వైకాపా నాయకులు చేసేది ధర్మ యుద్ధం కాదు....అధర్మ యుద్ధం...
వైకాపా నాయకులు చేసేది ధర్మ యుద్ధం కాదు....అధర్మ యుద్ధం...
మునిసిపల్ ఎన్నికలు రేపు ఉదయం వచ్చినా....వాటికి సిద్ధంగా ఉండాలి. నెల్లూరు లో జరిగిన నష్టం తిరిగి జరగడానికి వీలు లేదు. ప్రలోభాలకు బెదిరింపులకు లొంగని వారిని అభ్యర్ధులు గా నిలబెట్టుకుందాం. వాలంటరీ వ్యవస్థ కు ధీటుగా, బూత్ లెవల్ కమిటీ లను సిద్ధం చేసుకోవాలి. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి.
గురువారం కావలి లోని రామ్మూర్తి పేట సాయి బాబా గుడి వద్ద గల కావలి నియోజకవర్గ తెదేపా కార్యాలయం లో రాబోవు కావలి మరియు అల్లూరు మునిసిపల్ ఎన్నికల గురించి కావలి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ సభా అధ్యక్షత వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కావలి లో నాయకులు చెల్లాచెదురు అయినా... టీడీపీ కార్యకర్తలు బలమైన పునాదుల్లా నిలబడ్డారు.nబూత్ లెవెల్ స్థాయి నుంచి తెదేపా కమిటీ లు వేసుకుని, పార్టీ నీ బలోపేతం చేయాలి. మన సొంత బిడ్డల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటామో.... పార్టీ కమిటీల గురించి కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి వరకు పోరాటాలు చేశాం..ఇక మీదట ఎన్నికల వ్యూహం తో ముందుకు సాగాలి. కోర్టు లో కేసు నడుస్తుంది, అప్పుడే ఎన్నికలు రావు అనుకోకండి...ఎన్నికలు ఎపుడు వచ్చినా మనం అందరం సంసిద్ధంగా ఉండాలి. ప్రలోభాలకు బెదిరింపులకు లొంగని వారిని అభ్యర్ధులు గా నిలబెట్టుకుందాం. మునిసిపల్ ఎన్నికలు రేపు ఉదయం వచ్చినా....వాటికి సిద్ధంగా ఉండాలి. వైకాపా నాయకులు చేసేది ధర్మ యుద్ధం కాదు... అధర్మ యుద్ధం... రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై సానుభూతి పరుల పై దాడులు జరుగుతున్నాయి. వ్యాపారస్తులను వ్యాపారపరంగా, రైతులను భూములు పరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎన్నికలు జరిగేది మన ఊరిలో కాదు కదా... అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్తలు ఎన్నికల్లో భాగస్వాములు కావాలి. నెల్లూరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కావలి ఎన్నికలను ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. వైకాపా లో ఉండేది క్రూర మృగాలు....వారిని వెంటాడి, చేదించే శక్తి టీడీపీ కార్యకర్తలకు ఉంది.