మమత ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దీవి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో శ్రీ గోదాదేవి కళ్యాణం. ఉభయ కర్తలుగా వ్యవహరించిన శ్రీ యర్రగుంట్ల సుధాకర్ రెడ్డి, శ్రీమతి అనూష, నెల్లూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో వెలసివున్న శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ గోదాదేవి కల్యాణం మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రోచ్ఛారణలతో వేదపండితుల మధ్య ఉభయ దాతలు చేతుల మీదుగా సాంప్రదాయ పూజలు నిర్వహించి గోదాదేవి, రంగనాయకుని ఎదురుగా నిలబెట్టి పూలమాల వేసి అనంతరం ఒకటి చేశారు. జీలకర్ర బెల్లం పెట్టి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో బాలాంజనేయ స్వామి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.