విద్యార్థులకు అన్యాయం జరిగే జీవో నెంబర్ 55,77 లను వెంటనే రద్దు
చేయాలని : ఎబివిపి
ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు.
శుక్రవారం ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక గూడూరు రెండో పట్టణ పరిధిలో మాలవ్యా నగర్ సెంటర్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రభుత్వం, విద్య ఉన్నతాధికారుల అనాలోచిత చర్యల వలన గ్రామీణ పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అంగడిలో సరుకు మాదిరిగా తయారు చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను శాశ్వతంగా దూరం చేసే ఈ దుర్మార్గపు జీవోలు ప్రభుత్వం తేవడం కుట్ర పూరితమని అన్నారు. జీవో 55 ఫలితంగా డిగ్రీ కాలేజ్ లో ఉన్న సీట్లలో కేవలం 70 శాతం కన్వీనర్ కోటాలో భర్తీ చేసి మిగిలిన 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తే అది పేద విద్యార్థుల పట్ల గుదిబండగా మారుతుందనడంలో సందేహం లేదని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల విద్యార్థులకు తీవ్రంగా నష్టం చేసే ఈ జీవోలో ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. అలా కాని పక్షంలోరాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేశారు. జీవో నెంబర్ 77 వలన ప్రైవేట్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన రాదు అని జీవో నెంబర్ 77 జారీ చేయడం వలన అనేక మంది పేద విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందిగా మారిందని పాదయాత్ర ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తాము అని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు జీవో నెంబర్ 77 తీసుకురావడం అన్యాయమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర ఉద్యమం తీసుకొస్తామని వారు హెచ్చరించారు ఈకార్యక్రమంలో జిల్లా హాస్టల్ సమీర్ చిన్న, నగర కార్యదర్శి కార్తీక్ ఏబీవీపీ నాయకులు గోకుల్, ప్రదీప్, కిరణ్, నవీన్ సందీప్ , ఋగ్వద్, ఎస్ రాజ్ కుమార్ తదితరులు