జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల వేగం మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
పత్రికా ప్రకటన, తేదీ 31.12.21
...........................
నెల్లూరు, డిసెంబర్ 31 : జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల వేగం మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో పెండింగ్లో ఉన్న ముఖ్యంగా విద్యుత్, నీటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని, లబ్ధిదారులు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీలు సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని, ఇంకా చాలా లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టలేదని, అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించి వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణ పనులను మొదలు పెట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. డి ఆర్ డి ఎ, మెప్మా ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు ఇళ్ల నిర్మాణాలకు అదనపు రుణాలు మంజూరు చేయించాలని ఆదేశించారు. గత సంవత్సరం ఇళ్ల నిర్మాణ పనుల్లో చాలావరకు జాప్యం జరిగిందని, ఈ నూతన సంవత్సరంలో అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేంధిర ప్రసాద్, శ్రీ విదేహ్ ఖరె, శ్రీ గణేష్ కుమార్, శ్రీమతి రోజ్ మాండ్, హౌసింగ్, డి ఆర్ డి ఎ, డ్వామా పీడీ లు శ్రీ వేణుగోపాల్, శ్రీ సాంబశివా రెడ్డి, శ్రీ తిరుపతయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, జడ్పీ సీఈవో శ్రీ ఎం శ్రీనివాసరావు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు, కావలి ఆర్టీవో లు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీ మురళీకృష్ణ, శ్రీమతి సరోజినీ, చైత్ర వర్షిని, శ్రీ శీనా నాయక్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.