భద్రత ఎక్స్ గ్రేషియా చెక్కును అందచేసిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.
భద్రత ఎక్స్ గ్రేషియా చెక్కును అందచేసిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు
SPS నెల్లూరు : ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుందో తెలుసు.. ధైర్యంగా ఉండండి..
ఎటువంటి సమస్య అయినా, నా దృష్టికి తీసుకు రండి. అమరులైన పోలీసు కుటుంబాలు నిర్భయంగా ఉండండి.. మేము ఉన్నాము. తల్లిగారిని బాగా చూసుకోవాలని మృతుని కుమారునికి సూచన. కష్టపడి చదివి, ఉన్నతస్థాయికి వెళ్ళాలి.. మంచి పేరు తీసుకురావాలి.. యస్.పి. గారు.
ఈ రోజు అనగా తేది.14.10.2021 న SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారు విధి నిర్వహణలో మరణించిన మృతుని కుటుంబానికి భద్రత ఎక్స్ గ్రేషియా చెక్కుని అందించటం జరిగినది. వివరములలోకి వెళ్ళితే ASI-788 శ్రీ N.సుబ్రమణ్యం గారు గూడూరు 1 టౌన్ పి.యస్. నందు విధులు నిర్వహిస్తూ 17.07.2021 వ తేదీ నాడు అనారోగ్యంతో మరిణించినారు. వీరికి రావలసిన భద్రత క్రింద 4,00,000/- ల చెక్కును మృతుని భార్య శ్రీమతి విజయ, కుమారుడు శ్రీ అవినాష్ గార్లకు అందచేయటం జరిగినది. ఈ సందర్బంగా జిల్లా యస్.పి. గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, మీ నాన్న గారి పేరు నిలబెట్టాలని, వీరికి ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా వచ్చి కలవవచ్చు అని తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి పి.వెంకటరత్నం గారు, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీమతి ఖతీజా బేగం, B4 క్లర్క్ శ్రీ మాలకొండయ్య మరియు మృతుని భార్య, కుమారుడు పాల్గొన్నారు.