రాష్ట్రంలో 1000 సీడ్ ప్రొడక్షన్ గ్రామాల ఏర్పాటు....
వాకాడు.. రాష్ట్ర రైతుల సౌకర్యార్థం 1000 గ్రామాలలో సీడ్ ప్రొడక్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు విత్తన అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ పేర్నాటి. హేమ సుస్మిత భర్త వైకాపా రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి. శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలో ఉన్న ఆర్ బి కే ను ఆ సంస్థ ఎండి శేఖర్ బాబు తో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేర్నాటి మాట్లాడుతూ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర రైతులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ఉన్నారు.ఆ దిశగా విత్తనాభివృద్ధి సంస్థ పలు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆ దిశగా రైతులకు క్వాలిటీ సీడ్ పంపిణీ తోపాటు డిఎన్ఏ ల్యాబ్లు ఏర్పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో గోదాములు నిర్మాణాలు తదితర చర్యలు మంజూరు చేస్తున్నామన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ శేఖర్ బాబు మాట్లాడుతూ ఆర్ బి కె సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడమే తమ సంస్థ లక్ష్యం అన్నారు. నకిలీ విత్తనాలు అధిక ధరలతో విక్రయించిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తిరుపతి బాపట్ల పార్లమెంటు పరిశీలకులు రామ్ కుమార్ రెడ్డిని పేర్నాటి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ దంపతులను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అభినందిస్తూ వారిని ఘనంగా సత్కరించారు. ఎన్ బి కె ఆర్ విద్యాసంస్థలు వ్యవసాయ శాఖకు సంబంధించిన కోర్సు ను ప్రారంభించాము, మా కళాశాల సేవలను విత్తనాభివృద్ధి సంస్థ సద్వినియోగం చేసుకోవాలని పేర్నాటి దంపతులను, ఎండీ ని కోరారు. ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నార అన్నారు. పలు విషయాలు వారితో చర్చించారు.