టిడిపి కార్యాలయంలో బీద రవిచంద్ర జన్మదిన వేడుకలు...
నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి బీదా రవిచంద్ర చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలన్నారు. మరిన్ని గొప్ప పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ప్రజలకు ఆదాయ శాతం పెరగలేదు...బతుకుచిత్రం మారలేదు...
నిత్యావసరాల పై మాత్రం 80 శాతం పెంచేశారు...
సామాన్యుడికి గుదిబండలా నిత్యావసర సరుకుల ధరలు...
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి...
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రానికి దరిద్రం పట్టింది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి అబ్ధుల్ అజీజ్,నెల్లూరు నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ నెల్లూరు విఆర్సి సెంటర్ లో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదల ద్రోహి వైయస్ జగన్ అంటూ పెద్ద ఎత్తున నెల్లూరు నగరంలో ప్రదర్శన నిర్వహించారు.
ఎన్నికలకు ముందు అనేక మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కారని టిడిపి నెల్లూరు పార్లమెంటు సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడిందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువులను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందన్నారు.పాలన చేతకాకపోతే వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన నిత్యావసర సరుకుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తేవాలనీ అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. దేశంలో రైతు ఆత్మహత్య స్థానంలో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందనీ ఇది వైసీపీ పాలనలో సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవనీ, వినియోగదారులకు మాత్రం అందని రీతిలో నిత్యావసర సరుకుల ధరలు ఉన్నాయని నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి టిడిపి హయాంలో 50 60 రూపాయల లోపు ఉన్న నిత్యవసర సరుకులు నేడు వైసిపి అరాచక పాలన లో 150 నుండి 200 వరకు చేరుకున్నాయని అజీజ్ ధ్వజమెత్తారు. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు చేరిపోయాయి కొనుక్కోలేని స్థితికి చేరుకున్నాయని అని మండిపడ్డారు. వైసీపీ పాలన బెదిరింపులు అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటిన సామాన్యుడి బతుకు చిత్రంలో మాత్రం మార్పు రావడం లేదు నాడు చంద్రబాబు నాయుడు హయాంలో సామాన్యుడి ఆదాయం ఎంత ఉందో అంతే ఉందని అజిత్ తెలిపారు. సామాన్యుడి ఆదాయం పెరగకపోగా ధరలు మాత్రం వారికి గుదిబండలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు వేల కోట్లు కూడబెట్టిన మంత్రి అనిల్ పండుగ సమయంలో ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదనీ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చే ప్రజలు మిగతా సమయంలో ఎందుకు గుర్తుకురారు అని మండిపడ్డారు. ఇసుక నుండి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేద వారి పై పెను భారాన్ని మోపుతున్నారు అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రన్న కానుక తో పేదవారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసేవారనీ అన్నారు. దానిని వైసీపీ ప్రభుత్వం కొనసాగించకుండా పేదవాడికి పండుగ లేకుండా చేసిందని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి సంక్రాంతి కానుకలు అందించక ప్రజలను పండుగ జరుపుకొని కుండా వైసీపీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంత్రి అనిల్ వారి బాబాయ్ కుమార్ యాదవ్ వేల కోట్ల అవినీతి సొమ్మును కూడబెట్టారు 9 10 కోట్లతో ఇల్లు నిర్మించుకుని వాళ్ళు సంతోషంగా ఉన్నారని కానీ ప్రజలను మాత్రం గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. కానీ పండుగ సమయంలో పిండివంటలు చేసుకునేందుకు పేదవారు నూనె కొనుక్కోలేని పరిస్థితి కి ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆగ్రహించారు. ఎన్నికల ముందు ఒక అవకాశం ఇస్తే తానేంటో చూపిస్తానని జగన్మోహన్రెడ్డి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడని ఆరోపించారు. ఇకనైనా జగన్మోహన్రెడ్డి మొండితనాన్ని ఆపి ప్రజాగ్రహానికి గురికాక ముందే పదవి నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మరియు నగర నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, వార్డ్ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రాణాలమీదకు తెచ్చిన సంజీవిని.
స్కూటర్ పై వెళుతున్న ఇద్దరిని డీ కొట్టి ఆపై కల్వర్టు రైలింగ్ వాల్ ని డీకొట్టి నిలిచిన 104 వాహనం. కావలి నుంచి ఉదయగిరి మార్గంలో 14 కి.మీ వద్ద ఘటన. స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు. గాయపడ్డ వారిలో జలదంకి మండలం అన్నవరం గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మీనరసారెడ్డి. మరొకరు కొండారెడ్డి. *మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు. విచారిస్తున్న జలదంకి పోలీసులు.
సీఎం వర్చువల్ మీటింగ్ లో నెల్లూరు ఎంపీ ఆదాల
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సీఎం వర్చువల్ మీటింగులో పాల్గొన్నారు. మధ్యతరగతి వర్గాల వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఎమ్.ఐ.జి లేఔట్ల వివరాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ మీటింగ్‌లో కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్‌రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులను సీఎం పలకరించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక బ్రోచర్‌ను కూడా విడుదల చేశారు. నెల్లూరు వర్చువల్ మీటింగ్‌లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు మేయర్ శైలజ, జాయింట్ కలెక్టర్, హరేందిర ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, నుడ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎమ్.ఐ.జి లేఔట్ బ్రోచర్‌ను విడుదల చేశారు.