ప్రజాలందరీ ఆరోగ్య భద్రతే లక్ష్యంగా..స్వచ్ఛ వెంకటగిరి - స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్..దిశగా అడుగేద్దాం.. ఆనం రామనారాయణ రెడ్డి
ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు రూపకల్పన చేసిన.. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా.. నేడు వెంకటగిరి పట్టణం నందు మున్సిపల్ శాఖ వారి సహకారంతో.. 40 లక్షల ప్రభుత్వ నిధులతో...ప్రతి ఇంటికి మూడు చెత్త బుట్టల (తడి చెత్త, పొడి చెత్త, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు) పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వెంకటగిరి పట్టణంలోని ప్రతి కుటుంబానికి చెత్త బుట్టల పంపిణీకి శ్రీకారం చేసిన మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు
దిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడోరోజూ పెరిగాయి. సోమవారం (11-10-2021) లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.44, డీజిల్ రూ.93.17కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.110.41, రూ.101.03గా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుదల కారణంగానే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర 82 డాలర్లకు ఎగబాకింది. దీనికి తోడు రోజుకి 0.4 మిలియన్ల బ్యారెళ్లకు మించి ఉత్పత్తిని పెంచొద్దన్న ఒపెక్ కూటమి నిర్ణయం చమురు ధరలపై ఒత్తిడి పెంచుతోంది. నెల క్రితం బ్రెంట్ బ్యారెల్ ధర 72 డాలర్లుగా ఉండింది.
ప్రధాన నగరాల్లో లీటర్ డీజిల్, పెట్రోల్ ధరలు..
నగరం పెట్రోల్(రూ.లలో) డీజిల్(రూ.లలో)
హైదరాబాద్ 108.64 101.66
విజయవాడ 110.63 103.05
విశాఖపట్నం 109.50 101.97
దిల్లీ 104.44 93.17
ముంబయి 110.12 101.03
చెన్నై 101.89 97.69
బెంగళూరు 108.08 98.89
2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పక్కా గృహాలు పాత బిల్లులు వెంటనే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఎంపీడీవో భవానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సర్వోత్తమ్ రెడ్డి ఎస్ కే జలీల్ భాష నౌషాద్ నెల్లూరు మోహన్ రెడ్డి తేదేపా నాయకులు పాల్గొన్నారు
నెల్లూరు నగరంలోని 6వ డివిజన్ పరిధిలోని శెట్టిగుంటరోడ్డు నందు ఐలాండ్ సుందరీకరణ పనులను, అక్కడే ఏర్పాటు చేసిన స్వచ్చ మాత (శానిటరీ వర్కర్) విగ్రహాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ దినేష్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు మద్దినేని శ్రీధర్, కిన్నెర మాల్యాద్రి, అడపా శ్రీధర్, బి.సత్యకృష్ణ, వంశీ, తదితరులు పాల్గొన్నారు.