నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గ సభ్యుల ఎన్నిక H. లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సూళ్లూరుపేట మండల అధ్యక్షులుగా వరప్రసాద్.
కార్యదర్శిగా వంశీ .
ఉపాధ్యక్షులుగా సాయి, ముత్తు సాయి
కార్యవర్గ సభ్యులుగా కృష్ణ,ఈశ్వర్,కులవంత్,దానంజయ, అనిల్,రూపేష్,మంహోర్,దుర్గాప్రసాద్, మస్తాన్ బాబు,నందమురారి, విక్రమ్ ఎన్నుకున్నారు.
అనంతరం PDSU జిల్లా ఉపాధ్యక్షులు H. లోకేష్ మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో కి రాకముందు విద్యార్థులకు అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అధికారం వచ్చాక కుల,మత రాజకీయాలు సృష్టిస్తూ ప్రజల మధ్య చిచూపెట్టడమే కాకుండా ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారు.మేము PDSU గా ఒకటే గుర్తుచేస్తూవున్నాము మీరు ఈ పదవులు శాస్వితం అనే బ్రహ్మ నుండి బయటికి రావాలి .ఇంకనైనా మీ కుళ్లు,కుతంత్ర,మత,కుల రాజకీయాలు పక్కన పెట్టి విద్యార్థులు,ప్రజల సమస్యలను పరిష్కరించడపై దృష్టి పెట్టాలని PDSU డిమాండ్ చేస్తోంది.మేము PDSU గా కోరుకునేది ఒక్కటే ఇంకనైనా భారత పౌరుడు, యువత,విద్యార్థులు మేల్కోవాల్సిన పరిస్థితి ఆసరణమైoధి ఎందుకంటే ఒక పోరాటం ద్వారానో , ఒక ఉద్యమం ద్వారానో మనసమస్యలను పరిష్కరించుకునే పరిస్థితి మన దేశంలో ఏర్పడింది.ఉదాహరణకు రైతు ఉద్యమం మనం ఆసరాగా తీసుకోవాలి.PDSU నిరంతరం విద్యార్థి,ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుంది.PDSU సిద్ధాంతాలు నచ్చి,PDSU పోరాటాలు చూసి కొంతమంది విద్యార్థులు మేము PDSU లో పనిచేస్తామని,మన హక్కుల ను సాధించుకునే విధంగా పోరాటాలు,ఉద్యమాలు చేస్తామని ప్రమాణం చేయడం జరిగింది. దీనిలో భాగంగానే కమిటీ నిర్వహించి వారికి పదవులను కేటాయించడం జరిగిందిని తెలిపారు.