జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం సభ్యులు రెండు బృందాలుగా రేపు 28వ తేదిన ఆదివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన నష్టాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయడంతో పాటు, బృందం సభ్యులు పర్యటించు ప్రదేశాల్లో సంబంధించిన నివేదికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జిల్లా అధికారులతో సమావేశమై కేంద్ర బృందం పర్యటన ముందస్తు ఏర్పాట్లుపై సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర బృందం సభ్యులు రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో అందుకనుగుణంగా అధికారులు ఆయా శాఖలకు సంబంధించి జరిగిన నష్టాలపై సమగ్ర నివేదికలతో కేంద్ర బృందం సభ్యులకు సవివరంగా వివరించేందుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరిగిన ప్రతి నష్టాన్ని కేంద్ర బృందం సభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్, జిల్లా అధికారులను ఆదేశించారు.
జరిగిన నష్టాలపై, వరద బాధితులకు చేపట్టిన సహాయ కార్యక్రమాలపై ఏర్పాటు చేయు ఫోటో ఎగ్జిబిషన్ ను ఒక ప్రాధాన్యత రూపంలో చక్కగా ఏర్పాటు చేయాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్న నేపధ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో జరుగుచున్న సహాయక కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. వచ్చే నెల డిశంబర్ 15వ తేది వరకు ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలను జిల్లాలోనే ఉంచాలని కలెక్టర్, జిల్లా రెవిన్యూ అధికారిని ఆదేశించారు. 24 X 7 కంట్రోల్ రూం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 104 టోల్ ఫ్రీ నెంబర్ మరో నెల రోజులపాటు డిజాస్టర్ రిలీఫ్ కొరకు పనిచేస్తుందని, ప్రజలు ఈ నెంబర్ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విధేహ్ ఖరే, శ్రీమతి రోజ్ మాండ్, మునిసిపల్ కమీషనర్ శ్రీ దినేష్ కుమార్, అడిషనల్ ఎస్.పి. శ్రీమతి వెంకటరత్నం, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు, నెల్లూరు ఆర్.డి.ఓ శ్రీ హుసేన్ సాహెబ్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ , ఆర్.డబ్ల్యు. ఎస్., ఆర్ అండ్ బి, హౌసింగ్, ఉద్యానశాఖ, మత్స్య శాఖ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కావలిలో జరిగిన బీటెక్
బీటెక్ విద్యార్థి హత్య ఘటనపై ఆరా... ఈ ఘటన ఎలా జరిగింది...కేసును లోతుగా దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన ఛేదించాలని ఆదేశాలు జారీచేసిన యస్.పి.గారు
నేర స్థలమునకు స్వయంగా చేరుకొని, నేర స్థలమును క్షుణ్ణంగా పరిశీలించి, సాక్ష్యాధారాలను, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీ చేసిన జిల్లా యస్.పి.గారు
నేర స్థలం వద్ద, పోస్ట్ మార్టం చేయడం ద్వారా కొన్ని క్లూస్ దొరికాయి..
నేరం జరిగిన తీరుని బట్టి మృతుని గత చరిత్ర, ప్రవర్తనపై లోతైన దర్యాప్తు.. తగిన మార్గదర్శకాలు
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని మరియు ముఖ్యమైన, తీవ్రమైన కేసుల్లో గుర్తుంచుకోవలసిన విషయాలు గురించి సలహాలు ,సూచనలు చేసిన యస్.పి.గారు...
అతి త్వరలోనే నేరస్థులను పట్టుకొని, న్యాయస్థానం నందు ప్రవేశ పెడతాము...కేసును చేధించిన తర్వాత పూర్తి వివరాలను తెలియజేస్తాము. యస్.పి.గారు
నెల్లూరు టౌన్ నవాబుపేట పరిధి భగత్ సింగ్ కాలనీ వద్ద నెల్లూరు-విజయవాడ NH16 రోడ్డుకు గండి పడిన జరుగుతున్నమరమ్మత్తు పనులను పరిశీలించిన జిల్లా శ్రీ విజయ రావు,IPS., గారు...
◆ రోడ్లు పాడైన సందర్భంగా NHAI అధికారులతో చర్చించిన జిల్లా యస్.పి. గారు
◆ వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సింగిల్ వే లో చాలా స్మూత్ గా వాహనాలు వెళ్ళే విధంగా నిరంతరం విధులు నిర్వహించేలా టౌన్, రూరల్ సిబ్బంది ఏర్పాటు చేసిన యస్.పి. గారు..
◆ రోడ్లపై రేడియం బారికేడ్స్ ఏర్పాటు చేసేలా తక్షణ ఆదేశాలు..వెంటనే ఏర్పాటు...వాహనదారులను అప్రమత్తం చేయాలని ఆదేశాలు..
◆తొందరగా పనులు పూర్తి చేసి, ఇరువైపులా వాహనాలు వెళ్లే
విజయనగరం జిల్లా, మక్కువ మండల పరిధికి చెందిన మహిళ కుటుంబ కలహాల నేపధ్యంలో తప్పిపోయారని, జిల్లాలో ఉన్నట్లుగా జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారికి మహిళా కమీషన్ ద్వారా సమాచారం అందజేయడంతో వెంటనే స్పందించి,
మహిళను క్షేమంగా తీసుకు వచ్చి స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన జిల్లా యస్.పి. గారు..
విజయనగరం SP గారితో స్వయంగా మాట్లాడి, ఒక SI, మహిళా కానిస్టేబుల్ తో ప్రత్యేక వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేసిన యస్.పి. గారు...
బాధిత మహిళ నెల్లూరు లోని డ్రైవర్స్ కాలనీలో ఉంటున్న అను ఓ వ్యక్తి తో 7 నెలల నుండి స్టార్ మేకర్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ఇంట్లో కలహాలు పెట్టుకొని ఇంట్లో నుండి పారిపోయేందుకు కారణం
మహిళని పెళ్ళిచేసుకొని ,ఆమె పిల్లలను తనపిల్లలు వలె చూసుకొంటానని నమ్మించిన నెల్లూరుకు చెందిన వ్యక్తి
చేధించినందుకు బాధిత కుటుంబ సభ్యులు యస్.పి. గారికి ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు..
న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర సందర్భంగా నెల్లూరు నడిబొడ్డున మార్మోగిన జై అమరావతి నినాదం
పాదయాత్రకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు నాయకులు, న్యాయవాదులతో పాటు సామాన్య ప్రజల నుంచి విశేష స్పందన
రాజధాని రైతులకు హారతులు పట్టిన సింహపురి ప్రజానీకం
జోరువానకూ జడవని అన్నదాతలు...బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
*పాదయాత్రలో పాల్గొని రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించిమ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు
మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్
మూడు రాజధానుల నిర్ణయం ఆనాలోచితం..రాష్ట్రంలో సాగుతున్న ప్రజాపాలన కాదు, విధ్వంసకర పాలన
మాట తప్పను..మడమ తిప్పననే ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అసెంబ్లీలో అమరావతికి ఎందుకు మద్దతు పలికారు..ఈ రోజు మాట ఎందుకు తప్పారు
సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తుంటే ఎందుకు అడ్డం చెప్పలేదు
అన్ని పార్టీలతో పాటు ప్రజలు రాజధానిగా ఆమోదించిన అమరావతికి ఎందుకు కక్ష కట్టారు
పరిపాలన వికేంద్రీకరణ కాదు..చేతనైతే అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యి
మూడు రాజధానుల నిర్ణయం పిచ్చిపాలనలో భాగమే
అమరావతి ఆడపడుచుల పాదయాత్ర చూస్తుంటే ప్రతి ఒక్కరికీ కంట కన్నీరు వస్తోంది...ఇది చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం
దేవుడి ఆశీస్సులు, ఐదు కోట్ల ఆంధ్రుల మద్దతుతో కచ్చితంగా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది