మీరు పెద్దగా ఏమీ చదవ లేదా....
ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారా.....
పర్వాలేదు....
రాష్ట్ర ప్రభుత్వం మీకు ఉపాధి కల్పించే అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉంది...
అవును....మీరు చదివింది నిజమే...
రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా మీకు తగిన తర్ఫీదును ఇచ్చి ఉపాధి అవకాశం కల్పించే బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సూచల మేరకు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్....
ఈ నెల 30 వ తేది అనగా *30 డిసెంబర్ 2021 ఉదయం 9 గంటలు నుంచి కావలి కి సమీపంలో జాతీయ రహదారిపై కడనూతన వద్ద ఉన్న ఆర్.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ‘మెగా జాబ్ మేళా’ జరుగుతుంది.
మీరు.... 10 వ తరగతి ఫెయిల్ అయినా, పాస్ అయినా పర్వా లేదు
అలాగే...ఇంటర్‌మీడియట్ ఫెయిల్ అయినా, పాస్ అయినా పర్వా లేదు
ఇంకా డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ,...ఇలా ఏ చదువు చదివి ఉన్నా, అందులో ఫెయిల్ అయి ఉన్నప్పటికీ చింతించవద్దు. దేశ, అంతర్జాతయ ప్రాముఖ్యత కలిగిన 19 సంస్థలలో 1,200 పైగా ఉద్యోగ అవకాశాలతో ఈ ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నారు.
నేరుగా ఆర్.ఎస్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలక చేరుకుని స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వివరాలకు –70931 51046, 87908 13132 మోబైల్ నెంబర్లలో సంప్రదించవచ్చు.
కావలి నియోజకవర్గంలోని పంచాయతీ సర్పంచ్‌లు, ఎంసీటీసీలు, జడ్పీటీసీలు, ప్రాధమిక వ్యవసాయ పరసతి సహకార సంఘాల అధ్యక్షులు, గ్రామ స్థాయి నాయకులు చొరవ తీసుకొని, మీ గ్రామాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులకు తెలియజేసి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
సినిమా థియేటర్లలో తనిఖీలు.. 30 హాళ్లు సీజ్
రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగాయి. నిబంధనలు అమలు చేయడం లేదన్న కారణాలతో శుక్రవారం రోజునా పలుచోట్ల థియేటర్లు సీజ్ చేశారు. లోపాలపై థియోటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్నిచోట్ల బోర్డులు పెడుతున్నారు.
సినిమా ధియోటర్ల తనిఖీలు పరంపర కొనసాగుతుంది.
విజయవాడ నగరంలోని అన్నపూర్ణ, శకుంతల, అప్సర థియేటర్లను జాయింట్ కలెక్టర్ మాధవీలత.. ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ వద్ద ధరల పట్టికను పరిశీలించారు. నిబంధనలు పాటించడంలేదని.. కృష్ణా జిల్లాలో 12 థియేటర్లను అధికారులు మూయించారు. టిక్కెట్ల ధరలు తగ్గించడంతో జిల్లాలో 18 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. మొత్తం మీద జిల్లాలో 30 థియేటర్లు మూతపడ్డాయి. గుంటూరు జిల్లాలో 70 థియేటర్లను అధికారులు తనిఖీ చేశారు. 35 సినిమా హాళ్లకు నోటీసులు జారీ చేశారు. 15 సినిమాహాళ్ల మూసివేతకు ఆదేశాలు జారీచేశారు. గుంటూరులోని శ్రీలక్ష్మి ధియేటర్‌ను సీజ్ చేశారు.
అనుమతి లేకుండా శ్యాం సింగరాయ్ సినిమా బెనిఫిట్ షో వేసిన 4 థియేటర్లకు పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. బిఫామ్ రెన్యువల్ చేయని 25 ధియేటర్లకు జరిమానా విధించారు. చిలకలూరిపేటలో లైసెన్స్ రెన్యువల్ చేసుకొని కారణంగా రామకృష్ణ, శ్రీనివాస, విజయలక్ష్మి, వెంకటేశ్వర, కృష్ణ మహల్ థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని మరో 5 ఏసీ థియేటర్లకు.. ఒక్కొక్క దానికి 10 వేల చొప్పున జరిమానా విధించారు.
విశాఖలో థియేటర్లను జిల్లా కలెక్టర్ తనిఖీచేశారు.
జగదాంబ థియేటర్‌లో.. త్రీడీ అద్దాల కోసం అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వివరణ కోరుతూ నోటీసు జారీచేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తణుకులోని థియెటర్లలో రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు సోదాలు చేశారు.
తణుకులో 3 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు.
ఒంగోలు సత్యం ధియోటర్‌ను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తనిఖీ చేశారు.
నిబంధనలు పాటించడం లేదంటూ..ఫారం బి నోటిసుఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 29 థియేటర్లకు నోటీసులు ఇచ్చామని..వారం రోజుల్లో రెన్యూవల్ చేసుకోకుంటే సీజ్ చేస్తామని కలెక్టర్ తెలిపారు.
కర్నూలులోని ఆనంద్ సినీ కాంప్లెక్స్ థియేటర్స్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గుంటూరు...నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన అర్బన్ పోలీసులు.
నకిలీ నోట్లను కేసులో 7 గురు నిందుతులను అరెస్ట్ చేశాం...ఎస్పీ అరి ఫ్ హాఫిజ్
నిందితుల వద్ద నుంచి 45,05,500 నకిలీ కరెన్సీ నీ పట్టు కున్నాం.. ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ నిందితుల మద్య అసలు నోటు కి నాలుగు రెట్లు అధికంగా నకిలీ కరెన్సీ ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది... ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ నిందితుడు జంగం శ్రీనివాస్ రావు నకిలీ నోట్లను తయారు చేయడం లో దిట్ట గతంలో ఇతని పై కేసులు ఉన్నాయి. ఎస్పీ అరి ఫ్ హాఫిజ్ నిందితుల వద్ద నుంచి నకిలీ కరెన్సీ తోబాటు.వాటి తయారీ కి స్కానర్.ప్రింటర్, జిరాక్స్ మిషన్ రెండు కార్లు స్వాధీనం చేసుకున్నాము.. ఎస్పి అరిఫ్ హాఫిజ్. నిందుతులు 6గురు గుంటూరు జిల్లా వాసులు కాగా ఒకరు ప్రకాశం జిల్లా వాసి .. ఎస్పీ అరి ఫ్ హాఫిజ్
నెల్లూరుజిల్లా.సూళ్లూరుపేట:-
పట్టణంలో ని PSR స్ట్రీట్ లో సునీల్ చిన్న పిల్లల హాస్పెటల్ ప్రక్కన ఫ్లెమింగో యాడ్స్ ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్ ను నూతనంగా ప్రారంభించారు, MLC వాకాటి నారాయణ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీ తో ఫ్లెమింగో యాడ్స్ ద్వారా నాణ్యమైన యాడ్స్, ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి ఫ్లెక్సీ మిషన్ ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద నగరాలకు దీటుగా గ్రామీణ,పట్టణ ప్రజలకు అందుబాటులో ఇక్కడ ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేయడం జరుగుతుందని నిర్వాహకులు కొమ్మల చంద్ర తెలియజేసారు.
కరోనా తో మృతి చెందిప పాత్రికేయుల కుటుంబాలకు సాయం అందంచాలి.
జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి హామీ కి జాప్ హర్షం
అదే బాటలో మిగిలిన సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలులో జా ప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి స్పష్టం
ఒంగోలు : కరోనా తో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా సాయం అందించాలని జాప్ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా తో మృతి చెందిన పాత్రికేయులకేగాక అనారోగ్యంతో మృతి చెందిన వారికి జనవరి 15 వ తేదీని చెక్ లు పంపిణీ చేయనుంది.ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాత్రికేయుల ను ఆదుకోవాలని జాప్ కోరుతోంది.రాష్ట్రంలో
పాత్రికేయుల కు స్ధలం కేటాయించడమే కాదు ఇళ్లు కట్టి ఇస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం పట్ల జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్ ) హర్షం వ్వక్తం చేసింది. ఇదే మాదిరిగా
ప్రభుత్వం జర్నలిస్టు వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి విలేకరులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి హితవు పలికారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అన్ని జర్నలిస్టు సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాలలో పర్యటిస్తున్న జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డిని శనివారం సాయంత్రం ఓంగోలులో లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకారెడ్డి ఆధ్వర్యంలో కలిసి ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ లో ఎండీవీ ఆర్ ఎస్ పున్నం రాజు, ఎం యుగంధర్ రెడ్డి లసారథ్యంలో మాత్రమే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్( జాప్ )యూనియన్ ఒక్కటే ఉందని స్పష్టం చేశారు. మిగతా వ్యక్తులు జా ప్ పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్రంలోని జర్నలిస్టు సోదరులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జాప్ పేరుతో తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు తమసభ్యులు కాదని జర్నలిస్టులు గమనించాలని విజ్ఞప్తి చేశారు .జా ప్ ప్రతిష్టలకు ,నాయకుల గౌరవానికి భంగం కలిగేలా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం అక్రిడేషన్ కమిటీ లకు ఇచ్చిన జీవో లో సైతం పున్నం రాజు, యుగంధర్ రెడ్డిల జా ప్ యూనియన్ కె గుర్తింపు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో దరఖాస్తు చేసిన విలేకర్ల అందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు ల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీ జర్నలిస్టులoదరినీ ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి, కరోనా ఆర్థిక సహాయం కింద ప్రత్యేకంగా ఆదుకోవాలని జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు .త్వరలోనే అన్ని జర్నలిస్టు సంఘాల తో కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దగ్గుమాటి వెంకారెడ్డి ,గోపాల్,సుందరంవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో PMESY నిధులతో ఏర్పాటు చేస్తున్న ఆమంచర్ల నుండి ములుముడి లింక్ రోడ్డు పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాణ్యత ప్రమాణాలతో నిర్దిష్ట కాలంలో రోడ్డు పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారుల కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి