నేదురుమల్లిని కలిసిన పేర్నాటి దంపతులు
నేదురుమల్లి ఇంట సందడే.. సందడి..
నేదురుమల్లి ఇంటికి తరలివచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రముఖులు నేదురుమల్లి- పేర్నాటి భేటి తో విమర్శలకు చెక్ నేదురుమల్లిని సత్కరించిన పేర్నాటి దంపతులు పేర్నాటి దంపతులను సన్మానించిన నేదురుమల్లి ఐక్యత చాటిన నేదురుమల్లి- పేర్నాటి
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు తిరుపతి, బాపట్ల పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల పరిశీలకులు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఛైర్ పర్సన్ పేర్నాటి హేమ సుష్మిత రెడ్డి దంపతులు మరియురాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఎం డి శేఖర్ బాబులుమంగళవారం వాకాడులోని నేదురుమల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని పేర్నాటి దంపతులు శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛాలు అందజేసి సత్కరించారు,అదేవిధంగాపేర్నాటిదంపతులు,రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్థ ఎం డి శేఖర్ బాబుల ను రాం కుమార్ రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు, అనంతరం పలు విషయాలు పై సుదీర్ఘంగా చర్చించారు, ఈ సందర్భంగా రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిత్తనాభివృద్ది సంస్థ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టినపేర్నాటి హేమ సుష్మిత రెడ్డికిఅభినందనశుభాకాంక్షలుతెలియజేస్తున్నాం అన్నారు, పేర్నాటి హేమ సుష్మిత రెడ్డికి అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సోదరులురాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని కూడా అభినందించారు.
అనంతరం శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి కుటుంబంతో తమ కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది,సోదరులు రాంకుమార్ రెడ్డి ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు, అందరం వైసీపీ కుటుంబ సభ్యులం అనీ తమ మధ్య ఎటువంటి వర్గ విబేధాలు లేవుఅన్నారు. రైతుల కళ్ళలో ఆనందం చూసే విధంగా తాము చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను రాం కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని, ఆయన కూడా తమకు పలు సూచనలు సలహాలు అందించారు అని ఆయన వెల్లడించారు, ఇది ఇలా ఉంటే సోమవారం విద్యానగర్ లో జరిగిన ఆత్మీయ సభ కు పే ర్నాటి హాజరు కాకపోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి వాటికి సమాధానం గా మంగళవారం నేదురుమల్లి ని పేర్నాటి దంపతులు కలవడంతో విమర్శలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.