98.880/రూ.విలువ గల 3 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
98.880/రూ.విలువ గల 3 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న దొరవారిసత్రం ఎసై.తిరుమల రావు.
నెల్లూరుజిల్లా. దొరవారిసత్రం మండల పరిధిలోని అక్రపాక సమీపంలో జాతీయరహదారిపై ఉన్నత అధికారుల అదేశాలమేరకు తనిఖీ లలో భాగంగా నెల్లూరు నుండి చెన్నై వైపు వెళుతున్న ఓ వాహనంలో ఎర్రచందనం తరలిస్తుండగా దొరవారిసత్రం ఎసై తిరుమలరావు తన సిబ్బందితో స్మగ్లర్లను,వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో నాయుడుపేట సీఐ సోమయ్య మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లర్ల పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేసి PD-act కింద చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పి .శ్రీ CH విజయ రావు ఐ.పి.యస్. ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని. ఈ మేరకు గూడూరు DSP పర్యవేక్షణలో నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ YV. సోమయ్య. ఆధ్వర్యంలో DV సత్రం. si తిరుమల రావు .వారి సిబ్బంది .ASI శ్రీనివాస్ రెడ్డి. HC. B. వెంకటేశ్వర్లు. S. సత్య నారాయణ లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను పట్టుకొని వారి వద్ద నుంచి 63.400 kg ల 3 ఎర్రచందనం దుంగలను చేసుకున్నట్లు వాటి విలువ సుమారు రూ.98.880/-(తోబై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనబై రూపాయలు) ఉంటుందని తెలిపారు. వీటితోపాటు TATA Ace నెం AP26TC7487 వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గరిపై కేసునమోదు చేసి కోర్టులో హాజరపరిచి రిమాండ్ కు పంపనున్నట్లు తెలిపారు.